అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం
{{{holiday_name}}}
అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం 2020 లోగో
అధికారిక పేరుఅంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం
యితర పేర్లుపబ్లిక్ డొమైను డే, ప్రజాక్షేత్ర దినోత్సవం
జరుపుకొనే రోజుజనవరి 1
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతిరోజు ఇదే రోజు

అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం (పబ్లిక్ డొమైను డే, ప్రజాక్షేత్ర దినోత్సవం) ప్రతి సంవత్సరం జనవరి 1న నిర్వహించబడుతుంది. రచనల కాపీహక్కులు కాలం చెల్లిపోయినపుడు సార్వజనీనం అయ్యి ప్రజాక్షేత్రంలోనికి వస్తాయి. కాపీహక్కులు అనేది అనుసరించి జనవరి 1న ఆయా దేశాల వ్యక్తిగత కాపీహక్కుల చట్టం ఆధారంగా జరుగుతుంది.[1]

సార్వజనీన దినోత్సవం పాటించడం మొదట్లో అనధికారికం. 2004లో మొట్టమొదటిసారిగా కెనడియన్ పబ్లిక్ డొమైన్ కార్యకర్త వాలెస్ మెక్లీన్ ఈ దినోత్సవం గురించి ప్రస్తావించాడు,[2] లారెన్స్ లెస్సిగ్ మద్దతు ఇచ్చాడు.[3]

ప్రపంచంలోని అనేక వెబ్‌సైట్లు ప్రతి సంవత్సరం జనవరి 1న పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించే రచయితల జాబితా విడుదల చేస్తాయి. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని సంస్థలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

సార్వజనీనం[మార్చు]

కాపీహక్కుల పరిరక్షణ నిబంధనలు సాధారణంగా రచయిత జీవితకాలం లేదా రచయిత మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత లెక్కించబడుతాయి.[4] అనేక న్యాయ పరిధులలో, రచయిత మరణించిన రోజు నుండి 70 సంవత్సరాలు గడిస్తే పబ్లిక్ డొమైనులోకి వస్తాయని అర్థం.[4] ఆ కాలం తరువాత, ఆ రచయితలు రాసిన రచనలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దాంతో ప్రతి ఒక్కరూ ఎవరి అనుమతి లేకుండా వాటిని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు.[4] చట్టబద్ధంగా, ప్రతి సంవత్సరం జనవరి 1న ఆయా రచయితల రచనలు పబ్లిక్ డొమైనులోకి వస్తాయి.[5]

మూలాలు[మార్చు]

  1. Richmond, Shane (1 January 2010). "Happy Public Domain Day! Here's to many more – Telegraph Blogs". Blogs.telegraph.co.uk. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 1 January 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. Happy Public Domain Day!, Wallace J.McLean, Jan 1, 2004.
  3. Lessig, Lawrence (1 January 2004). "public domain day - in Canada (Lessig Blog)". Lessig.org. Archived from the original on 1 జూలై 2007. Retrieved 1 జనవరి 2020. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  4. 4.0 4.1 4.2 "About | Public Domain Day - 1 January 2012". Public Domain Day. Archived from the original on 6 జనవరి 2010. Retrieved 1 January 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. "To celebrate the role of the public domain in our societies | Public Domain Day - 1 January 2012". Public Domain Day. Archived from the original on 6 డిసెంబర్ 2011. Retrieved 1 January 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)

ఇతర లంకెలు[మార్చు]