నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసము ఒక పుస్తకం నుండీ నేరుగా తీసుకున్న సమాచారం. ఈ వ్యాసంలోని అంశాలను తాజాకరించి వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని చూడండి. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఆహారము మూలమున గాని నీటి మూలమున గాని వ్యాపించు వ్వాధులు.
[మార్చు]- 1.కలరా
- 2. టైఫాయిడు జ్వరము, 3. గ్రహణి విరేచనము:
కలరా అనగా విశూచియు, టైఫాయుడు జ్వరనగా మూడు నాలుగు వారములు విడువక యుండి సంధి జ్వరమును, అమీబిక్ డిసెంట్రీ అనాగా నొక తరహా గ్రహణి విరేచనములును మనము భుజించు ఆహారము మూలమునను, త్రాగు నీటి మూలమునను మన శరీఫ్రములో ప్రవేశించును.
తంజావూరు రైలు స్టేషనులో అమ్మిన ఉప్పు పిండిని రైలులో చెన్న పట్టణం వచ్చు చుండెడు డిప్టీ కలెక్టరు ఒకరు కొనుక్కుని తినెను. అతడు తినగా మిగిలిన కొంత ఉప్పిండిని చెన్న పట్టణంనకు వచ్చిన తరువాత వాని అన్నవంట వాడు తినెను. ఇద్దరుకూడ మరునాడే కలరా వచ్చెను. వీరి విరేచనములను సూక్ష్మ దర్శినితో శోధన చేయగా కరా సూక్ష్మ జీవులు స్పస్టముగ కనబడిఇనవి. ఆహారము మూలమున కలరా వచ్చుననుటకు ఇంతకంటే నిదర్శనము కావలెనా?
1.కలరా:
[మార్చు]మర మేకుల వెలే మెలి తిరిగి యుండు కామా సూక్ష్మ జీవియను పేరు గల ఒకానొక సూక్ష్మ జీవి నీటి మూలమున గాని ఆహారము మూలమున గాని మన కడుపులో ప్రవేశించుట వలన ఈ వ్యాధి వచ్చు చున్నదని పైన చెప్పిన దాన్ని బట్టి తెలియు చున్నది. కలరా వచ్చిన వాని విరేచనముల లోను, వాంతుల లోను, పేగుల లోను, ఈ సూక్ష్మజీవి ఎల్లపుడు కనబడు చుండుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. కలరా వచ్చి కుదిరిన కొందర రోగుల విరేచనములలో ఈ సూక్ష్మ జీవులు ఏబది దినముల వరకు ఉన్నట్లు కనిపెట్టబడింది. కలరా సూక్ష్మ జీవులు పులుపు పదార్థములలో జీవింపవు. సల సల క్రాగు నీళ్లలో ఇవి శీగ్రముగ చచ్చి పోవును. మనము చేయి పెట్టలే నంత వేడిగా నుండు నీటిలో అరగంటలో చచ్చి పోవును. ఎండకివి బొత్తిగా తాళజాలవు. కాని తడిలోనున్న యెడల ఎంత కాలమైనను జీవింప గలవు. తడి నేలలో గాని మురికి నీటిలో గాని తడి బట్టలో గాని ఇది మిక్కిలి వేగముగ వృద్ధి పొందును. దీనికి ఆహార మంతగా అక్కర లేదు. మిక్కిలి పరిశుభ్రమైన నీళ్లలో సహితము కొంత కాలము ఇది జీవింప గలదు. ఇది మురికి నీళ్లలోను మట్టి నీళ్లలోను ప్రవేశించిన యెడల అనేక నెలలును బహుశః సంవత్సరములును కూడా జీవింప గలదని చెప్ప వచ్చును. ఎండ వలన వృద్ధి తగ్గి తడివలనను బురద వలనను వృద్ధి హెచ్చు నట్టియు స్వభావము గలదగుట చేతనే ఈ వ్యాధి కొద్ది వర్షములు కురిసిన వెంటనే మనదేశమునందు హెచ్చుగ వచ్చుచుండును. అధిక వర్షముచే ప్రదేశమంతయు జలమయమై యున్నసమయములలో ప్రవాహపు నీటి యందు దీని కాహారము జాలక చచ్చి పోవును. బహుశః మిక్కిలి చలిని కూడా ఈ సూక్ష్మ జీవి భరింప జాలదు. కలరా అధికముగా వ్యాపించుటకు అయిదు షరతులుకావలెను. అవి:.....
