అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం
స్వరూపం
అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | ఏప్రిల్ 12 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న నిర్వహించబడుతుంది. యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపబడుతుంది.
ప్రారంభం
[మార్చు]1961లో యూరి గగారిన్ వోస్టాక్ 1 అంతరిక్ష విమానంలో ప్రయాణించి, వోస్టోక్-కె ప్రయోగించిన వోస్టోక్ 3 కెఎ అంతరిక్ష నౌకలో 108 నిమిషాలపాటు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు.[1] అంతరిక్షయానం 50వ వార్షికోత్సవానికి కొన్నిరోజులముందు 2011, ఏప్రిల్ 11న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 65వ సెషన్‌లో ఈ దినోత్సవం ప్రకటించబడింది.[2]
ఇతర వివరాలు
[మార్చు]- 1963, ఏప్రిల్ 12నుండి సోవియట్ యూనియన్ లో కాస్మోనాటిక్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇప్పటికీ రష్యా, కొన్ని సోవియట్ పాత రాష్ట్రాల్లో కూడా దీనిని పాటిస్తారు.
- 2001లో గగారిన్ అంతరిక్షయానం 40వ వార్షికోత్సవం సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ లో "వరల్డ్ స్పేస్ పార్టీ" అని కూడా పిలువబడే యూరిస్ నైట్ ప్రారంభించబడింది.
- 1981, ఏప్రిల్ 12 కొలంబియాకు చెందిన ఎస్టిఎస్-1 మొదటి అంతరిక్ష నౌక ప్రయోగం జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ "International Day of Human Space Flight History". WpLINEQuotes. Archived from the original on 12 April 2020. Retrieved 12 April 2020.
- ↑ "UN Resolution A/RES/65/271, The International Day of Human Space Flight (12 April)". 7 April 2011. Retrieved 12 April 2020.