Jump to content

అంతర్జాతీయ దిన రేఖ

వికీపీడియా నుండి

అంతర్జాతీయ తేదీ రేఖ (IDL) అనేది భూమి యొక్క ఉపరితలంపై అంతర్జాతీయంగా ఆమోదించబడిన సరిహద్దు. ఇది ఉత్తర ధృవం, దక్షిణ ధృవాల మధ్య గుండా పోతుంది. ఈ రేఖ ఒక క్యాలెండర్ రోజు, తదుపరి రోజు మధ్య సరిహద్దుగా పనిచేస్తుంది. ఇది పసిఫిక్ మహాసముద్రం గుండా వెళుతుంది. ఇది కొన్ని భూభాగాలు, ద్వీప సమూహాల చుట్టూ పోతూ సుమారుగా 180° రేఖాంశాన్ని అనుసరిస్తున్న ఊహాజనితమైన రేఖ.

భౌగోళికం

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా పశ్చిమ దిశగా ప్రయాణించే వ్యక్తులు తప్పనిసరిగా తమ గడియారాలను సెట్ చేసుకోవాలి:

  • దాటిన ప్రతి 15° రేఖాంశానికి ఒక గంట వెనుకకు సమయాన్ని మార్చుకోవాలి.
  • అంతర్జాతీయ తేదీ రేఖను దాటిన తర్వాత 24 గంటలు ముందుకు వెళ్ళాలి.

తూర్పు వైపు ప్రయాణించే వారు తప్పనిసరిగా తమ గడియారాలను సెట్ చేసుకోవాలి:

  • దాటిన ప్రతి 15° రేఖాంశానికి ఒక గంట ముందుకు సమయాన్ని మార్చుకోవాలి.
  • అంతర్జాతీయ తేదీ రేఖను దాటిన తర్వాత తిరిగి 24 గంటలు వెనుకకు వెళ్ళాలి.

దీన్ని చేయడంలో విఫలమైతే వారి సమయం స్థానిక సమయానికి సరికాదు.

అంతర్జాతీయ దినరేఖ, తేదీ, రోజు సమయం మధ్య సంబంధం యొక్క సరళీకృత ఉదాహరణ. ప్రతి రంగు వేరే తేదీని సూచిస్తుంది.

అరబ్ భౌగోళిక శాస్త్రవేత్త అబుల్ఫెడా (1273–1331) భూ ప్రదక్షిణలు చేసేవారు స్థానిక తేదీకి ఒక-రోజు కలిపి పూర్తి చేస్తారని అంచనా వేశారు.[1] ఈ దృగ్విషయాన్ని 1522లో మొదటి విజయవంతమైన భూ ప్రదక్షిణ చేసిన మాగెల్లాన్-ఎల్కానో (1519-1522) చేసిన ప్రదక్షిణ ముగింపులో నిర్ధారించబడింది. స్పెయిన్ నుండి ప్రపంచవ్యాప్తంగా యాత్రలో భాగంగా పడమటివైపు ప్రయాణించిన తర్వాత, 1922 జూలై 9 (ఓడ సమయం) బుధవారం నాడు కేప్ వెర్డే చేరాడు. అయితే, స్థానికులు అది వాస్తవానికి 1522 జూలై 10 గురువారం అని చెప్పారు. మూడు సంవత్సరాల ప్రయాణంలో ప్రతి రోజును మరచిపోకుండా రికార్డ్ చేయడంతో సిబ్బంది ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోయారు.[2] స్పెయిన్‌లోని వెనీషియన్ రాయబారి కార్డినల్ గ్యాస్‌పారో కాంటారిని ఈ వైరుధ్యానికి సరైన వివరణ ఇచ్చిన మొదటి యూరోపియన్.[3]

మూలాలు

[మార్చు]
  1. Gunn, Geoffrey C. (15 October 2018). Overcoming Ptolemy: The Revelation of an Asian World Region. Lanham, Maryland: Lexington Books. pp. 47–48. ISBN 9781498590143.
  2. Neal, Larry (1993). The Rise of Financial Capitalism: International Capital Markets in the Age of Reason. Cambridge University Press. p. 1. ISBN 978-0-521-45738-5.
  3. Winfree, Arthur T. (2001). The Geometry of Biological Time (in ఇంగ్లీష్) (2nd ed.). New York: Springer Science & Business Media. p. 10. ISBN 978-1-4757-3484-3.