కొమరంభీమ్ (సినిమా)
కొమరంభీమ్ | |
---|---|
దర్శకత్వం | అల్లాణి శ్రీధర్ |
సంగీతం | గౌతం ఘోష్ |
నిర్మాణ సంస్థ | ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జూలై 2, 2010 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొమరంభీమ్ 2010, జూలై 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జీవితం ఆధారంగా నిర్మించిన చిత్రం. భూపాల్ రెడ్డి ప్రధాన పాత్రను పోషించాడు. ఈచిత్రం నిర్మాణానంతరం దాదాపు 20 సంవత్సరాలకు విడుదలయ్యింది. విడుదలకు ముందే ఈ చిత్రం ఉత్తమ దర్శకత్వానికి, ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా రెండు నంది పురస్కారములను సాధించింది.[1][2]
కథ
[మార్చు]ఈ చిత్రం నిజాం అణచివేత పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు నాయకత్వం వహించిన నిజ జీవిత హీరో కొమరం భీమ్ నేతృత్వంలో 1940లలో ఆదిలాబాద్‌లో జరిగిన గోండుల పోరాటాన్ని నేపథ్యంలో రూపొందించబడింది. ఈ చిత్రం దాదాపు 20 సంవత్సరాల తరువాత విడుదలైనప్పటికీ హైదరాబాద్‌లో 100 రోజులు ప్రదర్శించబడింది.[3]
నటవర్గం
[మార్చు]- భూపాల్ రెడ్డి (కొమురం భీమ్)
- మౌనిక (సోంబాయి, కొమురం భీమ్ భార్య)
- బ్యాంక్ ప్రసాద్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: అల్లాణి శ్రీధర్
- సంగీతం: గౌతం ఘోష్
- నిర్మాణ సంస్థ: ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్
అవార్డులు
[మార్చు]ఐటీడీఏ సంస్థ కేటాయించిన 20 లక్షల రూపాలతో ఆ చిత్రం రూపొందింది. 1988లో తెరకెక్కిన ఈ చిత్రంకు 1990లో నంది అవార్డులు వచ్చాయి.[4]
- నంది ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం
- నంది ఉత్తమ దర్శకుడు - అల్లాణి శ్రీధర్
మూలాలు
[మార్చు]- ↑ "After 20 yrs in the can, film on Gonds to hit the screen - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2010-07-02. Archived from the original on 2011-08-11. Retrieved 2020-08-15.
- ↑ హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (18 December 2018). "కొమరంభీమ్ సినిమా!". www.hmtvlive.com. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.
- ↑ http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/komaram-bheem-bags-national-award/article4113889.ece
- ↑ సాక్షి, గెస్ట్ కాలమ్స్ (5 October 2017). "కుమ్రంభీమ్ స్ఫూర్తితో సాగుదాం". Sakshi. గుమ్మడి లక్ష్మీనారాయణ. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.