కంకుల గుండు
స్వరూపం
కంకుల గుండును కంకల గుండు అని కూడా అంటారు.ఈ గుండు రాతితో తయారుచేసినదై ఉంటుంది. ఇది స్థూపాకార ఆకృతి కలిగి ఉండును.దీని వ్యాసం సుమారు 1 మీటరు ఉంటుంది. ఈ స్థూపాకారాకృతిలో గల రాతి అక్షం వద్ద ఇనుప చువ్వ ఉంటుంది. ఇది ఆ గుండు తన అక్షం పై తిరుగుటకు ఈ చువ్వ వినియోగ పడుతుంది. కంకుల నుండి గింజలను వేరు చేయడానికి ఈ కంకుల గుండును ఉపయోగిస్తారు. కల్లంలో కంకులను పరచి వాటిపై కంకుల గుండును ఎద్దులకు కట్టి తిప్పడం ద్వారా కంకుల నుండి గింజలు విడిపోతాయి. కంకుల నుండి విడిపోయిన గింజలను చేటతో తూర్పారబట్టడం ద్వారా వేరు చేసి భద్రపరుస్తారు. ప్రస్తుతకాలంలో కంకుల గుండును చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. నేడు కంకులగుండు స్థానంలో ట్రాక్టర్ లను ఉపయోగించి కంకులను తొక్కిస్తున్నారు.
చిత్రమాలిక
[మార్చు]-
కంకుల గుండు పెద్ద రాతి చక్రం వలె ఉంటుంది.
-
కంకులగుండు చాలా బరువుగా గుండ్రంగా, స్థూపాకారంలో చక్రం వలె ఉన్న దీనికి ఇరుసు బిగించడానికి రంధ్రం ఉంటుంది.