అంతర్జాతీయ పులుల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ పులుల దినోత్సవం
అంతర్జాతీయ పులుల దినోత్సవం
జరుపుకొనే రోజుజూలై 29
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదేరోజు

అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పులుల సంరక్షణపై అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]

ప్రారంభం[మార్చు]

2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది.[2] పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచి వారినుండి సహాయాన్ని అందుకోవడం ఈ దినోత్సవ ముఖ్యోద్ధేశ్యం.[3]

కార్యక్రమాలు[మార్చు]

 1. 2017: ఏడవ అంతర్జాతీయ పులుల దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలతోపాటు పులులు లేని దేశాలైన ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్ లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.[4][5][6][7][8][9] అనేకమమంది వారివారి సోషల్ మీడియా ప్రొఫైల్ ఫోటోలను తొలగించడం ద్వారా అంతర్జాతీయ పులుల దినోత్సవంకు తమ మద్దతును ప్రకటించారు.[10] డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రేంజర్ల ద్వారా "డబుల్ టైగర్స్" ప్రచారం జరిగింది.[11] దీని గురించి అవగాహన పెంచడానికి అనేక కంపెనీలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తో భాగస్వామ్యం అయ్యాయి.[12][13]

ఫలితాలు[మార్చు]

భారతదేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు అడవి పులుల సంఖ్యను లెక్కిస్తారు. పులుల సంఖ్య 2006లో 1411, 2010లో 1,726 ఉండగా 2014లో 2226కి పెరిగింది.[14] 2018 నాటికి 2,967 పులులు ఉన్నట్లు అంచనా వేశారు.[15][16]

మూలాలు[మార్చు]

 1. Watts, Jonathan (24 November 2010). "World's first tiger summit ends with £330m pledged amid lingering doubts". The ..Guardian. London. Retrieved 29 July 2019.
 2. "Vietnam observes International Tiger Day". Retrieved 29 July 2019. Cite news requires |newspaper= (help)
 3. "International Tiger Conservation Forum". Tiger Conservation Forum. Retrieved 29 July 2019.
 4. Independent, The. "Saving Our Tigers". Saving Our Tigers | theindependentbd.com. Retrieved 29 July 2019.
 5. International Tiger Day
 6. "7th World Tiger Day to be marked on Saturday". The Himalayan Times (ఆంగ్లం లో). 27 July 2017. Retrieved 29 July 2019.
 7. "Tiger Day to be held at Indira Gandhi Zoological Park today". The Hans India (ఆంగ్లం లో). Retrieved 29 July 2019.
 8. "Yorkshire Wildlife Park prepares for Tiger Day". ITV News. Retrieved 29 July 2019.
 9. "International Tiger Day". Oregon Zoo. Retrieved 29 July 2019.
 10. "'Star Trek' Actor Says Earth's 4,000 Tigers Are Worth Saving". GOOD Magazine. 17 July 2017. Retrieved 29 July 2019.
 11. "WWF - Tiger Day". tigerday.panda.org (ఆంగ్లం లో). Retrieved 29 July 2019.
 12. "The world needs more tigers – News | .eco". News | .eco. 28 July 2017. Retrieved 29 July 2019.
 13. "Age gate". 3890.tigerbeer.com. మూలం నుండి 12 May 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 29 July 2019.
 14. On International Tiger Day, Hopes Pinned For Tiger Population To Increase Anuj Pant on NDTV, 29 July 2018
 15. నమస్తే తెలంగాణ, జాతీయం (29 July 2019). "భారత్‌లో పులుల సంఖ్య 2,967". www.ntnews.com. మూలం నుండి 29 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 29 July 2019.
 16. బిబిసీ తెలుగు, జాతీయం (29 July 2019). "భారత్‌లో రెట్టింపైన పులులు... ఇంతకూ వీటిని ఎలా లెక్కిస్తారు". మూలం నుండి 29 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 29 July 2019. Cite news requires |newspaper= (help)