అకినోబు ఒకాడ
అకినోబు ఒకాడా | |
|---|---|
| జననం | 1957 నవంబరు 25 ఒసాకా ప్రిఫెక్చర్, జపాన్ |
| వృత్తి | ప్రొఫెషనల్ బేస్బాల్ ఇన్ఫీల్డర్, మేనేజర్ |
| పురస్కారాలు |
|
అకినోబు ఒకాడా (ఆంగ్లం: Akinobu Okada; జననం 1957 నవంబరు 25), జపనీస్ మాజీ ప్రొఫెషనల్ బేస్బాల్ ఇన్ఫీల్డర్, మేనేజర్. ఆయన హన్షిన్ టైగర్స్, ఒరిక్స్ బ్లూవేవ్ ల కోసం 1980 నుండి 1995 వరకు నిప్పాన్ ప్రొఫెషనల్ బేస్బాల్ లో ఆడాడు. హన్షిన్ టైగర్స్ 30వ, 35వ మేనేజర్, ఒరిక్స్ బఫెలోస్ 25వ మేనేజర్. 2024 ఆఫ్-సీజన్ నుండి హాన్షిన్ బేస్ బాల్ జట్టు యజమానికి సలహాదారుగా వ్యవహరించాడు. ఆయనను ముద్దుగా "డోండెన్" అని మారుపేరుతో అభిమానులు పిలుచుకుంటారు.
కెరీర్
[మార్చు]అకినోబు ఒకాడా 1980 నుండి 1993 వరకు హన్షిన్ టైగర్స్ తరపున రెండవ బేస్ మాన్ గా ఆడాడు. ప్రస్తుతం ఉన్న 12 జపనీస్ ప్రొఫెషనల్ బేస్బాల్ జట్లలో, యోమియురి జెయింట్స్ తర్వాత హన్షిన్ టైగర్సే దీర్ఘకాలంగా నడుస్తున్న జట్టు. 1980లో సెంట్రల్ లీగ్ రూకీ ఆఫ్ ది ఇయర్ ను అకినోబు ఒకాడా గెలుచుకున్నాడు. 1993 లో అతన్ని ఒరిక్స్ బ్లూవేవ్ కొనుక్కుంది. 1995 వరకు అక్కడే ఆడాడు.
శిక్షకుడు
[మార్చు]ఆయన 2004 నుండి 2008 వరకు హన్షిన్ టైగర్స్ జట్టును నిర్వహించాడు. అతని నేతృత్వంలో జట్టు, 2005లో సెంట్రల్ లీగ్ పెన్నంట్ గెలుచుకుంది. 2008 నవంబరులో ఆయన, వ్యాఖ్యాతగా డైలీ స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2009లో అసాహి బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (ఎబిసి, ఎఎమ్ రేడియో, టెరెస్ట్రియల్ టివి) లోను, స్కై ఎ స్పోర్ట్స్ ప్లస్ (ఎస్కెవై పెర్ఫెక్ టివి!, శాటిలైట్ టివి) లోను, కాన్సాయ్ ప్రాంతంలోని ఇతర ప్రసార స్టేషన్ల లోనూ కనిపించాడు.
ఒకాడా 2010లో తిరిగి రంగంలోకి దిగాడు. 2010 నుండి 2012 వరకు ఒరిక్స్ బఫెలోస్ ను నిర్వహించాడు. 2022 సెప్టెంబరు 26 న హన్షిన్ టైగర్స్ ఆయన్ను మేనేజర్ గా నియమించుకుంది. ఈ క్లబ్బులో అతనికి ఇది రెండవసారి నిర్వాహక పదవీకాలం.[1] 2023 లో అతని మొదటి సీజన్లో, 2023 జపాన్ సిరీస్లో హన్షిన్ టైగర్స్ అతని మాజీ జట్టు అయిన ఓరిక్స్ బఫెలోస్ను 3-4తో ఓడించింది. ఇది ఆయనకు హన్షిన్ కు మేనేజర్ గా ఛాంపియన్షిప్ ను అందించడమే కాకుండా, 1985 తరువాత అప్పటి వరకూ ఛాంపియన్షిప్ సాధించని టైగర్స్ జట్టు కప్పు దక్కించుకుంది. ఆ సీజన్ తరువాత పదవీ విరమణ చేస్తానని ఒకాడా 2024 అక్టోబరు 2 న ప్రకటించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Akinobu Okada Named New Manager". thehanshintigers.com (in ఇంగ్లీష్). October 17, 2022. Archived from the original on 2024-02-24. Retrieved June 21, 2023.
- ↑ "x.com".