చిత్రం స్కానర్
స్వరూపం
మనం కంటితో చూసిన బొమ్మను మనసులో గుర్తుపెట్టుకొంటాము. మంచి ఆర్టిస్ట్ గనుక అయితే తాను చూసిన బొమ్మను యధాతధంగా బొమ్మగీసి చూపించగలడు. అదే విధముగా మనకు కావలసిన బొమ్మలు యధాతధముగా కంప్యూటర్లో భద్రపరచాలని భావిస్తే స్కానరు ఉపయోగపడుతుంది. స్కానరు ద్వారా బొమ్మలు గాని, గ్రాఫులుగాని, చేతితో రాసిన విలువైన డాక్యుమెంట్లు గాని కంప్యూటర్కు అందించవచ్చు. అందువలన స్కానరు చూసిన బొమ్మను "యధాతధంగా గీసే ఆర్టిస్ట్"తో పోల్చవచ్చు. స్కానర్ ద్వారా స్కాన్ చేసిన బొమ్మను కంప్యూటర్లో కావలసిన పేరుతో భద్రపరచవచ్చు. జెరాక్స్ మెషిన్ ద్వారా ఒక బొమ్మను జెరాక్స్ తీసినపుడు అలాంటి బొమ్మ మనకు పేపరు మీద వస్తుంది. స్కానర్ కూడా అలాంటి పనే చేస్తుంది. కాని బొమ్మను పేపరుకు బదులు కంప్యూటర్కు అందిస్తుంది.
మూలాలు
[మార్చు]తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