సహాయం:Introduction to referencing/Verifiability

వికీపీడియా నుండి
(సహాయం:Introduction to referencing/verifiability నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
A cartoon of a political rally, with someone in the crowd holding up a banner reading "[Citation needed]"
"వికీపీడియా అసమ్మతిదారు" -రాండాల్ మున్రో. వాస్తవాలకు మూలమేంటో చెప్పాలంటూ వికీపీడియన్లు అడుగుతూండడం ప్రసిద్ధి!

వికీపీడియా ముఖ్య విధానాలలో ఒకటి, వ్యాసాల్లోని కంటెంటు నిజమో కాదో ధృవీకరించుకునేలా ఉండడం. అంటే, ఇక్కడ ఉన్న సమాచారానికి మద్దతుగా విశ్వసనీయమైన ప్రచురణలు తప్పనిసరిగా ఉండాలి. అన్ని కొటేషన్లకూ, ధృవీకరించమని అడిగిన లేదా అడిగే అవకాశం ఉన్న పాఠ్యానికీ, జీవించి ఉన్న వ్యక్తుల గురించి వివాదాస్పద సమాచారానికీ (ప్రతికూలంగా, సానుకూలంగా, తటస్థంగా - ఎలా ఉన్నా సరే) నేరుగా సమర్ధిస్తూ ఉండే మూల ప్రచురణను సూచిస్తూ ఉండే ఇన్-లైన్ ఉల్లేఖన ఉండాలి. వికీపీడియా, ఒరిజినల్ రచనలు చేసే స్థలం కాదని కూడా దీని అర్థం. ఎక్కడా ప్రచురితం కాని, ఆర్కైవల్ పరిశోధనలు చేసే స్థలం కాదని కూడా దీనికి అర్థం. ఎక్కడా ప్రచురితం కాని కృతి ఇక్కడ మూలంగా పనికిరాదు.




క్రొత్త కంటెంటును చేరుస్తున్నపుడే, దానితో పాటు మూలపు సమాచారాన్ని జోడించడం మీ బాధ్యత. మూలం లేకుండా చేర్చిన పాఠ్యాన్ని వ్యాసం నుండి తొలగించే అవకాశం చాలా ఎక్కువ. కొన్నిసార్లు అటువంటి పాఠ్యాన్ని తొలగించకుండా, దానికి "మూలం అవసరం" అనే ట్యాగును తగిలించవచ్చు. దీనితో, తొలగించే లోపు మూలాలను వెతకడానికి, చేర్చడానికీ ఎడిటర్లకు సమయం లభిస్తుంది. అయితే, నేరుగా తొలగించడమే ఎక్కువగా జరుగుతూంటుంది.


వ్యాసాలకు ఇన్-లైన్ ఉల్లేఖనాలను ఎలా జోడించాలో ఈ పాఠం మీకు చూపుతుంది. వికీపీడియాలో నమ్మదగిన మూలాలుగా ఎలాంటి వాటిని భావిస్తుందో కూడా క్లుప్తంగా వివరిస్తుంది.