Jump to content

చుటు వంశీయులు

వికీపీడియా నుండి

చుటు వంశీయులు కుంతల, మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు. వీరు నాగ వంశీయులని కొందరు చరిత్రకారులు భావించారు. కన్హేరి, బనవాసి ప్రాంతాల్లో వీరి శాసనాలు లభించాయి. హరితపుత్ర, విష్ణుకడ, చుటుకులానంద పేర్లు వీరికున్నాయి.

ఆభీరులు: శాతవాహనుల తర్వాత ఆభీరులు పశ్చిమ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యం స్థాపించారు. మాధరీపుత్ర శాశ్వరసేనుడు గురించి నాసిక్ శాసనం ప్రస్తావించింది.

వాకాటకులు: సా.శ. 4,5 శతాబ్దాల్లో విదర్భ ప్రాంతాన్ని పాలించారు.అజంతాలో కొన్ని చైత్య గుహాలయాలు నిర్మించారు. ఈ రాజ్య స్థాపకుడు వింధ్యశక్తి. వీరి రాజధాని పురికా. వాకాటక రాజుల్లో రెండో ప్రవరసేనుడు ప్రాకృత భాషలో సేతుబంధ కావ్యం రచించాడు. వాకాటకులు బాదామి చాళుక్యుల చేతిలో ఓడిపోయారు.

కదంబులు: బనవాసి (మైసూరు) ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. మయూరశర్మ ఈ వంశ స్థాపకుడు. (సా.శ. 345-60). వీరి రాజధాని వైజయంతి (బనవాసి).

నాటి సామాజిక, మత, సాంస్కృతిక వికాసం ఇక్ష్వాకుల కాలంలో రాజులను సామ్రాట్, రాజన్, మహారాజుగా శాసనాలు వర్ణించాయి. రాణులకు మహాదేవి అనే బిరుదు ఉంది. రాజ్యానికి సర్వాధికారి రాజు. ధర్మశాస్త్రాలను అనుసరించి పాలన సాగేది.

యువరాజులు, మహాతలవరులు, మహాసేనాపతులు, మహాదండనాయకులు, అమాత్యులు రాజుకు సహాయకులుగా ఉండేవారు. యజ్ఞయాగాలు, అశ్వమేధ, రాజసూయ, వాజపేయ క్రతువుల ద్వారా రాజ్యాన్ని సుస్థిరపర్చుకున్నారు.

ఇక్ష్వాకులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా, శాలంకాయనులు విషయాలుగా, బృహత్పలాయనులు ఆహారాలుగా విభజించారు. సామంత రాజుల భార్యలకు మహాతలవరి, మహాసేనాపతిని అనే బిరుదులుండేవి. మహాదండనాయకుడు సైన్యాధ్యక్షుడు.