1. కలరా సూక్ష్మ జీవి యుండవలెను. 2. మన శరీరమునకు వెలుపల అనగా భూమిలో గాని నీటిలో గాని దాని వృద్ధికి తగిన ఆహారము శీతోష్ణస్థితి గల పురుటి ఇల్లు ఉండ వలెను. 3. ఈ సూక్ష్మ జీవి ఒక గ్రామం నుండి మరొయొక గ్రామంనకు పోవుటకు తగిన మార్గము లుండ వలెను. 4. ఒక చోట ఇది ప్రవేశించిన తర్వాత ఒకరి నుండి మరియొకరి కంటు కొనుటకు తగిన వాహనము లుండవలెను. 5. ఇది ప్రవేశించిన చోట నుండు ప్రజలకు ఈ సూక్ష్మ జీవి సంబంధము కలిగినను వ్యాధి వచ్చు స్వభావము ఉండవలెను.
ఈ అయిదింటిలో ఏది లేకున్నను వ్యాధి వ్వాపించుటకు వీలు లేదు.
1. సూక్ష్మజీవి:
[మార్చు]ఇది ఒక కలరా రోగి విరేచనములో నుండి మరియొక రోగి కడుపులోనికి తిన్నగా పోవుట అసంభవము. ఇది నీటిలో గాని పొలములో గాని భూమిలో గాని గుడ్డలలో గాని కొంత కాలము పెరిగిన తర్వాత దీని మనుమలును ముని మనుమలును ఇతరులుకు చేరును గాని మొదటి రోగి విరే చనములోని సూక్ష్మ జీవులు మార్పు చెందకుండ రెండవ రోగికి చేరవనుట స్పష్టము.
2. పురిటి ఇండ్లు.
[మార్చు]ఇచ్చట ఈ సూక్ష్మ జీవులు వృద్ధి బొందుటకు తగిన ఆహారముండవలెను. ఇది మూడు విధములుగ నుండ వచ్చును.
(అ) మలము మూత్రము మొదలగు వానితొ గాని చెత్త మొదలగు కుళ్ళు పదార్థములతో గాని కూడిననేల లేక మురికి కుండ్లు. (ఇ) ఇట్టి పదార్థముల సంపర్కము గల చెరువులు, నూతులు, కాలువలు మొదలగు వానిలోని నీరు. (ఉ) పాలు, అన్నము, కూరగాయలు, పండ్లు మొదలగు ఇతర పదార్థములు.
ఇట్టి ఆహార పదార్థములలో నేది యేదైనను దొరికినను ఈ పురుటిండ్లతో వీని వృద్ధికి తగిన శీతోష్ణస్థితి యుండిన గాని ఇవి వృద్ధి పొందవు. ఎక్కువ చలిగాలి వీనికి పనికి రాదు.
3. మార్గములు:
[మార్చు]గాలి వలన ఈ సూక్ష్మ జీవులు ఒక గ్రామం నుండి మరియొక గ్రామంనకు పోవుట యసందర్భము. ఏలయన తడి లేని గాలిలో గాని ఎండలోగాని ఈ సూక్ష్మ జీవి వెంటనే చచ్చి పోవును. కాబట్టి దీనిని మోసికొని పోవుటకు ఏవో ఇతర సాధనములు వుండవలెను. ఒక వేళ ఒక చోట నుండి మరియొక చోటికీ సూక్ష్మ జీవులు ఎగిరి పోగలిగినను అచ్చటి నేల యందు వీనికి తగిన సదుపాయమున్న గాని ఇవి నాటుకొన నేరవు. ఈ సూక్ష్మ జీవి ప్రయాణమునకు ముఖ్యమైనవి మూడు కాన వచ్చుచున్నవి. (1) మానవుల రాక పోకల మార్గములు. (2) నదులు, కాలువలు, మొదలగు ప్రవాహములు. (3) ఓడలు, పడవలు, రైళ్ళు మొదలగునవి.
(1) మానవులు:
[మార్చు]తీర్థ యాత్రలకు పోయిన ప్రయాణికులు తిరిగి వచ్చు నపుడు మార్గములో ఊరూరునకు కలరాను చేర వేయునది మనమెరిగిన విషయమె. రైలు వచ్చిన తరువాత ప్రయాణములు సులభమగుటచే మునుపటి కంటే ఈ వ్యాధి ఇపుడు మిక్కిలి వేగముగ వ్యాపించు చున్న దనుట స్పష్టము.
(2) ప్రవాహపు నీరు:
[మార్చు]ఒక నదిలో పడిన మైల దాని కిరుపక్కల నుండు పట్టణంల కెల్ల పంచిచి పెట్టు కొనుచు పోవును. కావుననే చుట్లు పట్ల నున్న గ్రామాదులలో కలరా లేక పోయినను ఒక కాలువగట్టున ఉన్న అనేక గ్రామంలలో కలరా వ్యాధి ఒకేసారి వ్యాపించు చుండును.
(3) ఓడలు, పడవలు మొదలగునవి:
[మార్చు]వీని మీద ప్రయాణము చేయు మనుష్యుల మూలమున వచ్చు వ్యాధిని గూర్చి పైన వ్రాసి యున్నాము. అది గాక కలరా సూక్ష్మజీవులచే మైల పడిన సామానులు ఒక దేశమునుండి మరియొక దేశానికి పోవుటచే ఇక్కడనుండి అక్కడకు కలరాను జేరవేయ వచ్చును.
(4)వాహకములు:
[మార్చు]ఒక గ్రామంలో గాని ఒక ఇంటి యందు గాని కలరా సూక్ష్మ జీవి ప్రవేశించిన తర్వాత ఒకరి నుండి మరియొకరికి ఈ వ్యాధి అంటు కొనుటకు ఏదో యొక విధమైన ప్రయాణ వాహకము కావలెను. ఇందు ముఖ్యమైనవి.....
(1) మంచి నీళ్లు: మంచి నీళ్ల చెరువులలో గాని నూతులలో గాని ఇది ప్రవేశింప గలిగిన యెడల గుప్పున అనేక మందికి ఒక్కసారె ఈవ్యాధి అంటు కొనును. పెద్ద పట్టణంలలో, పట్టణంనకు దూరమున నుండు చెరువులలో నుండి నిర్మలమైన నీటి గొట్టముల ద్వారా తెప్పించు కొను చోట్ల కలరా వ్యాధి మిక్కిలి అరుదుగ నుండును. కావున మంచి నీళ్ల కంటే అపరిశుభ్రమైన నీరు ప్రథమ వాహకము. (2) ఆహార పదార్థములు, పండ్లు,. పాలు: ఇవి కలరా సూక్ష్మజీవుల వృద్ధికి తగిన పురిటిండ్లగుటయే గాక నొకరి నుండి మరియొకరికి వ్యాపింపచేయు సాధనములుగా కూడా అగు ఉన్నాయి.
(3) జంతువులు: ఈగలు, దోమలు మొదలగు పురుగు కూడా దీనికి మిక్కిలి సహాయము చేయును. అందు ముఖ్యముగ చెప్పుకోదగినది ఈగ. దీని కడుపులో పదునాలుగు దినములు ఈ కలరా సూక్ష్మజీవి నివసించి యుండిన పిమ్మట కూడా ఇతరులకు ఈ సూక్ష్మజీవి వ్యాధిని పుట్టింప గలదని ఇపుడు స్పష్టముగా రుజువు చేయ బడింది. ఇది తన కాళ్ల మీదను, రెక్కల మీదను మోసుకొని పోయి సూక్ష్మ జీవులను జేర వేయను.
(4) గాలి: కలరా రోగి ప్రక్కన కూర్చున్నంత మాత్రమున గాలి మూలమున ఒకరి నుండి మరియొకరికి ఈ వ్వాధి అంటదని ప్రస్తుతం అనేక వైధుల అభిప్రాయము. కాని కొందరు వైద్యులు కొన్ని నిదర్శనములను కనుబరచి మిక్కిలి అరుదుగ గాలి మూలమున కూడా అంట వచ్చునని వాదించు చున్నారు. తగినంత జాగ్రత్తగ చేతులను దుస్తులను, శుద్ధి చేసికొనిన వారికిని, కలరా ఆస్పత్రులలో పని చేయు పరిచారికలకును, వైద్యులకును మన దేశమునందు కలరా వచ్చు చున్నట్లు లేదు.
(5) మానవ స్వభావము: ఒక సంఘములో కలరా వచ్చి నపుడు కూడా అందరికి ఈ వ్యాధి ఒక్క రీతిగా నుండుట లేదు. ఒక సంవత్సరము ఒక గ్రామంలో ముమ్మరముగ కలరా వచ్చి పోయిన పిమ్మట ఆ ఊరి వారలను తిరిగి మూడు నాలుగు సంవత్సరముల వరకు వచ్చుచున్నట్లు కాన రాదు. దీనికి కారణము...... వార్ల కొక విధమైన రక్షణ శక్తి గలుగు నని తెలియుచున్నది. సామాన్య సంపర్కమేదియు వేరుగ లేని యెడల సాధారణంగా నొక ఊరిలో వుండు ప్రజలలో పల్లపు వీదులలో నున్న వారలకు మెరక వీధులలో వున్న వార్ల కంటే వ్వాధి వ్వాపకము హెచ్చుగ నుండు నని తెలియు చున్నది. స్త్రీ పురుష వివక్షత గాని వయో వివక్షత గాని ఈ వ్యాధికి ఉన్నట్లు తోచదు. భాగ్య వంతులలో కంటే బీద వారిలో ఈ వ్యాధి హెచ్చుగ ఉండుననుట నిశ్చయము.
రోగిని ప్రత్యేక పరచుట గూర్చియు, ప్రకటన చేయుట గూర్చియు, శుద్ధి చేయు విషయములను గూర్చియు, మంచి ఆవగాహనతో మెలగవలయును. రోగుల విరేచనములు కలరా వ్యాపకమున కెంత సహాయ కారులో మూత్రమును, వాంతులు కూడా అంత సహాయ కారులని జ్ఞప్తి యుంచు కొని వాని నన్నిటిని రంపపు పొట్టులో గలిపి కాల్చి వేయ వలెను. లేదా నూటికి అయిదు పాళ్లు గల కర్బాలికపు మందు నీళ్లలో గాని వేయింటి కొక పాలు గల సౌవీరపు మందు నీళ్లలోగాని ఎప్పటి కప్పుడు కలిపి వేసి దానిని నూతులకు దూరముగా పాతి వేయవలెను. సామాన్యముగా రోగి నంటి యుండు బట్టలను పడకలను కాల్చి వేయవలెను. గదిలోని సామానులను కార్బాలికు మందు నీళ్లతో కడిగి వేసి ఎండలో ఎండ నీయ వలెను. గ్రామం లోని నూతులలో సాయంకాలపు వేళ పొటాసియం ప్రొమేగనేటు అను మందును నీటికి చంద్ర కాంత పువ్వు వర్ణము వచ్చు నంత వరకును కలిపి రాత్రియంతయు నిలువ యుండనిచ్చి ఉదయము వాడుకొన వచ్చును. నీటి యందు కొద్దిపాటి వాసన యున్నను రంగున్నను ప్రమాదము లేదు. రంగు గల నీటిని త్రాగినను విషము కాదు. కలరా సూక్ష్మ జీవులు ఈ మందుచే చచ్చును గాన కడుపు లోనికి నీరు పోయినను మంచిదే. నూతులలో నుండు చేపలు, తాబేళ్లు మొదలగు జంతువులు ఈ మందు వలన చచ్చిపోవును గాన వాటిని తీసిన పిమ్మటనే ఈ మందు వేసిన మంచిది. ఈ మందు వేసిన పిమ్మట తిరిగి కలరా సంపర్కము కలిగినది తోచిన యెడల తిరిగి నూతి నీటిని శుభ్రము చేయ వలసినదే గాని ఒక సారి శుభ్రము చేసిన చాలునని అనుకొన కూడదు. ఒక నూతి నీటి వలనే కలరా వ్యాపించి యున్నదని తోచి నపుడు సాధ్యమైన యడల ఆ నూతిని మూసి వేయుటయే మంచి పద్ధతి. లేదా అట్లు సాధ్యము కాని యెడల నీటిని చక్కగా మరగనిచ్చి చల్లార్చిన పిమ్మట త్రాగుట మంచిది. లేదా వడపోత యంత్రములతో వడపోసికొన వలయును.
మనము తిను పదార్థముల మీద ఈగలు మొదలగు జంతువులు వ్రాల కుండ చూచు కొనవలయును. చక్కని శరీరారోగ్యము గల వారిని సూక్ష్మజీవులు అంటినను అవి అభివృద్ధి నొందజాలవు. కాబట్టి ఎల్లప్పుడు ఇండ్లను గ్రామంలను పరి శుభ్రముగ నుంచు కొనుచు నిర్మలమైన వాయువు మన ఇండ్ల యందు మూలమూలలకు ప్రసరించు నట్లు జూచు కొనవలయును. ఒక ఇంటిలో నీ వ్యాధులు ప్రవేశించి నప్పుడు రోగిని ప్రత్యేక పరచి ఆ రోగి నుండి ఇతరుల కంటు సోక కుండ చేసికొను పద్ధతుల నవలంభించ వలయును. పల్లపు భూమలలో మురుగు కాలువలు త్రవ్వించి యెప్పటికప్పుడు నీరు క్రిందికి పోవునట్లు చేసి కొనవలెను. గ్రామం లోని మురుగు కుండ్లను, నూతి దొడ్లను, దినదినము పరీక్షించి వానిని మందు నీళ్లత్తో శుభ్రముగ కడుగు చుండ వలెను. సూక్ష్మ జీవి నిలుచుటకు ఎక్కడను ఆధారము లేకుండా చూసుకొనవలెను.
1.కలరా మొదలగు అంటు వ్యాధి గల ప్రదేశములలో నివసించు వారెల్లప్పుడు నీటిని ఇట్టి యంత్రములతో వడ పోసి కొని గాని చక్కగ పొంగ కాచి గాని త్రావలెను. 2. నీరు వడపోయు యంత్రము లోని నిర్మాణము. 1. మూత. 2. నీరు పోయు స్థలము. 3. ఈ నీటిని వడ పోయు గొట్టము. దీనిలో మిక్కిలి సన్నని రంద్రములుండును. ఈ రంద్రముల గుండ పరి శుభ్రమైన నీరు క్రిందికి దిగి కల్మషము పై పాత్రములో మిగిలి పోవును. 4. నిర్మలమైన నీరు చేరెడు భాగము. 5. నిర్మలమైన నీరు వచ్చు కొళాయి. మనము చేయు పనులన్నిటి కంటే ముఖ్యమైన దేమనగా మంచి నీళ్ల చెరువును కాపాడు కొనుట.
కలరా వ్యాపకము నుండి రక్షణ శక్తి కలిగించు టీకా రసములు ఇపుడు తయారై వచ్చు చున్నవి. వాని యుపయోగమును గూర్చి నిశ్చయముగా చెప్పుటకు వీలు లేక పోయినను టీకాలు వేసిక కొద్ది దినముల కైనను కలరా రాకుండ నుండ వచ్చునని చెప్పవచ్చును. కలరా రోగులతో తప్పక సంబంధము కలిగించు కొనవలసి యున్న వైద్యులును పరి చారకులును ఇట్టి టీకాలు వేయుంచు కొనుట ఉత్తమము. కలరా సూక్ష్మ జీవులు, పులుసు పదార్థములలో చచ్చి పోవును కాబట్టి 10 లేక 20 చుక్కల డైల్యూట్ సల్ప్యూరిక్ ఆసిడ్డు గాని కొత్త నిమ్మ పండు లోని 20 చుక్కల రసము గాని గ్రుక్కెడు నీళ్లలో వేసికొని ప్రతి దినము ఒక సారి త్రాగిన కలరా వ్యాధి అంట దని చెప్పుదురు.
సన్నిపాత జ్వరము (టైపాయిడ్ జ్వరము)
[మార్చు]ఒకానొక విధమైన సూక్ష్మ జీవులు శరీరములో ప్రవేశించుటచే పేగులో పుండు పుట్టి సామాన్యముగా 8 దినములనుండి 21 దినములు వరకు విడువని జ్వరమును, శరీరము మీద ఒక విధమైన ఎర్రని చిన్న పొక్కులును, సామాన్యముగా రెండు మూడు వారములలో సంధియు కలిగించు వ్యాధికి సన్ని పాత జ్వరమనియు ఆంత్ర జ్వరమనియు పేరు.
వాపించు విధము:
[మార్చు]సన్నిపాత జ్వరమును కలిగించు సూక్ష్మ జీవిని "ఈబర్తు." అను నతడు 1880 సంవత్సరములో కనిపెట్టెను. ఈ సూక్ష్మ జీవి రోగుల నెత్తురు నందును పేగుల యందును, ప్లీహము మొదలగు కొన్ని అవయవముల యందును కనబడును. తల్లికి వ్యాధి వచ్చినపుడు అప్పుడే పుట్టిన బిడ్డల అవయవములలోను, మాయనుండి వచ్చు నెత్తెరు యందును ఈ సూక్ష్మ జీవి కాన వచ్చు చున్నది. ఇది మొదటి 15 దినముల వరకు తరుచుగాను, తర్వాతి దినములలో అప్పుడప్పుడును రోగి యొక్క విరేచనములలో కాన వచ్చును. రోగి యొక్క మూత్రము నందును, చెమట యందును, ఉమ్మి యందును కూడా ఈ సూక్ష్మ జీవి యుండ వచ్చును. రోగి యొక్క కురుపుల నుండి వచ్చు చీమునందు కూడా చాల కాలము వరకు ఒకానొకప్పుడు కొన్ని సంవత్సరముల వరకును సూక్ష్మ జీవి కాన వచ్చు చుండును. ఈ సూక్ష్మ జీవి అంగుళములో 12 వేల వంతు ప్రమాణముండును. దీని శరీరము కంటే పెద్దవైన తోకలు 10 మొదలు 24 వరకుండును. . మనము చేయి పెట్టలేని వేడి నీళ్లలో ఇరువది నిముషములలో ఇది చచ్చి పోవును. కాని మంచు గడ్డలో సహితము జీవించి యుండగలవు. మంచి నీళ్లలో ఇవి కలిసినపుడు సామాన్యముగా నివి కొద్ది కాలములో చచ్చి పోవును. ఇతర సూక్ష్మ జీవులు జీవించు చోట ఇవి చిరకాలము జీవింప నేరవు. మురుగు కుండ్లలోని నీటిలో వేసినపుడు ఈ సూక్ష్మ జీవులు వెంటనే చచ్చి పోవును.
