Jump to content

పొన్నమాను సేవ

వికీపీడియా నుండి
పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహం
ఉభయాన్ని దేవాలయానికి తీసుకువెళ్తున్న దృశ్యం
పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహం
పొన్నమాను వాహనాన్ని మోస్తున్న భక్తులు
పొన్నచెట్టు ఆకులు

శ్రీకృష్ణునికి జరిపే ఉత్సవాలలో చెక్క, లోహాన్ని ఉపయోగించి పొన్న చెట్టు రూపంలో తయారు చేయబడిన పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జరుపుకునే ఉత్సవాన్ని పొన్న వాహనోత్సవము లేక పొన్నమాను సేవ అని అంటారు.

గోపికా వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి ఆ సందర్భాన్ని పురష్కరించుకొని బ్రహ్మోత్సవాల సమయంలో, కృష్ణాష్టమి నాడు పొన్నమాను వాహనం పై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని ఉంచి గ్రామోత్సవాన్ని జరుపుకుంటారు.

ఆరోగ్యపరంగా చూస్తే పొన్న పువ్వులు సుగంధ భరితాలేకాక తలనొప్పిలాంటి వాటిని కూడా పోగొట్టే ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఉత్సవ సమయంలో పొన్నమాను వాహన అలంకరణలో పొన్నచెట్టు ఆకులను, పువ్వులను ఉపయోగిస్తారు.

గ్యాలరీ

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.