Jump to content

అక్కపల్లి (రాచర్ల)

అక్షాంశ రేఖాంశాలు: 15°30′54.396″N 78°57′43.884″E / 15.51511000°N 78.96219000°E / 15.51511000; 78.96219000
వికీపీడియా నుండి
అక్కపల్లి (రాచర్ల)
గ్రామం
పటం
అక్కపల్లి (రాచర్ల) is located in ఆంధ్రప్రదేశ్
అక్కపల్లి (రాచర్ల)
అక్కపల్లి (రాచర్ల)
అక్షాంశ రేఖాంశాలు: 15°30′54.396″N 78°57′43.884″E / 15.51511000°N 78.96219000°E / 15.51511000; 78.96219000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

అక్కపల్లి (రాచర్ల) , ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కనకసురభేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయ అభివృద్ధి పనులకు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు, 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారంనాడు, మహాశివరాత్రి సందర్భంగా 1,36 లక్షల రూపాయలను వితరణగా అందించారు.

ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా, 25వతేదీ శనివారం తెల్లవారుఝామున, వేదపండితుల ఆధ్వర్యంలో, శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కనకసురభేశ్వరస్వామివారి కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారలకు ఉభయదాతలు పువ్వాడ వంశీయులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

శ్రీ కనకసురభేశ్వరీ మాత ఆలయం

[మార్చు]

ఈ ఆలయం శ్రీ కనకసురభేశ్వరస్వామివారి ఆలయానికి దగ్గరలోనే ఉన్నది. ఈ మాత ఆలయంలో 2017,జులై-16వతేదీ ఆదివారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు, పొంగళ్ళు సమర్పించినారు, అష్టోత్తర శతనామావళి, కుంకుమపూజలు నిర్వహించినారు.

శ్రీ పాపవినాశేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ ప్రతాప వీరాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

పై రెండు ఆలయాల సమీపంలోని ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి, 41 రోజులైన సందర్భంగా, 2017-మార్చి-12వతేదీ ఆదివారం, ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పండుగనాడు, స్వామివారికి వేదపండితులు ప్రత్యేకపూజలు, పంచామృత అభిషేకం, ఆకుపూజ, వనమాల పూజ, హోమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు.

అవధూత కోన అమ్మవారి ఆలయం

[మార్చు]

ఈ గ్రామంలో వెలిసిన ఈ అమ్మవారి 17వ ఆరాధనా మహోత్సవాలు, 2016,ఫిబ్రవరి-12వ తేదీ శుక్రవారంనాడు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు శ్రీ కనుమర్లపూడి వెంకటసుబ్బయ్య ఇంటి వద్ద నుండి పటం, కలశాలను ఆలయానికి ఊరేగింపుగా తీసికొని వెళ్ళినారు. అనంతరం భక్తులు, దాతలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం పూజా కార్యక్రమాలు, అన్నసంతర్పణ, సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక భజనకార్యక్రమాలు వీనులవిందుగా సాగినవి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]