ఇవి సామాన్యముగా మంచి నీళ్లగుండా కాని పాల మూలమున గాని ఉడక పెట్టకుండ తినిన శాఖ పదార్థముల మూలమున గాని మన శరీరములో ప్రవేశించును. సన్ని పాత జ్వరముచే చచ్చిన జంతువుల మాంసమును తినుట వలన సన్ని పాత జ్వరము రావచ్చునని చెప్పుటకు కొన్ని నిదర్శనములు గలవు.
వ్వాధి వచ్చిన ఒక మనిషి నుండి మరియొక మనిషికి సంపర్కము వలన ఈ వ్యాధి అంట వచ్చుననుట నిశ్చయము. రోగి యొక్క బట్టలుతుకు వార్లకును మలమూత్రాదులను పడకలను తాకుచు చేతులను శుద్ధి చేసి కొనని వార్లకును ఈ వ్యాధి తరచుగ అంటు చుండును. ఈగలు మొదలగు కొన్ని జంతువులచే నిది వ్యాధిపింప వచ్చును.
వయస్సు: ఆరు నెలలలోపు వయస్సు గల పిల్లలకు ఈ జ్వరము అక్కడక్కడ వచ్చు చున్నను మూడు సంవత్సరముల లోపు బిడ్డలకు తరుచుగా కాన రాదు. ఒకప్పుడు వచ్చినను సులభముగా పోవును. సామాన్యముగా ఈ వ్వాధి 15 సంవత్సరములు మొదలు 25 సంవత్సరముల లోపు వయస్సుగల వార్లకు వచ్చు చుండును. 10 సంవత్సరముల వయస్సు మించిన పిమ్మట ఈ జ్వరము వచ్చుట అరుదు. కాని 90 సంవత్సర ములు మించిన వారికి కూడా అచ్చటచ్చట వచ్చి యున్నది. స్త్రీ పురుష వివక్షత లేదు.
స్వభావము:
[మార్చు]కొన్ని కుటుంబములలో సన్నిపాత జ్వరము హెచ్చుగ వచ్చు చుండును. మరికొన్ని కుటుంబలులలో వచ్చినను సులభముగ తేలిపోవు చుండును. శరీర దార్డ్యమునకును సన్ని పాత జ్వరము అంటు కొనుటకును సంబంధమున్నట్టు కాన రాదు. ఒక సారి సన్ని పాత జ్వరము వచ్చి కుదిరిన తర్వాత రెండవ సారి రాదని తోచు చున్నది. అయినను వ్యాధి వచ్చి కుదిరిన కొద్ది దినములలోనే రోగము తిరుగ బడి తిరిగి మూడు నాలుగు వారములు ఈ వ్యాధి బాధించు చుండుట పై చెప్పిన విషయమునకు వ్వతి రేకముగా తోచు చున్నది. ఈ విషయమై ఇంకను నిశ్చయముగా తెలియ లేదు.
నివారించు పద్ధతులు:
[మార్చు]నీటి యొక్క పరిశుభ్రతను గూర్చియు మల మూత్రాదులను శుద్ధి చేయు పద్ధతులను గూర్చియు రోగిని ప్రత్యేక పరచుట మొదలగు విషయములను గూర్చియు కలరా వ్యాధి క్రింద వ్రాసిన వాని నన్నిటిని చక్కగ గమననించిన యెడల సన్ని పాత జ్వరమును ఇతరులకు వ్యాపింప కుండుట చేయుట మిక్కిలి సులభము. రోగికి జ్వరము వచ్చిన వెంటనే పరుండ బెట్టి బెడ్ పాన్ మొదలగు పాత్రములలో మంచము మీదనే మల మూత్రాదులు జరుగు చున్నట్లు ఏర్పాటు చేసికొని వానిని వెంటనే మందు నీళ్లతో కలిపి ఇంటిలో కలియకుండ తగు విధమున పార వేయునెడల ఈ వ్యాధి మరియొకరికి అంట కుండ చేయ వచ్చునని నిశ్చయముగ చెప్పవచ్చును.
