గామా కిరణాలు

వికీపీడియా నుండి
(గామా కిరణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
న్యూకాలియార్ ఫిషన్ సమయంలో వెలువడుతున్న గామా కిరణాలు .

గామా కిరణాలు అతి శక్తిమంతమైన విద్యుదయస్కాంత తరంగాలు (waves). వీటి తరంగ దైర్ఘ్యం అతి తక్కువగా ఉంటుంది కనుక (లేదా పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది కనుక) వీటిని కిరణాలు (rays) గా ఊహించుకున్నా తప్పు లేదు. విద్యుదయస్కాంత తరంగాలు ఒక రకమైన వికిరణం (radiation) కనుక వీటిని గామా వికిరణం అని కూడా అంటారు. వీటిని గ్రీకు అక్షరం గామా ( γ ) చే సూచించడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. అణు తత్త్వం అప్పుడప్పుడే అర్థం అవుతూన్న కొత్త రోజుల్లో - బీజ గణితంలో అవ్యక్త రాశిని x అన్నట్లు - అర్థం కాని మూడు రకాల వికిరణాలకి ఆల్ఫా, బీటా, గామా అని పేర్లు పెట్టేరు. x-కిరణాల పేరు కూడా ఇలా వచ్చినదే. ఆ పేర్లు అలా అతుక్కు పోయాయి.

విద్యుదయస్కాంత వికిరణం యొక్క తరంగాలు పొట్టివవుతూన్న కొద్దీ వాటిలో నిక్షిప్తమైన శక్తి పెరుగుతుందని గమనించాలి. అనగా పొట్టి తరంగాలు శక్తిమంతమైనవి. ఈ లెక్కని ఎరుపు రంగు కిరణాల కంటే ఊదా రంగు (violet) కిరణాలు శక్తిమంతమైనవి. అంత కంటే x-కిరణాలు, వాటి కంటే గామా కిరణాలు శక్తిమంతమైనవి. ఈ శక్తిమంతమైన కిరణాలు ఏవయినా మన శరీరాన్ని తాకితే హాని చేస్తాయి. ఇలా హాని కలుగ జేసే శక్తిమంతమైన వికిరణాన్ని "అయనైజింగ్ రేడియాషన్‌" అని కూడా అంటారు.దీని వలన కొన్నిసార్లు జెన్యు మార్పిడి కూడా జరగవచ్చు.

మూలాలు[మార్చు]