అంధుడికి అద్దం చూపించినట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది. కానీ, దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసిగి, "ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినపుడు, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది, పనికిరానిది అని అన్నపుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు. ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, వెతుకు

ఈ సామెత కొద్దిగా అమాయకపు మొగుడి గురించి, పది మందిలో ఉన్నప్పుడు ప్రక్కవారిని అర్ధం చేసుకోకుండా, ప్రక్కవారి సున్నితపు సంకేతాల్ని పట్టించుకోకుండా, లౌక్యం లేకుండా ప్రవర్తించె వారిని ఉద్దేశించి అసహంగా వాడుతారు. ఇది నిజానికి శృంగారానికి సమయం అయినప్పుడు మెల్లిగా చెవిలో గొణుగుతుంది. అది పట్టించుకోని భర్తకు పైకి గట్టిగా చెప్పలేక పది మందిలో ఉన్న భర్తను పడక గదికి పిలువలేక తొడగిల్లుతుంది. దానిని అర్ధంచేసుకోలేని భర్త "అబ్బ ఏమిటే అలా గిల్లావు" అని ఏడుపు మోఖం పెడతాడు. ఆ సందర్భం నుండి పుట్ట్టిన సామెత ఇది. నర్మగర్భంగా చెబుతున్న విషయాన్ని అర్ధం చేసుకొని వారి పట్ల ఈ సామెతను వాడుతారు. అసలు సామెత "ఛాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు ఇది తెలుగు భాషలో ఒక సామెత.

"ఉట్టి" - అంటే త్రాళ్ళతో అల్లిన ఒక సాధనం. కప్పునుండి వ్రేలాడుతుంది. పల్లెలలో (ఇదివరకు) పాలు, పెరుగు వంటివాటిని పైకప్పునుండి ఉట్టిలో వ్రేలాడదీసే వారు, పిల్లులవంటివాటినుండి రక్షణగా. (ఇప్పుడు చిన్నికృష్ణుని కేలెండర్లలో ఎక్కువగా చూస్తుంటాము.)

ఏదైనా ఒక పని చెయ్యాలంటే ప్రతీ మనిషికి ఎంతో కొంత సామర్థ్యం వుండాలి. ప్రతిపనీ చేసేస్తానని గొప్పలు పోతే అందరిలోను నవ్వులపాలు కాక తప్పదు. అలాంటి సందర్భంలో వచ్చే సామెతే ఇది.ఇంట్లో చూరికి వున్న ఉట్టి ఎగిరి అందుకోలేని ఆవిడ ఆకాశం లోని స్వర్గాన్ని అందుకోలేదుకదా. అలాగే చిన్న పని చెయ్యలేని వారు వారి సామర్ధ్యానికి మించిన పని చేస్తానంటే వారిని వేళాకోళం చేస్తూ అనే మాట ఇది. ఏదైనా విషయాన్ని గూర్చి చెప్పాల్సినపుడు అసలు పొంతనలేకుండా అన్నీ తప్పులు చెప్పడాన్ని ఈ సామెతద్వారా అధిక్షేపించవచ్చును. అనే కాదు, జవాబు చెప్పేవాడికి అసలేమీ తెలియదని కూడా ఈ సామెత ద్వారా చురకంటించవచ్చును.

పంచపాండవులు "ఐదుగురు" (ప్రశ్నలోనే జవాబు ఉంది. పంచ = 5). మంచానికి "నాలుగు" కోళ్ళుంటాయి. మంచకోళ్ళలాగా నాలుగు అని చెపితే పోనీలే తెలియదని సరిపెట్టుకోవచ్చును - కానీ మంచంకోళ్ళలాగా "మూడు" అన్నాడు. అలాగని అన్నవాడు మూడువేళ్ళు చూపినా కొంతలో కొంత మెరుగు. కానీ "రెండు" వేళ్ళు చూపాడు. ("ఒకటి" అంకె వ్రాశాడని కొందరు ఈ సామెతను కాస్త సాగదీస్తారు కూడాను).

ఇక్కడ విశేషమేమంటే అతిసులభమైన ప్రశ్నకు ఒకే చిన్న వాక్యంలో మూడు తప్పు జవాబులను కూడగట్టడం. అలా చెప్పిన వాడు తెలివి తక్కువవాడు కాదు. అతితెలివిగలవాడయ్యుండాలి.

ఇదే అర్ధంలో చెప్పే మరొక సామెత: అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట