పందిరి
(శుభ పందిరి నుండి దారిమార్పు చెందింది)
ఎండ వానల నుంచి రక్షణ కొరకు నాలుగు వైపుల ఆధారాన్ని కల్పిస్తూ వెలుతురు, గాలి బాగా ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకున్న స్వల్పకాల లేక దీర్ఘకాల వాసాన్ని పందిరి అంటారు. దీనిని ఇంటి ముందు లేక ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసుకుంటారు.
పందిరి వేసే విధానం
[మార్చు]- భూమిలో గోతులు తీసి సర్వి కర్రలు, గెడలు పాతి వేస్తారు.
- గోతులు తవ్వలేని చోట ఇసుక మూటలు డ్రమ్ముల్లో ఇసుక నింపి కర్రలు నిలుపుతారు.
- ఇనుప కమ్ములు ఒకదానికి ప్కటి సపోర్ట్ చేసి గోతులు లేకుండా ఏర్పాటు చేస్తారు.
పందిరి వలన ఉపయోగాలు
[మార్చు]పందిరి రకాలు
[మార్చు]- పెళ్ళిపందిరి లేదా శుభపందిరి. పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో, తిరునాళ్ళ సమయంలో ఇంటి ముందర తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పందిరిని శుభ పందిరి అంటారు.
- రక్షణ పందిరి ఇంటిముందు లేదా పొలాల్లో తాటాకులు కొబ్బరాకులతో నీడ కోసం, వర్షానికి రక్షణగా వేసుకొనేది.
- టెంట్ లేదా గుడ్డపందిరి సభలు సమావేశాలకు ఇతర స్వల్ప సమయ అవసరాలకు వేసేవి
మరిన్ని
[మార్చు]- పందిరి ఇంటి పేరుగా ఉంది
- పందిరి ఊరు పేరుగా ఉంది
- పందిరి పేరితో కంపెనీలు, పరిశ్రమలు కలవు
- పందిరి పేరుతో చిటికెల పందిరి, పెళ్ళిపందిరి, కలలపందిరి వంటి సినిమాలు వచ్చాయి