గొడవర్తి సత్యనారాయణ వరప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొడవర్తి సత్యనారాయణ వరప్రసాద్

డా.జి.యస్వీ.ప్రసాద్ గా ప్రసిద్ధులు
అభినవ కృష్ణరాయ -డా.శ్రీ జి.ఎస్.వి.ప్రసాద్-అధ్యక్షులు-శ్రీ నన్నయ భట్టారక పీఠం
డా.జి.యస్వీ.ప్రసాద్ గారి ఛాయాచిత్రపటం.
జననం
గొదడవర్తి సత్యనారాయణ వరప్రసాద్

(1945-11-23) 1945 నవంబరు 23 (వయసు 78)
జాతీయతభారతీయుడు
వృత్తిడాక్టర్
ఉద్యోగంఇ.ఎన్.టి.స్పెషలిస్ట్
తల్లిదండ్రులుతండ్రి గొడవర్తి కాటం రాజు,తల్లి :శ్రీమతి వెంకాయమ్మ

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]
అభినవ కృష్ణరాయ -డా.శ్రీ జి.ఎస్.వి.ప్రసాద్-అధ్యక్షులు-శ్రీ నన్నయ భట్టారక పీఠం
దస్త్రం:వేంగీ వైభవం సాహిత్య రూపకంలో రాజరాజ నరేంద్రుని పాత్రలో డా జి యస్వీ ప్రసాద్ గారు.jpg
రాజరాజ నరేంద్రునిగా

గొడవర్తి సత్యనాతరయణ వరప్రసాద్ ప్రజాదరణ పొందిన పేరు డాక్టర్.జి.యస్వీ.ప్రసాద్. వీరు 23-11-1945 వ సంవత్సరంలో శ్రీ గొడవర్తి కాటంరాజు, శ్రీమతి వెంకాయమ్మ పుణ్య దంపతులకు వీరి తాతగారి గ్రామం తణుకు తాలూకా కె.ఇల్లిందలపర్రు గ్రామంలో జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండేపాడు గ్రామం వీరి స్వస్థలం. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం బి.కొండేపాడు గ్రామంలో చదివారు. హయ్యర్ ఎలిమెంటరీ 8వ తరగతి వరకూ విద్యాభ్యాసం పెంటపాడు మండలం రావిపాడులో చదివారు. ఉన్నత పాఠశాల చదువు 9వ తరగతి నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తణుకులో చదివారు. ఇంటర్మీడిఎట్ తణుకులో చదివారు.

ఉన్నత విద్యాభ్యాసం

[మార్చు]

యం.బి .బి .యస్. యం.యస్. (ENT) చదువు కూడా ఆంధ్రా మెడికల్ కాలేజీలోనే చదివారు. 1973 వ సంవత్సరం నవంబరు నెలలో ప్రముఖ జనరల్ సర్జెన్ శ్రీ తాతిన రామబ్రహ్మము గారితో కలిసి శ్రీ సావిత్రి నర్సింగ్ హోం తణుకులో ప్రారంభించారు. 1975 నుండి 1977 వరకు united Kingdom లో Ear Surgery లో హయ్యర్ ట్రైనింగ్ పొందారు. వీరు Walse Gravce Hospital లో సీనియర్ హౌస్ ఆఫీసర్ గా యెన్నో Workshops in Advanced courses in Micro Ear Surgery.నిర్వహించారు.

వ్యక్తీగత జీవితం-సాహిత్య సేవ

[మార్చు]

