అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం
కుటుంబ విగ్రహం, స్విట్జర్లాండ్
యితర పేర్లుప్రపంచ కుంటుబ దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజుమే 15
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రతి ఏట మే 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]

ప్రారంభం[మార్చు]

గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడంకోసం 1993, మే 15న అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రారంభించింది.[2]

కార్యక్రమాలు[మార్చు]

  1. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబడుతున్నాయి.
  2. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏట ఒక అంశం థీమ్గా ప్రకటించబడుతుంది.
  3. 2016: హెల్తీ లైవ్స్ అండ్ సస్టెయినబుల్ ఫ్యూచర్
  4. 2018: కుటుంబాలు, అందరికీ భాగస్వామ్యం కల్పిం చుకునే సమాజాలను నిర్మించడం

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, సంపాదకీయం (15 May 2018). "సమాజాన్ని, సంస్కృతినీ కాపాడేది కుటుంబమే". ముప్పవరపు వెంకయ్యనాయుడు. మూలం నుండి 15 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 May 2019. Cite news requires |newspaper= (help)
  2. ఆంధ్రభూమి, ఆదివారం సంచిక (14 May 2016). "జగమంత కుటుంబం". మూలం నుండి 14 August 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 15 May 2019. Cite news requires |newspaper= (help)