అంతర్జాల తటస్థత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంతర్జాల తటస్థత (నెట్ న్యూట్రాలిటీ) అనేది ప్రతీ ఒక్క వినియోగదారుడికి అంతర్జాలం ఒకేలా అందేలా చూడడం. అంతర్జాల సేవలందించేవారు, ప్రభుత్వమూ కూడా అతర్జాలంలో లభించే సమాచారాన్నంతటినీ ఒకేలా చూడాలి. కొన్ని సర్వీసులకు ఎక్కువగాను, కొన్నిటికి తక్కువగాను వినియోగం అందేలా హెచ్చుతగ్గులు చూపించ కూడదు. ఇలా చేయడం వలన కొన్ని కొన్ని సమాచార సాంకేతిక సంస్థలు వారి స్వలాభాల కోసం అంతర్జాల సర్వీస్ ప్రొవైడర్స్, ప్రభుత్వాలు మొదలైనవారితో కలిసి గుత్తాధిపత్యం వహించడానికి వీలుగా అంతర్జాలాన్ని మార్చుకుంటున్నారు. ఈ పరిస్థితి వలన కొత్తగా వెలువడుతున్న సంస్థలు, వారి ప్రచార నిమిత్తం గానీ, ఇతర విషయాల కోసం గానీ గుత్తాదిపత్యం వహిస్తున్న సంస్థలతో చేతులు కలపాల్సి వస్తుంది. అలాగే విలువైన సమాచారాన్ని వాళ్లు ప్రజలకు అందకుండా చేసే అవకాశం ఉంది.

ఫేస్‌బుక్ సంస్థ యొక్క ఇంటర్నెట్ డాట్ ఒర్ జి (internet.org) మరియు ఫ్రీ బేసిక్స్ (free basics) అనేవి ప్రత్యేక ఉదాహరణలు. ఇటువంటి కార్యాల వలన సామాన్య వినియోగదారులు అంతర్జాల వినియోగానికే పరిమితమై ఉండాల్సి వస్తుంది. అంతర్జాలంలో ఎవరైనా వారి భావాలను తెలుపుకునే స్వతంత్రతను కోల్పోతారు.