చర్చ:తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా
Appearance
(చర్చ:తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా నుండి దారిమార్పు చెందింది)
మంచి సినిమాల జాబితా
[మార్చు]- హిట్ సినిమా అన్న ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పేరు పెట్టగలమా
- హిట్ సినిమాల లిస్ట్ తయారీతో పాటుగా పేరు తెచ్చుకున్న సినిమాల జాబితా వేరుగా ఉంచితే బాగుంటుంది. చాలా చక్కటి సినిమాలు, అయా సంవత్సరాలలో ఇతర "హిట్ చిత్రాల" పక్కన చూస్తుంటే చాలా ఎబ్బెట్టుగా ఉన్నది. ఉదాహరణలివ్వటం అంత భావ్యం కాదు.
- హిట్ చిత్రమయి, మంచి చిత్రంగా పేరొందిన చిత్రాల జాబితా సంవత్సరాలా వారిగా ప్రత్యేకంగా తయారు చేస్తే బాగుంటుంది. అటువంటి జాబితా మొదట్లో కొంత వివాదాస్పదం కావచ్చు. కాలక్రమేణా, పరిణితి చెందిన సభ్యుల సహకారంతో ఒక చక్కటి సినీ జాబితా తయారవుతుంది 75 సంవత్సరాల సినీ చరిత్రకు మంచి నివాళి అవుతుంది.
- అలాగే, హిట్ చిత్రం కాకపోయినా మంచి చిత్రంగా పేరొందిన చిత్రాలు అనేకం. ఉదాహరణకి, బాపు గారి సాక్షి (సినిమా). అటువంటి హిట్ కాని మంచి చిత్రాల జాబితా కూడ సంవత్సరాలా వారిగా ప్రత్యేకంగా తయారు చెయ్యగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.--SIVA 14:34, 7 డిసెంబర్ 2008 (UTC)