సూది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుట్టడానికి వాడే సూదులు.

సూది (ఆంగ్లం: Needle) ఒక చిన్న పరికరం. ఇవి సన్నగా మొనదేలి, వివిధ పరిమాణాలలో ఉంటాయి. కుట్టుపనిలోను, శస్త్రచికిత్సలో ఉపయోగించే సూదులకు ఒకవైపు దారం ఎక్కించడానికి చిన్న రంధ్రం ఉంటుంది.

సూదులలో రకాలు

[మార్చు]

ఉపయోగాలు

[మార్చు]

కుట్టుపనిలో

[మార్చు]
  • బట్టలు, తోలు మొదలైనవి కుట్టడానికి ప్రత్యేకమైన కుట్టుమిషను ఉపయోగించి సూదులతో కుడతారు.
  • చాలా పదార్ధాలను రవాణా చెయ్యడానికి సంచులలో వేసి దబ్బలం (పెద్ద సూది) తో కుడతారు.

వైద్యంలో

[మార్చు]
  • ఆకుపంక్చర్, ఒకరకమైన నొప్పిని తగ్గించే చైనా వైద్య చికిత్సలో సూదులుపయోగిస్తారు.
  • ఇంజక్షన్ ద్వారా మన శరీరంలోనికి మందులు ఎక్కించడాన్ని సూదిమందు అంటారు.
  • శస్త్రచికిత్సలో కోసిన శరీర భాగాల్ని తిరిగి కుట్టడానికి వివిధ రకాల సూదుల్ని వాడతారు.

నొప్పించని సూది

[మార్చు]

చర్మంలో కలిసిపోయే సూదులు శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని చర్మానికి అతికించుకుంటే చాలు ఔషధం లోనికి వెళ్తుంది. దీంట్లో సూదులు కొన్ని వందలుంటాయి. అవన్నీ అత్యంత సూక్ష్మంగా శరీరంలో గుచ్చుకున్నా నొప్పి తెలియని విధంగా ఉంటాయి. ఔషధంతోపాటు ఈ సూదులు కూడా చర్మంలో కరిగిపోతాయి.

ఇతరత్రా

[మార్చు]
  • పువ్వులు, ఆకులు, పూసలు, మొదలైనవి హారంగా గుచ్చడానికి సూది, దారం వాడతారు.
  • పచ్చబొట్లు పొడవడానికి ప్రత్యేకమైన సూదులు ఉపయోగిస్తారు.
  • శరీరంలోని వివిధ భాగాలకు సూదులతో రంధ్రాలు చేసి ముక్కుపుడక, చెవిరింగులు వంటి కొన్ని ఆభరణాలు ధరిస్తారు.
  • గ్రామోఫోన్ రికార్డుల్ని ఉపయోగించడానికి కొన్ని సూదుల్ని వాడేవారు.
"https://te.wikipedia.org/w/index.php?title=సూది&oldid=2008742" నుండి వెలికితీశారు