కోలారు బంగారు గనులు
కోలార్ బంగారు గనులు
కెజిఎఫ్ | |
---|---|
పట్టణం | |
దేశము | India |
రాష్ట్రము | కర్ణాటక |
జిల్లా | కోలారు జిల్లా |
Government | |
• Body | Robertsonpet city municipal council |
విస్తీర్ణం | |
• Total | 58.12 కి.మీ2 (22.44 చ. మై) |
Elevation | 3,981 మీ (13,061 అ.) |
జనాభా (2010) | |
• Total | 2,33,000 |
• జనసాంద్రత | 4,000/కి.మీ2 (10,000/చ. మై.) |
భాషలు | |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 563115 -563122 |
టెలిఫోన్ కోడ్ | 08153 |
Vehicle registration | KA 08 |
దగ్గరి నగరం | బెంగులూరు, కోలారు |
లోక్‌సభ స్థానము | కోలారు |
విధానసభ స్థానము | కెజిఎఫ్ |
Avg. summer temperature | 32 °C (90 °F) |
Avg. winter temperature | 12 °C (54 °F) |
Website | http://www.robertsonpetcity.gov.in |
కోలారు బంగారు గనులు (కెజిఎఫ్ లేదా కోలార్ గోల్డ్ మైన్స్ ) అనునవి కోలారుకు సమీపంలో గల బంగారు గనులు.
చారిత్రక నేపధ్యం
[మార్చు]ఇక్కడి బంగారు గనులకు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉంది. ఒక అధ్యయనం ప్రకారం హరప్పా, మొహంజొదారో నాగరికత నాటికే ఇక్కడ గనుల నుండి బంగారాన్ని వెలికితీసేవారు. గుప్తుల స్వర్ణయుగ కాలంలో దాదాపు 50 మీటర్లు భూమి లోపలికి తవ్వకాలు సాగించి బంగారాన్ని వెలికితీసేవారని తెలిసింది. వారి తదనంతరం చోళులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్ కూడా బంగారం తవ్వకాలను కొనసాగించారు. 1802 లో కెప్టెన్ వారెన్ అను బ్రిటీష్ వ్యక్తికి గనుల తవ్వకాలకు అనుమతి లభించింది. పిమ్మట బెంగుళూరుకు చెందిన ఎం. ఎఫ్. లావెల్లీ అనే బ్రిటీష్ వ్యక్తి గనుల తవ్వకానికి అనుమతి కోరుతూ మైసూరు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. 1875 లో అనుమరి మంజూరైనా అధిక ఖర్చు కావడంతో అతడు తవ్వకాలను ప్రారంభించలేకపోయాడు.
కాలక్రమంలో జాన్ టేలర్ కంపెనీ చొరవతో ఇక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. కొన్ని వందల బ్రిటీష్ పౌరులు ఇక్కడికి తరలి రావడంతో ఈ ప్రాంతం చిన్న సైజు ఇంగ్లాండుని తలపించేది. కర్ణాటకతో బాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి కొన్ని వేల మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 1901- 1910 మధ్యకాలంలో ఈ గనులనుండి రికార్డు స్థాయిలో ఒక లక్షా డెబ్భైవేల (1,70,000) టన్నుల ముడి ఖనిజాన్ని వెలికితీశారు. మంచి లాభదాయకంగా ఉండటంతో సంస్థ యాజమాన్యం కూడా ఇక్కడ గనుల తవ్వకాన్ని ప్రోత్సహించింది. పట్టణ శివార్లలోని 12 వేల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ తవ్వకాలు కొనసాగేవి. ముఖ్యంగా ఛాంపియన్ రీవ్ అనే గనిలో ఐతే దాదాపు 3 కిలోమీటర్ల తోతువరలు తవ్వకాలు జరిపారు. దీనివలన ఈ గని ప్రపంచంలోనే లోతైన రెండవ గనిగా ప్రాచుర్యం పొందింది.
మూసివేత
[మార్చు]పెరిగిన తవ్వకం వ్యయం, ముడి ఖనిజంలో బంగారం శాతం గణణీయంగా తగ్గడంతో భారత జాతీయ ప్రభుత్వం 2001 మార్చి 21 న ఈ గనులను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
యితర లింకులు
[మార్చు]- Article on KGF
- KGF
- ఈ బంగారు గని ఆధారంగా కల్పిత కథ కె.జి.యఫ్ చాప్టర్ 1 పేరుతో ఒక సినిమా వచ్చింది.