ఫెరో అయస్కాంత వస్తువుల విశిష్టోష్టాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భూమిలో అరుదుగా దొరుకు అయస్కాంత ఫెరో ద్రవము.

లోహాలు విశిష్టోష్ణము సాధారణ ఉష్ణోగ్రతల వద్ద డులాంగ్ - పెటిట్ నియమం ప్రకారము, తక్కువ ఉష్ణోగ్రత వద్ద డెబై సూత్ర ప్రకారం మారతాయని ఇది వరకే తెలుసుకొన్నారు. వీటి ధర్మాలలో ముఖ్యమైన మార్పులు జరిగేటప్పుడు, సాధారణంగా విశిష్ణోష్ణంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఫెరో అయస్కాంత వస్తువులైన ఇనుము, నికెల్, కోబాల్ట్ మొదలైన లోహాలకు క్యూరీ బిందువు వద్ద ఫెరో అయస్కాంత ధర్మాలు పోయి పారా అయస్కాంత ధర్మాలు ప్రాప్తిస్తాయని ఇది వరకే తెలుసుకొన్నారు. వీటి విశిష్ణోష్ణం కూడా, క్యూరీ బిందువు వద్ద హటాత్తుగా తగ్గిపోతుంది నికెల్ పరమాణు ఉష్ణము ఉష్ణోగ్రతతో మారే విధానాన్ని చూపించినాము. నికెల్ విశిష్ణోష్ణము 358డిగ్రీ సె క్యూరీ బిందువు వద్ద Cv విలువ 8.2 కెలోరీల నుంచి 7 కెలోరీలకు వెంటనే పడిపోవటం గమనించ వలెను. ఇటువంటి మార్పే ఇనుము, కోబాల్ట్ మొదలైన పదార్ధాలుకూడా క్యూరీ బిందువువద్ద చూపుతాయి. క్యూరీబిందువుపైన డెబై సూత్రప్రకారము వీటి విశిష్ణోష్ణం మారుతుంది.

కుడిఫెరొ అయస్కాంత, ఫెరొ కాని అయస్కాంత మొమెంటమ్

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బి. రామచంద్రరావు. స్థిర విద్యుత్ శాస్త్రము- ద్రవ్య అయస్కాంత ధర్మాలు - ఫెరో అయస్కాంత వస్తువుల వశిష్టోష్ణాలు. p. పేజి-210.