వినాయకుడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినాయకుడు
(2008 తెలుగు సినిమా)
నిర్మాణం సరితా పాట్ర
చిత్రానువాదం అడవి సాయికిరణ్
తారాగణం కృష్ణుడు,
సోనియా,
సూర్యతేజ,
జ్యోతి,
సామ్రాట్‌,
మరళీకృష్ణ
ఆదర్శ్ బాలకృష్ణ director = అడవి సాయికిరణ్
సంగీతం శామ్ ప్రసన్
నృత్యాలు పి.జి.వింద
గీతరచన వనమాలి
కళ సత్య శ్రీనివాస్
భాష తెలుగు

వినాయకుడు సినిమా 2008, నవంబరు 22 న వడుదలైన తెలుగు సినిమా. హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయమయ్యిన సోనియా దీప్తి ఈ చిత్ర కథానాయిక. కృష్ణుడు ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఒక మోడరన్ అమ్మాయి, ఒక లావుపాటి అబ్బాయి ల మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. సమకాలీన అంశాలతో చిత్రాన్ని రూపొందించడం వలన ఈ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ, ఒక సాధారణ ప్రేమ కథకి "వినాయకుడి" పేరు వాడుకున్నందుకు గానూ భజరంగ్ దళ్ ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద నిరసన నిర్వహించారు.

2008 ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది పురస్కారం.

2008: ఉత్తమ దర్శకుడు , నంది పురస్కారం

ప్రేం మూవీస్ బ్యానర్ పై సరిత పాత్ర నిర్మించిన ఈ సినిమాకు అడవి సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. కృష్ణుడు, సోనియా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సామ్‌ ప్రసాద్ సంగీతాన్నందించాడు.[1]

ఊబకాయం ఉన్న వ్యక్తి కార్తీక్ (కృష్ణుడు) యాడ్ డిజైనింగ్ కంపెనీలో చేరాడు. అతని విచిత్రమైన వ్యక్తిత్వం కారణంగా బాలికలు అతన్ని వారి నుండి దూరంగా ఉంచుతారు. అతను ఆ సంస్థలో కల్పనా (సోనియా) అనే అమ్మాయిని ఆసక్తికరంగా చూస్తాడు. ఆమె కూడా మొదట్లో అతన్ని దూరం చేస్తుంది. అతని శారీరక స్వరూపంపై చాలా జోకులు వేస్తుంది. కానీ మృదువైన మనస్వత్వం కల కార్తీక్ తన వైఖరితో అహంకార కల్పన హృదయాన్ని గెలుచుకుంటాడు. చివరగా, అహంభావమైన కల్పన తెలియకుండానే కార్తీక్‌తో ప్రేమలో పడుతుంది. మరోవైపు, సంధ్య (పూనమ్), అల్తాఫ్ (సూర్య తేజ్) ల లవ్ ట్రాక్ విడిగా నడుస్తుంది. షాలిని (అంకిత) కార్తీక్ పాత్రను పెంచడానికి ఉత్ప్రేరకంగా ఉపయోగించే పాత్ర.

తారాగణం

[మార్చు]

కార్తీక్ గా కృష్ణుడు

కల్పన గా సోనియా దీప్తి

సంధ్య గా పూనమ్ కౌర్

రాజేష్ గా సామ్రాట్ రెడ్డి

అల్తాఫ్ గా సూర్యతేజ

షాలిని గా అంకిత

మహేష్ గా మహేష్

అపర్ణ గా సత్యకృష్ణన్

అనంత నాయుడు గా ఆదర్శ్ బాలకృష్ణన్

పాటల జాబితా

[మార్చు]

హమ్ హైన్ హైదరాబాదీ , రచన: అవినాష్, గానం.హేమచంద్ర

సరదాగా ఈ సమయం, రచన: వనమాలి గానం.వున్నికృష్ణన్ , కె ఎస్ చిత్ర

వరవీణ , రచన: అవినాష్, గానం.రఘు, హేమచంద్ర, శ్రీదేవి , సాహితీ

నాలో వేదనే , రచన: అవినాష్ , గానం.కునాల్ గాంజ్వల

వరవీణ , ఇన్స్ట్రుమెంటల్

నాలో వేదనే , ఇన్స్ట్రుమెంటల్.

మూలాలు

[మార్చు]
  1. "Vinayakudu (2008)". Indiancine.ma. Retrieved 2020-09-27.