అంబేద్కర్ జయంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ రాజకీయవేత్త, సంఘ సంస్కర్త అయిన బి.ఆర్. అంబేడ్కర్ జ్ఞాపకార్థం ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి లేదా భీమ్ జయంతి జరుపుకుంటాము. అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న జన్మించాడు అతని జన్మదినాన్ని భారతదేశంలోని కొందరు 'సమానత్వ దినోత్సవం' గా కూడా పిలుస్తారు.[1][2][3]

అంబేద్కర్ జయంతి
అంబేద్కర్ జయంతి
చైత్య భూమి వద్ద అంబేద్కర్ జయంతి ఊరేగింపు
అధికారిక పేరుఅంబేద్కర్ జయంతి[4]
యితర పేర్లుభీమ్ జయంతి
జరుపుకొనేవారుభారతదేశం
రకంఅంబేద్కర్ జన్మదినం
జరుపుకొనే రోజు14 ఏప్రిల్
వేడుకలుసామాజిక, చారిత్రక వేడుకలు
ఆవృత్తివార్షికం

నిర్వహణా స్థలాలు[మార్చు]

అంబేద్కర్ జయంతి ఊరేగింపులను ముంబైలోని చైత్య భూమి, నాగపూర్ లోణి దీక్షా భూమి వద్ద ఆయన అనుచరులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వంటి సీనియర్ జాతీయ ప్రముఖులు నివాళులర్పించడం ఆనవాయితీ. భారతదేశంలో, పెద్ద సంఖ్యలో ప్రజలు అంబేద్కర్‌ను స్మరించుకునే స్థానిక విగ్రహాలను చాలా కోలాహలంగా ఊరేగింపుగా తిసుకెళ్తారు. 2020లో, ప్రపంచంలో మొట్టమొదటి ఆన్‌లైన్ అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు.[5]

ఆంధ్ర ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడఖ్, మధ్యప్రదేశ్ తో సహా భారతదేశంలోని 25 కంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంబేద్కర్ జయంతి పబ్లిక్ సెలవుదినంగా ప్రకటించారు.

చరిత్ర[మార్చు]

బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి పుట్టినరోజును 14 ఏప్రిల్ 1928న పూణేలో అంబేద్కరైట్, సామాజిక కార్యకర్త అయిన జనార్దన్ సదాశివ్ రణపిసే బహిరంగంగా జరుపుకున్నారు. అతను బాబాసాహెబ్ జయంతి లేదా అంబేద్కర్ జయంతి సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అంబేద్కర్ 1907లో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రం, రాజకీయ శాస్త్రంలో BA ఆనర్స్‌ను అభ్యసించారు. అతను మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ కోసం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో చేరాడు, 1927లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీని పొందాడు. 1916లో, అతను గ్రేస్ ఇన్‌లో బార్ కోర్సులో ప్రవేశం పొందాడు, దీనితో పాటు లండన్ నుండి ఆర్థికశాస్త్రంలో మరో డాక్టరల్ థీసిస్ కూడా చేశాడు. అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్, 11 భాషలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు.

నివాళులు[మార్చు]

1966, 1973, 1991, 2001, 2013లో అంబేద్కర్ జన్మదినానికి అంకితమైన స్టాంపులను ఇండియన్ పోస్ట్ విడుదల చేసింది, 2009, 2015, 2016, 2017 మరియు 2020లలో ఇతర స్టాంపులపై అతని చిత్రాన్ని ప్రదర్శించింది.[6][7]

1990 ఏప్రిల్ 14న అంబేద్కర్‌కు భారతరత్న అవార్డు లభించింది. అదే సంవత్సరం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఆయన జీవిత పరిమాణం చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించారు. 14 ఏప్రిల్ 1990 నుండి 14 ఏప్రిల్ 1991 వరకు బాబాసాహెబ్ జ్ఞాపకార్థం "సామాజిక న్యాయ సంవత్సరం"గా పాటించబడింది.

అంబేద్కర్ గౌరవార్థం 125వ జయంతి సందర్భంగా 2015లో భారత ప్రభుత్వం 10 రూపాయలు, 125 రూపాయల నాణేలను విడుదల చేసింది.

14 ఏప్రిల్ 2015న, అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా Google డూడుల్ ప్రచురించబడింది. డూడుల్ భారతదేశం, అర్జెంటీనా, చిలీ, ఐర్లాండ్, పెరూ, పోలాండ్, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ప్రదర్శించబడింది.

ఐక్యరాజ్యసమితి 2016, 2017, 2018లో అంబేద్కర్ జయంతిని జరుపుకుంది.

2017లో, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకారం, అంబేద్కర్ జ్ఞాపకార్థం భారతదేశంలోని మహారాష్ట్రలో ఏప్రిల్ 14ని నాలెడ్జ్ డే (జ్ఞాన్ దిన్)గా పాటిస్తారు.

2017లో, అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయనకు నివాళిగా అంబేద్కర్ ఎమోజీని ట్విట్టర్ ప్రారంభించింది.

6 ఏప్రిల్ 2020న, కెనడాలో, ఏప్రిల్ 14ని "డా. బి.ఆర్. అంబేద్కర్ సమానత్వ దినోత్సవం"గా పాటించాలని నిర్ణయించారు. కెనడాలోని బర్నబీ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.

2021లో, బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఏప్రిల్ 14ని "డా. బి. ఆర్. అంబేద్కర్ సమానత్వ దినోత్సవం"గా పాటించాలని నిర్ణయించింది.

2022లో, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ఏప్రిల్‌ను దళితుల చరిత్ర నెలగా గుర్తించింది.

2022లో, బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం (కెనడా) కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఏప్రిల్ 14న "డా. బి.ఆర్. అంబేద్కర్ సమానత్వ దినోత్సవం"గా పాటిస్తుంది.

2022లో, కొలరాడో ప్రభుత్వం (యునైటెడ్ స్టేట్స్) 14 ఏప్రిల్ 2022ని యునైటెడ్ స్టేట్స్‌లోని కొలరాడోలో "డా. బి.ఆర్. అంబేద్కర్ ఈక్విటీ డే"గా పాటించింది.

2022లో, తమిళనాడు ప్రభుత్వం (భారతదేశం) అంబేద్కర్ జయంతిని (ఏప్రిల్ 14) తమిళనాడు రాష్ట్రంలో "ఈక్విటీ డే"గా జరుపుకుంది.

మూలాలు[మార్చు]

  1. कुमार, अरविन्द (2020-04-14). "असमानता दूर करने के लिए भीमराव आंबेडकर ने क्या उपाय दिए थे". ThePrint Hindi (in ఇంగ్లీష్). Retrieved 2021-04-06.
  2. "Ambedkar Jayanti 2020: आज है अंबेडकर जयंती, जानिए बाबा साहेब से जुड़ी ये 7 बातें". NDTVIndia. Retrieved 2021-04-06.
  3. हिंदी, क्विंट (2020-04-13). "B.R. Ambedkar Jayanti 2020: पढ़ें अंबेडकर साहब के ये अनमोल विचार". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2021-04-06.
  4. "सार्वजनिक सुट्ट्या-महाराष्ट्र शासनाचे अधिकृत संकेतस्थळ, भारत". Retrieved 3 March 2019.
  5. "Ambedkar Jayanti - Bhim Jayanti - 14 April". Retrieved 28 March 2017.
  6. Ambedkar on stamps. colnect.com
  7. B. R. Ambedkar on stamps. commons.wikimedia.org