వెలుపల ప్రసారాలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
స్టూడియో నుండి కాకుండా స్టూడియో వెలుపల నుండి చేసే కార్యక్రమ ప్రసారాలను వెలుపల ప్రసారాలు లేక స్టూడియోకు వెలుపల ప్రసారాలు అంటారు. వెలుపల ప్రసారాలను ఇంగ్లీషులో అవుట్ సైడ్ బ్రాడ్ కాస్టింగ్ అంటారు. మొబైల్ రిమోట్ ప్రసార టెలివిజన్ స్టూడియో నుండి స్వీకరించే టెలివిజన్ లేదా రేడియో కార్యక్రమాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తులను (Electronic Field Production - EFP) అవుట్ సైడ్ బ్రాడ్ కాస్టింగ్ (Outside broadcasting - OB) అంటారు. సాధారణంగా టెలివిజన్ న్యూస్, స్పోర్ట్స్ టెలివిజన్ కార్యక్రమాలను కవర్ చేయడానికి ఈ మొబైల్ రిమోట్ ప్రసార టెలివిజన్ స్టూడియోలను ఉపయోగిస్తారు. ప్రొఫెషనల్ కెమెరా, మైక్రోఫోన్ సిగ్నల్స్ సహాయంతో ఉత్పత్తి చేసిన రికార్డింగ్ ప్రసారాలను వెలుపలి ప్రసారాల ప్రక్రియలో భాగంగా సాధ్యమైనంత వరకు మొబైల్ ప్రొడక్షన్ ట్రక్కు నుంచే ప్రసారం చేస్తారు.