నా పేరు బికారి నా దారి ఎడారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు బికారి...నా దారి ఎడారి అను ఈ పాట శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976) అను సినిమా లోనిది. ఈ పాటకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాహిత్యాన్ని అందించగా, ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు. ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని సమకూర్చారు.


పాట-వివరణ

[మార్చు]

పల్లవి:

నా పేరు బికారి ...నా దారి ఎడారి....

మనసైన చోట మజిలి.. కాదన్నచాలు బదిలీ...


చరణం1:

తోటకు తోబుట్టువును... ఏటికి నే బిడ్డను

పాట నాకు సైదోడు.. పక్షి నాకు తోడు

విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు

విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లేనే లేదు

అసలు నా మరో పేరు ఆనంద విహారి


నా దారి ఎడారి నా పేరు బికారి

నా దారి ఎడారి నా పేరు బికారి


చరణం2:

మేలుకొని ..కలలుగని..మేఘాల మేడపై

మెరుపు తీగలాంటి నా ప్రేయసినూహించుకొని

ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలనీ

ఆఅ ఆఆ ఆ ఆఆ ఆఅ ఆఆ.....ఆ

ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలనీ

ఆకాశవీధిలో పయనించు బాటసారి....

నా దారి ఎడారి నా పేరు బికారి

నా దారి ఎడారి నా పేరు బికారి


చరణం3:

కూటికి నే పేదను... గుణములలో పెద్దను

కూటికి నే పేదను... గుణములలో పెద్దను

సంకల్పము నాకు ధనము సాహసమే నా బలం

ఏనాటికో ఈ గరీబు... కాకపోడు నవాబు

ఏనాటికో ఈ గరీబు... కాకపోడు నవాబు

అంతవరకు నేనొక నిరంతర సంచారి


నా దారి ఎడారి నా పేరు బికారి

నా దారి ఎడారి నా పేరు బికారి

వివరణ

[మార్చు]

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాటలలో ఇది ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అంతగా ప్రజాదరణకు నోచుకోకపోయినా ఈ పాట మాత్రం అందరికి సుపరిచితమే. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ పాటను చాలా తక్కువ వాయిద్యాలతో స్వరపరిచారు. పాట మొదట్లో వచ్చే ఫ్లూట్, తరువాత తబల, హార్మోనియం శబ్దాలు మాత్రమే మనకి వినిపిస్తాయి. చరణాల మధ్యలో వచ్చే హార్మోనియం అద్భుతంగా ఉంటుంది.