Jump to content

సక్సెస్ ఫ్యాక్టర్స్

వికీపీడియా నుండి
సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇంక్.
రకంఅనుబంధ సంస్థ
పరిశ్రమసాఫ్టువేర్
స్థాపనక్యాలిఫోర్నియా (2001 (2001))
స్థాపకుడులార్స్ డాల్గార్డ్
ప్రధాన కార్యాలయం,
సేవ చేసే ప్రాంతము
ప్రపంచవ్యాప్తం
ఉద్యోగుల సంఖ్య
1,447 (2011)[1]
వెబ్‌సైట్successfactors.com

సక్సెస్ ఫ్యాక్టర్స్ అనునది క్యాలిఫోర్నియా లోని శాన్ మాటియో కేంద్రంగా పనిచేస్తున్న ఒక అమెరికన్ బహుళ జాతీయ సంస్థ.

సాఫ్టువేర్ సేవ (Software as a service - SaaS) గా వ్యాపార సంస్థలకి ఉపయోగపడే మానవ వనరుల నిర్వహణ సాఫ్టువేరుని తయారు చేస్తుంది.

16 ఫిబ్రవరి, 2012 నాటికి సక్సెస్ ఫ్యాక్టర్స్ SAP AG లో విలీనం అయినది.

చరిత్ర

[మార్చు]

2001 లో లార్స్ డాల్గార్డ్ చే స్థాపించబడింది. నవంబరు 2007 లో నాస్‌డాక్ జాబితాలో SFSF గా నమోదు అయినది. 2011 ఏప్రిల్ 6 నాటికి న్యూ యార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NYSE), NYSE యూరోనెక్స్ట్, ఫ్రాంక్ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజీ లలో నమోదయ్యేందుకు ప్రకటించి మూడు స్టాక్ ఎక్స్ఛేంజీ లలో నమోదయిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించింది. జూలై 2011 నాటికి వీటిలో ఇది నమోదైనది. సక్సెస్ ఫ్యాక్టర్స్ యొక్క సేవలు 32 భాషలలో 3,500 వినియోగదారులకు 15 మిలియను వాడుకరులకు 60 పరిశ్రమలలో 185 దేశాలలో అందుబాటులో ఉన్నాయి.

2010 అక్టోబరు 17 న డెన్మార్క్ కి చెందిన యూక్యాల్క్ (YouCalc) అనే మరొక SaaS సంస్థని సొంతం చేసుకొన్నది. 2010 అక్టోబరు 18 లో క్లౌడ్ టెక్నాలజీలో మొట్టమొదటి క్యాల్క్యులేటర్ని రూపొందించింది. వ్యాపార రంగంలో వినియోగదారులకి ఈ క్యాల్క్యులేటర్ రియల్-టైం డాటా వ్యాపార సంబంధ అంతర్దృష్టి, అంచనాలని కలిగించేది.

ఎస్ ఏ పీ అమెరికా లో విలీనం

[మార్చు]
2011 డిసెంబరు 3 లో SAP AG, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఎస్ ఏ పీ యొక్క అనుబంధకం ఎస్ ఏ పీ అమెరికా సక్సెస్ ఫ్యాక్టర్స్ ని కొనటానికి అంగీకారం తెలిపినది. సక్సెస్ ఫ్యాక్టర్స్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది అని, "SuccessFactors, an SAP company" అని వ్యవహరింపబడుతుందనీ ప్రకటించబడింది. ఈ కొనుగోలు ఫిబ్రవర 16, 2012 నాటికి పూర్తి అయినది.
2011 డిసెంబరు 6 సక్సెస్ ఫ్యాక్టర్స్ Jobs2Web ని కొన్నది.

ప్రస్తుత కార్యకలాపాలు

[మార్చు]

2009 లో సక్సెస్ ఫ్యాక్టర్స్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ సాఫ్ట్వేర్ (BizX) ని కనుగొన్నది.

సక్సెస్ ఫ్యాక్టర్స్ యొక్క మానవ వనర నిర్వహణ సాఫ్టువేర్ లక్ష్యాల ద్వారా నిర్వహణ (Management by objectives) సిద్ధాంతాలపై ఆధారపడి ఉన్నాయి. ఎస్ ఏ పీ యొక్క కొనుగోలుతో మానవ వనరుల నిర్వహణ సాఫ్టువేరును పరిపూర్ణం చేశాయి.

సక్సెస్ ఫ్యాక్టర్స్ లోని మాడ్యూల్ లు

[మార్చు]
  • ఎంప్లాయీ సెంట్రల్: ఉద్యోగుల ప్రాథమిక సమాచారాన్ని భద్రపరచే భాండాగారం ఎస్.ఏ.పీ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ లోని పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూలుకు ప్రత్యామ్నాయం. అయితే ఎస్ ఏ పీ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ ని ఈ మాడ్యూలుతో అనుసంధానపరచవచ్చును.
  • ఎంప్లాయీ ప్రొఫైల్: ఉద్యోగుల తమ గురించి తాము చెప్పుకోవటానికి, ఇతర ఉద్యోగుల గురించి తెలుసుకొనటానికి ఉపయోగపడే మాడ్యూలు. ఉదా: ఒక ఉద్యోగి, ఇంకో ఉద్యోగికి సాంఖ్యిక బ్యాడ్జీని ఇవ్వవచ్చును. బ్యాడ్జీలని మన ఇష్టం వచ్చినట్టు మార్చలేము, కొత్తవి సృష్టించలేము. ఉన్నవి యథాతథంగా కేవలం వాడుకొనవచ్చును. అభిరుచులకి అనుగుణంగా ట్యాగ్ లు ఇచ్చుకొనవచ్చును. ఉన్నవి మార్చవచ్చును. కొత్తవి సృష్టించుకొన వచ్చును. అయితే బ్యాడ్జీలు ఒక ఉద్యోగి తనకి తానుగా ఇచ్చుకొనుటకు లేదు. ఒక ఉద్యోగి మాత్రం మరొక ఉద్యోగికి ఇచ్చుకొనవచ్చును. ట్యాగ్ లు ఎవరికి వారు ఇచ్చుకొనటంతో బాటు ఇతరులకి కూడా ఇచ్చుకొనవచ్చును.
  • పెర్ఫార్మెన్స్ అండ్ గోల్స్: ఎస్.ఏ.పీ హెచ్ సీ ఎం లోని ఆబ్జెక్టివ్ సెట్టింగ్స్ అండ్ అప్ప్రైజల్స్ కి ఇది ప్రత్యాన్మాయం. లక్ష్యాలని నిర్దేశించుకొనటం గోల్ మేనేజ్&మెంట్ క్రిందకి రాగా, సరైన సమయంలో వాటిని చేరుకొనేలా ప్రయత్నించటం, ఒకవేళ వెనుకబడుతున్నట్లయితే తదనుగుణంగా కృషి చేసి వాటిలో సఫలీకృతులు కావటం చేసుకోవటం, ఉద్యోగి యొక్క మదింపులని నిర్వాహకులు చేయటం వంటివి పెర్ఫార్మెన్స్ మేనేజ్&మెంట్ క్రిందకి వస్తాయి.
  • కాంపెన్జేషన్: ఉద్యోగి యొక్క వేరియబుల్ పే, బోనస్, పే-ఫర్-పెర్ఫార్మెన్స్ మొదలగునవి ఈ మాడ్యూలు ద్వారా నిర్ణయించవచ్చును. ఎస్.ఏ.పీ హెచ్ సీ ఎం లోని కాంపెన్జేషన్, ఈ-కాంపెన్జేషన్ మాడ్యూళ్ళకి ప్రత్యామ్నాయం.
  • రిక్రూటింగ్ ఎగ్జిక్యూషన్: ఎస్.ఏ.పీ హెచ్ సీ ఎం లోని రిక్రూటింగ్/ఈ-రిక్రూటింగ్ మాడ్యూళ్ళకి ప్రత్యామ్నాయం
  • లర్నింగ్: ఎస్.ఏ.పీ హెచ్ సీ ఎం లోని ట్రెయినింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్&మెంట్, లర్నింగ్ సొల్యూషన్స్ కి ఈ మాడ్యూలు ప్రత్యామ్నాయం
  • సక్సెషన్ అండ్ డెవలప్ మెంట్: ఎస్.ఏ.పీ హెచ్ సీ ఎం లోని పర్సనల్ డెవలప్ మెంటికి ప్రత్యామ్నాయం.
  • జాం: ఫేస్ బుక్ వంటి సేవ. కానీ ఇది ఆ సంస్థ ఉద్యోగులకి మాత్రమే పరిమితం
  • వర్క్ ఫోర్స్ అనాలిటిక్స్
  • వర్క్ ఫోర్స్ ప్లానింగ్
  • ఆన్ బోర్డింగ్
  • బిజ్ ఎక్స్ మొబైల్

కార్యాలయాలు

[మార్చు]

క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న సక్సెస్ ఫ్యాక్టర్స్ యొక్క కార్యాలయాలు ఈ ప్రాంతాలలో కూడా ఉన్నాయి.

  • యునైటెడ్ కింగ్డం, ఐర్లాండ్ (లండన్ కేంద్రం)
  • జర్మనీ, మధ్య ఐరోపా (మునిచ్ కేంద్రం)
  • ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ (ప్యారిస్ కేంద్రం)
  • చైనా (హాంగ్ కాంగ్ కేంద్రం)
  • జపాన్ (టోక్యో కేంద్రం)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-01. Retrieved 2012-07-14.
  1. సక్సెస్ ఫ్యాక్టర్స్ గురించి
  2. సక్సెస్ ఫ్యాక్టర్స్ యూక్యాల్క్ ని కొన్నది
  3. క్లౌడ్ టెక్నాలజీ లో సక్సెస్ ఫ్యాక్టర్స్ మొట్టమొదటి క్యాల్క్యులేటర్ ని స్థాపించినది
  4. ఎస్ ఏ పీ సక్సెస్ ఫ్యాక్టర్స్ ని కొన్నది Archived 2012-07-26 at the Wayback Machine
  5. ఫ్యాక్టర్స్ కొనుగోలు లో జే పీ మోర్గన్ ఎస్ ఏ పీ యొక్క సలహాదారు[permanent dead link]
  6. మరింత సమాచారం
  7. మరింత సమాచారం
  8. బిజ్ ఎక్స్ గురించి[permanent dead link]