దేశ భాషలందు తెలుగులెస్స అని తెలుగు భాషను కీర్తించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఆస్థానంలో భువనవిజయ సభా మంటపంలో అష్టదిగ్గజాలనే కవులు ఉండేవారు వారు అద్భుతమైన ప్రబంధాలను రచించి తెలుగు భాషకు ఎనలేని కీర్తి తెచ్చారు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో జీవించిన వ్యక్తీ తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.యస్వీ.ప్రసాద్. ప్రసిద్ధి చెందిన తణుకు నన్నయ భట్టారక పీఠానికి అధ్యక్షుడు కూడా అయిన జి.యస్వీ.ప్రసాద్ భువనవిజయ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రను పోషించారంటే ఆ కార్యక్రమం ఏంటో రక్తి కడుతుంది. ప్రేక్షకులు ఆనందంతో పొంగిపోతారు. అలనాడు శ్రీకృష్ణదేవరాయ చక్రవర్హ్తి సభ నడిపించినట్లే ఈయన కూడా భువనవిజయ కవితా సభను నిర్వహించారు. అందుకే డాక్టర్.జి.యస్వీ.ప్రసాద్ ను ఇటీవల తణుకు పురపాలక సంఘం ఘనంగా సత్కరించి “అభినవ కృష్ణదేవరాయ”బిరుదు ప్రధానం చేసింది. గోదావరి సీమలోని కవిపండితుల కళా సాంస్కృతిక సాహిత్య సమాహారంగా ఉగాది ఉత్సవాలలో నిర్వహించిన గౌతమీ వైభవంలో వీరు కళాప్రపూర్ణ ముళ్ళపూడి తిమ్మరాజు పాత్రను అభినయించారు.ఆయన ఉచ్చారణను కంఠమాధుర్యాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్ర అధికారులు ఎంతగానో ప్రశంసించారు.డాక్టర్ జి.యస్వీ.ప్రసాద్ కళాకారుడు మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యంగా మంచి కళాపోషకుడు కూడా సాహిత్య కళా వికాశానికి ప్రతీఏటా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన మహనీయులకు గొప్ప సాహితీవేత్తలకు డాక్టర్ జి.యస్వీ.ప్రసాద్ సాహితీ పురస్కారమనే పేరుతొ 5 వేల 116 రూపాయలు ఇచ్చి సత్కరిస్తున్నారు. ప్రతీఏటా క్రమం తప్పకుండా వేల రూపాయలను సాహితీ సేవకు వినియోగించడం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తణుకులో సుదీర్ఘ చరిత్రకలిగిన నన్నయ భట్టారక పీఠం ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నప్పుడు ఆ సంస్థకు రెండు లక్షల రూపాయలు మూల నిధిని సమకూర్చి పీఠం ఉన్నతికి ఆయన పునాదిని వేశారు. గోస్తనీ నదిపై నన్నయ్య కాంస్య విగ్రహ స్థాపన కోసం డాక్టర్ ప్రసాద్ విశేషంగా కృషి చేశారు . వృత్తి పరంగా ప్రసాద్ వైద్యుడు చెవి, ముక్కు, గొంతుల స్పెషలిస్ట్. ఈ రంగంలోకూడా డాక్టర్ ప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ రంగంలో చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రిని తొలిసారిగా నెలకొల్పింది ఈయనే 1973 లో స్థాపించిన ఈ ఆసుపత్రి మూడు దశాబ్దాలను పూర్తి చేసుకోబోతోంది.ఈ 30 ఏళ్ళలోనూ వేలాది మందికి వైద్య సేవలందించారు. తణుకు లోని రామకృష్ణ సేవా సమితి నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో ఆయన ఎందరో రోగులకు ఉచితంగా పరీక్షించి మందులు అందించడం ఎంతో కాలంగా చేస్తున్నారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటి సేవా సంస్థల ఆద్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలలో డాక్టర్ ప్రసాద్ సేవలందించారు. ప్రసాద్ తన పేరుమీదుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి ట్రావెల్ ఫెలోషిప్ గా ఉపకారవేతనం అందిస్తున్నారు. కళా సాహిత్య రంగాలలో రాణిస్తూనే వైద్య వృత్తిలో నైపుణ్యాన్ని కనబరుస్తూ ప్రసాద్ పలువురికి ఆదర్శంగా నిలిచారు.

మూలాలు

[మార్చు]

http://newstime.in/index.php?page=news&id=2293 Archived 2015-09-27 at the Wayback Machine 25-05-2004 నాటి ఆంధ్రభూమి దినపత్రిక టాలెంట్ షౌ అభినవ కృష్ణదేవరాయ డాక్టర్ ప్రసాద్ వ్యాసం