గ్రహణి విరేచనములు:
[మార్చు]పేగులలో కందుట చేత గాని, పుండు పుట్టుట చేత గాని జిగట, చీము, నెత్తురు, కడుపు నులిమి వేయు నొప్పి, విరేచనమునకు పోవునడు ఆసనము నొప్పి మొదలగు లక్షణములతో కూడిన ఒకానొక విధమైన వ్యాధికి గ్రహణి అని పేరు.
ఇందు వ్యాధి లక్షణములను బట్టియు, వాని ఉధృతమును బట్టియు, వ్వాధి అనేక విధములుగ వర్ణింప బడి యున్నది. అందు ముఖ్యముగ రెండు జాతుల వ్యాధులు మిక్కిలి హెచ్చుగ నంటు స్వభావము గలవి. ఇవి క్షామ కాలముల యందును, యుద్ధ సమయముల యందును జైళ్ల లోను వచ్చినప్పుడు హెచ్చుగ ప్రజలను ధ్వంసము చేయును.
1. ఈ రెండు జాతులలో నొక జాతి విరేచనములు పేగుల లోనుండు డిసెంటరీ బాసిల్లను అను నొక జాతి సూక్ష్మ జీవి వలన కలుగు చున్నది.
2. రెండవ జాతి వ్యాధియందు పేగులలో అమీబా అను నొక విధమైన సూక్ష్మ జంతువులు హెచ్చుగ నుండును.
ఈ రెండు జాతుల వ్యాధులలో మొదటిది అనగా బాసిల్లసుగ్రహణి వచ్చునప్పుడే ఉధృతముగ వచ్చును. విరేవిరేచనమునకు పోవు నప్పుడీ వ్యాధిలో ఆసనము నొప్పి మొదటి నుండియు మిక్కిలి హెచ్చుగ నుండును. కుదిరిన వెంటనే కుదురును లేదా వెంటనే చంపును. రెండవ జాతి వ్యాధి అనగా అమీబా గ్రహణి మెల్ల మెల్లగ అంకురించి మధ్య మధ్య కుదురుచు తిరిగి తిరిగి వచ్చును. చాల కాలము వరకు విడువక యుండును.
వ్యాపించు విధము.
[మార్చు]బాసిల్లసుగ్రహిణి: ఇది యుద్ధము గాని, క్షామము గాని వచ్చినప్పుడు తప్పక బయట పడును. ఇది ముఖ్యముగా ఉష్ణ ప్రదేశములందు మిక్కిలి హెచ్చుగ వ్యాపించును. హిందూ దేశములందు మిక్కిలి హెచ్చుగ వ్యాపించును. హిందూదేశమునందు మరణ కారణములలో చలిజ్వరము తరువాత బహుశః గ్రహిణి విరేచనములచే కలుగు మరణములు హెచ్చుగ లెక్కకు వచ్చును. సముద్ర తీరములలోనూ, పల్లపు భూములలోను, మిట్ట ప్రదేశములలో కంటే ఈ వ్వాధి హెచ్చుగ వ్యాపించును. సముద్రపు మట్టము కంటే నూరు అడుగుల లోపల ఎత్తుగల ప్రదేశములలో మొత్తము వ్వాధులలో నూటికి 42 గురును, 500 అడుగుల లోపు ఎత్తుగల ప్రదేశములలో నూటికి 32 గురును, 500 మొదలు 8000 అడుగుల ఎత్తుగల ప్రదేశములలో నూటికి 19 గురును, 8000 అడుగుల కంటే హెచ్చు ఎత్తుగల ప్రదేశములలో నూటికి 4 గురును, గ్రహణి చే బాధ పడుచున్నారు. కాబట్టి సాధారణంగా నేల ఎత్తయిన కొలదిని గ్రహిణి తగ్గు చున్నట్లు కానవచ్చు చున్నది. అయినను నేల యొక్క స్వభావమును బట్టియు, నీటిని బట్టియు, గాలిలో నుండు తడిని బట్టియు, ఈ వ్యాధి వ్వాపకమును మారు చుండును. ఈ దేశములో సాధారణంగా బురదతో కూడిన క్రొత్త నీరు వచ్చు కాలములో గ్రహణి హెచ్చుగ నుండును.
