Jump to content

మాయాబజార్ (1936 సినిమా)

వికీపీడియా నుండి
మాయా బజార్
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
నిర్మాణం పి.వి.దాసు
తారాగణం సాలూరి రాజేశ్వరరావు,
శాంతకుమారి,
రామిరెడ్డి (ఘటోత్కచుడు),
ఎమ్.సుబ్బులు (రేవతి),
లక్ష్మీరాజ్యం (సత్య),
మాధవపెద్ది వెంకటరామయ్య,
శ్రీరంజని సీనియర్,
ఎస్.పి.లక్ష్మణస్వామి,
కనకం (భానుమతి),
రాజవదన (రుక్మిణి)
సంగీతం గాలిపెంచల నరసింహారావు
ఛాయాగ్రహణం కె.రామనాథ్
కళ ఎ.కె.శేఖర్
నిర్మాణ సంస్థ వేల్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తెలుగులో మాయాబజారు ఇతివృత్తంతో వచ్చిన తొలి సినిమా. 1936లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు శశిరేఖా పరిణయమని కూడా ఇంకో పేరు ఉంది. సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్ర పోషించాడు. ఈ సినిమా శాంతకుమారి తొలిచిత్రము. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామిరెడ్డి (ఘటోత్కచుడు), ఎమ్.సుబ్బులు (రేవతి), లక్ష్మీరాజ్యం (సత్య), మాధవపెద్ది వెంకటరామయ్య, శ్రీరంజని సీనియర్, ఎస్.పి.లక్ష్మణస్వామి, కనకం (భానుమతి), రాజవదన (రుక్మిణి) నటించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
మాయాబజార్ (1936) సినిమాలో సాలూరి రాజేశ్వరరావు పాడిన నను వీడగ గలవే బాలా పాట
  1. నను వీడగ గలవే బాల - ఎస్. రాజేశ్వరరావు
  2. కానరావా తరుణీ శశి - ఎస్. రాజేశ్వరరావు
  3. ఔరా ; చేజిక్కి నట్లు (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
  4. అతివా నీ వదన (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
  5. వరశశి వదనా పంకజనయనా - ఎస్.పి. లక్ష్మణస్వామి
  6. ఈ అవనతి భరియీంపన్ అయో భయప్రధమౌ, గానం.తుర్లపాటి ఆంజనేయులు
  7. కడు వినోదమయ్యేను సఖులారా వడిగ రండ, గానం:శాంతకుమారి
  8. కౌరవేంద్ర సుగుణ సాంద్ర కాంతి ప్రభా చంద్రమా,
  9. క్షీరాబ్ధి సూతా గీర్వాననూతా ప్రేమ సంభరిత, గానం.శ్రీరంజని
  10. చంద్రికా వైభవంబౌరా ప్రమోదోల్లాస దాయకమై, గానం.శాంతకుమారి
  11. చెడు పలుకులాడేగా జడమతి ధనమధాంధుడై , గానం. ఎస్ పి లక్ష్మణస్వామి
  12. తృటి నడతు కుటిలాత్ములన్ క్షుభితపటు, గానం: రాయప్రోలు సుబ్రహ్మణ్యం
  13. దుస్సహంబౌచున్నదాహా దుర్విషాగ్న విభంభునన్, గానం.శ్రీరంజని
  14. దేవా కృష్ణా దివ్య ప్రభావ దివిజ వినుత, గానం.శాంతకుమారి, ఎస్ పి లక్ష్మణస్వామి
  15. నూశార మనపెబువు సుందరం ఓహో , గానం.బృందం
  16. వరాత్ములారా ఆప్తులుగారా భవ్య గుణులు,
  17. మదిరాదా మనవికాదా హృదయములోగల , గానం.ఎం.సుబ్బులు
  18. మరచితే సుయోధనా మాధవున్ నిరుపమానుడే, గానం.కొత్తూరి సత్యనారాయణ
  19. వివాహభోజనంబు వింతైన పాయసంబు, గానం.ఆర్.రామిరెడ్డి
  20. శ్రీవర మారజనక కృష్ణా సుకృతిసారా, గానం.బృందం
  21. సుభద్రా విదిన్ దాటగతీరునా కానున్నదేదైనా, గానం.యడవల్లి నాగేశ్వరరావు
  22. శుభ విధానమున పోయిరమ్మా సుభద్రా విభవం, గానం.యడవల్లి నాగేశ్వరరావు .

పద్యాలు

[మార్చు]

1..అన్నత దోషంభు నెరుగకే యగ్రజుండు , గానం.యడవల్లి నాగేశ్వరరావు

2.అన్నమున విషమిడి ఇంటికగ్గినెట్టి , గానం.ఆర్.రామిరెడ్డి

3.అన్నా సౌభ మాకు పాండవులు మేనత్త , గానం.తుర్లపాటి ఆంజనేయులు

4.ఇంద్రపురములోన నింపార మనవార , గానం.తుర్లపాటి ఆంజనేయులు

5.కటకట రాజ్యభోగపు సుఖంబుల హాయిగా, గానం.ఎం.సుబ్బులు

6.కోరికధీర పాండవుల కొమలితో వనికంపి, గానం.రాయప్రోలు సుబ్రహ్మణ్యం

7.తత బహుజన్మలబ్ధ సూకృతంభు ఫలించే , గానం.శ్రీరంజని

8.నిర్మలంబై హిమానీకరాభంభునై నెగడు , గానం.శాంతకుమారి

9.పారావారా విజృంభనోద్దతి ఘన వ్రాతార్భటిన్ , గానం.ఆర్.రామిరెడ్డి

10.భీమసుతుడు హిడింబకు ప్రేమకొడుకు ,

11ముగ్దక్రీడల మేనలవును వహింప, గానం.ఎస్.రాజేశ్వరరావు

12.మెచ్చిరే దేవకాంతలను మించిన రూపసి, గానం.ఎం.సుబ్బులు

13.వలదా సందియ మిట్టివేళ కనలేవా , గానం.కొత్తూరి సత్యనారాయణ .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.