రాచెల్ వీజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాచెల్ వీజ్
2018లో రాచెల్ వీజ్
జననం
రాచెల్ హన్నా వీజ్[1]

(1970-03-07) 1970 మార్చి 7 (వయసు 54)
వెస్ట్‌మిన్‌స్టర్, లండన్, ఇంగ్లాండ్
ఇతర పేర్లురాచెల్ వీజ్ క్రెయిగ్[2]
పౌరసత్వం
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
విద్యాసంస్థట్రినిటీ హాల్, కేంబ్రిడ్జ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1992 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
డేనియల్ క్రెయిగ్
(m. 2011)
పిల్లలు2
బంధువులుమిన్నీ వీజ్ (సోదరి)

రాచెల్ వీజ్ (ఆంగ్లం: Rachel Weisz) నటిగా, నిర్మాతగా, సంగీత విభాగంలో ప్రదర్శకురాలిగా, దర్శకురాలిగా సినీరంగంలో పనిచేసింది.[3] రాచెల్ వీజ్ సినీరంగంలో ది కాన్స్టాంట్ గార్డెనర్ సినిమా 2005లో, ది లోబ్టర్ సినిమా 2015లో, ది ఫౌంటైన్ సినిమా 2006లో, డిసోబోడియెన్సెన్ సినిమా 2017లో గుర్తింపు తెచ్చుకుంది. 2005లో ది కాన్ స్టాంట్ గార్డనర్ ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డు లభించింది. అనేక ప్రధాన చలన చిత్ర అవార్డులు కూడా ఆమెను వరించాయి.[4]

ప్రారంభ జీవితం[మార్చు]

1970 మార్చి 7న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ లో హంగరీకి చెందిన ఆస్ట్రియన్ సంతతికి చెందిన ఈడిత్ రూత్, జార్జ్ వైజ్ లకు జన్మించిన రాచెల్ హామ్ స్టెడ్ గార్డెన్ సబర్బన్ లో పెరిగారు. తల్లి మానసిక వైద్యురాలు, ఆమె తండ్రి ఒక ఇంజనీర్.రాచెల్ వీజ్ అసలు పేరు రాచెల్ హన్నా వీజ్ . రాచెల్ వీజ్ ని కెన్యా కాంప్‌బెల్, రాచెల్ వైజ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. "ఇంగ్లీష్ రోజ్"గా ప్రసిద్ధి చెందిన వీజ్ తన 14వ ఏట మోడలింగ్ ప్రారంభించింది. నార్త్ లండన్ కాలేజియేట్ స్కూల్, బెనెండెన్ స్కూల్,, సెయింట్ పాల్స్ గర్ల్స్ స్కూల్. తరువాత అతను కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ హాల్ లో చేరింది, అక్కడ అతను ఆంగ్లంలో డిగ్రీని పొందినది.విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజులలో వివిధ విద్యార్థి నిర్మాణాల్లో ప్రదర్శనలు ఇవ్వటంతో సహా వీజ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా నాటకరంగంలో పాల్గొంది . ఆమె 1990ల ప్రారంభంలో స్కార్లెట్, బ్లాక్ వంటి టెలివిజన్ షోలలో అతిథి పాత్రలు చేయడం ప్రారంభించింది, బ్రిడ్జ్ టాకింగ్ టంగ్స్ అనే విద్యార్థి నాటక బృందాన్ని సహ-స్థాపించినది, ఈ బృందం ఎడిన్‌బర్గ్ ఫ్రింజ్ ఫెస్టివల్‌కు మూడుసార్లు ఆహ్వానించబడింది, గార్డియన్ స్టూడెంట్ డ్రామా అవార్డును గెలుచుకుంది, నేషనల్ థియేటర్‌లో ప్రదర్శనకు ఆహ్వానించబడింది.

చలన చిత్రాలు[మార్చు]

రాచెల్ వీజ్ 1994 చలనచిత్రం డెత్ మెషిన్‌లో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది, అయితే ఆమె సంచలనాత్మక పాత్ర 1996 చలనచిత్రం చైన్ రియాక్షన్‌లో వచ్చింది, ఇది ది మమ్మీ, 1999లో ది మమ్మీ చిత్రాల పరంపరలో ఎవెలిన్ కర్నాహన్-ఓ'కానెల్‌గా ప్రసిద్దురాలు అయినది . రాచెల్ వీజ్ మొదటిసారి 2003 లో ది షాప్ ఆఫ్ థింగ్స్ (The Shape of Things) చిత్రాన్ని నిర్మించింది. రాచెల్ వీజ్ మొదటిసారి 1996 లో చైన్ రిక్షన్ (Chain Reaction) సినిమాకి సంగీత విభాగంలో ప్రదర్శకురాలిగా పనిచేసింది. రాచెల్ వీజ్ 2010 లో ది థిఫ్ (The Thief) సినిమాతో దర్శకురాలిగా ప్రజలకు పరిచయం అయింది. తను ఇప్పటివరకు నిర్మాతగా 3, సంగీత విభాగంలో ప్రదర్శకురాలిగా 4, దర్శకురాలిగా 1 సినిమాలు చేసింది.[4] తన కెరీర్ లో వివిధ సినిమాలకి 45 పురస్కారాలు గెలుచుకోగా, 92 అవార్డులకు నామినేట్ అయ్యింది. 2006 సంవత్సరంలో ఆస్కార్ కి ది కాన్ స్టాంట్ గార్డనర్ (2005)లో నటనకు గాను అనేక ప్రధాన చలన చిత్ర పురస్కారాలతో పాటు ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డును అందుకుంది.2010 జనవరిలో క్రిటిక్స్ గ్రూప్ ఫోరం అవార్డుల సందర్భంగా 2009 సంవత్సరానికి ఉత్తమ నటిగా ఆమె ఎంపికయ్యారు[5].

మూలాలు[మార్చు]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Rubinstein అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "The Royal Theatrical Support Trust people". Companies House.
  3. "Rachel Weisz News & Biography - Empire". www.empireonline.com. Retrieved 2022-03-07.
  4. 4.0 4.1 "Rachel Weisz News". Us Weekly (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-03-07.
  5. "Rachel Weisz | Biography, Movies, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-07.