దేశము యొక్క శీతోష్ణ స్థితి యందు అధిక మగు మార్పులు అకస్మాత్తుగ కలిగినప్పుడెల్లను గ్రహణి యొక్క వ్యాపకము హెచ్చునని తోచు చున్నది. మిక్కిలి గేడిగ నుండు వేసవిలో అకస్మాత్తుగ చల్లని దినము వచ్చినను, అధిక పరిశ్రమచే శరీరము వేడి యెక్కి యున్నప్పుడు చలిగాలి తగులుట చే గానీ, తడియుట చే గాని తడి బట్టలు కట్టుట చే గాని గ్రహణి అంకురించును. చెరువులు కాలువలు మరమ్మతు చేసిన సంవత్సరములలోను, చెరువులు బొత్తిగ ఎండి పోయి కొత్త నీరు ప్రవేశించిన సంవత్సరము లోను గ్రహణి తక్కిన సంవత్సరములలో కంటే హెచ్చుగ నున్నట్లు కాన వచ్చు చున్నది. నేల కాలుటకును ఈ వ్యాధి వ్యాపకము నకును గల సంబంధమేమో ఇంకను తెలియదు.
విరేచనములచే మయిల పడిన నేల గాని నీరు గాని కలరా యొక్క వ్యాపకమున కెట్లో గ్రఃహణి యొక్క వ్యాపకమునకట్లే సహాయ పడును. మంచి నీళ్ల చెరువుల లోనికి కల్మషము ఎప్పుడు చేరునో అప్పుడు గ్రహణము వచ్చుట నిశ్చయము. ఇది గాక నీటిలో నుండు మట్టి వలన గ్రహ వచ్చుననుటకు ప్రబల కారణము గలవు. నీటిలోని మట్టి కడుపు లోనికి పోయి అక్కడ పుండు పుట్టించి క్రమముగ బాసిల్లును గ్రహణి లోనికి గాని అమీబా గ్రహణ లీనికి గాని దింపును.
మట్టితో గాని, ఇతర కల్మషముతో గాని కూడిన ఆహారము, అజీర్ణ పదార్థము, పచ్చివి గాని మిగుల మగ్గినవి గాని పండ్లు, హెచ్చుగను మితి లేకుండగను జేయు పండుగ భోజనములు, అతి త్రాగుడు మొదలగునవి గ్రహణి యొక్క వ్యాపకమునకెక్కువ సహాయము చేయును. యుద్ధ కాలము లందును క్షామ కాలము లందును, ఆహారాదులు సరిగా లేక పోవుట, అధిక పరిశ్రమ జేయుట, ఎండను వానను లెక్క చేయక పోవుట, తడినేలను పరుండుట, జన సమ్మర్దము, మురికి నీరు, మలమూత్రాదులతో కల్మషమైన నీరు ఇవి యన్నియు ప్రబల హేతువులు.
స్వభావము:
[మార్చు]అన్ని జాతుల వారికిని అన్ని వయసుల వారికిని వ్వాధి సమానముగా అంటును. స్త్రీ పురుష వివక్షత లేదు. భాగ్యవంతుల కంటే బీద వారిని ఇది హెచ్చుగ బాధించును. పెద్ద పట్టణంలలో కంటే పల్లెల యందును, చిన్న పట్టణంలందును ఈ వ్యాధి రాలేదు. అంత వరకును వ్యాధిని పుట్టిచుటకు సహాయ పడు ఇతర కారణాలను మనము గమనించుచు సాధ్యమైన వరకు వ్యాధి యొక్క వ్యాపకము నణచుటకు ప్రయత్నింప వలెను. ఇది అంటు వ్యాధి యని మనకిప్పుడు తెలిసి యున్నది గనుక విరేచనములను మందు నీళ్లతో గలిపి కల్మష మితరులకు అంటు కొన కుండ చూడ వలెను. ఇంటి చుట్టు నుండు నేల యందును, మంచి నీళ్ల యందును, మలమూత్రాదుల సంపర్కము చేర కుండ చూడ వలెను. వ్యాధి యున్న స్థలములలో నివసించు వారు నీటిని చక్కగ మరగ నిచ్చి చల్లార్చుకొని త్రాగవలెను.
మూలాలు
[మార్చు]అంటువ్యాధులు రచయిత ఆచంట లక్ష్మీపతి అను గ్రంథమునుండి గ్రహింప బడినది