అంగస్తంభన వైఫల్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగస్తంభన వైఫల్యం
Classification and external resources
ICD-10F52.2, N48.4
ICD-9302.72, 607.84
DiseasesDB21555
eMedicinemed/3023
MeSHD007172

అంగస్తంభన వైఫల్యం (Erectile dysfunction (ED, "male impotence") అనేది సంభోగం సమయంలో పురుషాంగంలో అంగస్తంభన లోపించడం లేదా స్తంబన ఎక్కువసేపు ఉండకపోవడం.[1]

అంగస్తంభన అనేది లింగంలోని స్పాంజిలాంటి కణజాలలు రక్తంతో గట్టిపడడం. ఇది ఎక్కువగా లైంగిక ప్రేరణ మూలంగా మెదడు నుండి సంకేతాలను గ్రహించిన పిదప అంగం స్తంభిస్తుంది. ఇలా అంగం స్తంభించడం జరగనప్పుడు దానిని అంగస్తంభన వైఫల్యంగా భావిస్తారు. ఈ వైఫల్యానికి చాలా రక్తప్రసరణకు సంబంధించిన కారణాలుండగా తైవాన్ దేశంలో త్రాగునీటిలో ఆర్సెనిక్ కలిసి సంభవించింది.[2] అయితే దీనికి అతి ముఖ్యమైన కారణాలు: గుండె, రక్తనాళాల వ్యాధులు, మధుమేహం, నరాల వ్యాధులు, కొన్ని హార్మోనులు లోపించడం, కొన్ని రకాల మందుల చెడుప్రభావం.

చరిత్ర[మార్చు]

An unhappy wife is complaining to the Qadi about her husband's impotence. Ottoman miniature.

ఫ్రాన్స్లో 16, 17వ శతాబ్దాల కాలంలో పురుషులలో అంగస్తంభన వైఫల్యం ఒక నేరంగా పరిగణించేవారు; అదొక న్యాయపరమైన కారణంగా విడాకులు మంజూరు చేశేవారు. అయితే 1677 లో ఈ పద్ధతిని ఆపుచేశారు.[3]

జాన్ ఆర్. బ్రింక్లే (John R. Brinkley) పురుషులలో అంగస్తంభన వైఫల్యానికి అమెరికాలో 1920లు, 1930లలో ఒక వైద్యాన్ని ప్రవేశపెట్టరు. ఇతడు ఖరీడైన మేక గ్రంథుల స్రావాలను, మెర్కురోక్రోం ఇంజక్షన్లను ఉపయోగించేవారు.

ఆధునిక వైద్యశాస్త్రం అంగస్తంభన వైఫల్యానికి చేసే వైద్యంలో 1983 తర్వాత మంచి పురోగతి సాధించారు. బ్రిటిష్ ఫిజియాలజీ ప్రొఫెసర్ గైల్స్ బ్రిండ్లే (Giles Brindley) తన పురుషాంగంలోకి పెపావరిన్ (papaverine) ఇంజెక్షన్ చేసుకొని యూరోడైనమిక్ సొసైటీ సభ్యులకు నగ్నంగా అంగస్తంభణాన్ని చూపించాడు.[4] ఈ మందు పురుషాంగంలోని రక్తనాళాల కండరాలను వ్యాకోచింపజేసి అంగాన్ని స్తంభింపజేసింది. అప్పటి నుండి అనేకమైన మందులూ ఇదే పద్ధతి ఆధారంగా కోట్లకొలది డాలర్ల పరిశోధన చేసి మార్కెట్లోకి విడుదలచేయబడ్డాయి.[5], [6]

ఇవి కూడా చూడండి[మార్చు]

నపుంసకత్వం

మూలాలు[మార్చు]

  1. www.muschealth.com
  2. Risk of erectile dysfunction induced by arsenic exposure through well water consumption in Taiwan.Hsieh FI, Hwang TS, Hsieh YC, Lo HC, Su CT, Hsu HS, Chiou HY, Chen CJ.School of Public Health, Topnotch Stroke Research Center, Taipei Medical University, Taipei 110, Taiwan
  3. Roach, Mary (2009). Bonk: The Curious Coupling of Science and Sex. New York: W.W. Norton & Co. pp. 149–152. ISBN 9780393334791.
  4. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  5. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  6. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.