అక్కపాలెం (పుల్లలచెరువు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపుల్లలచెరువు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523326 Edit this on Wikidata


అక్కపాలెం ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం శతకోడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

స్వయంభువు లింగరూపం[మార్చు]

పుల్లలచెరువు మండలంలోని శతకోడు పంచాయతీలొని అక్కపాలెం చెంచుగూడేనికి 5 కి.మీ. దూరంలోని నల్లమల అటవీప్రాంతంలోని చింతల సెలకొండ ఉన్నది. అక్కడ సుమారు 150 అడుగుల ఎత్తులోగల బండల కొండల గుహలలో శివలింగరూపాన్ని, 15 రోజుల క్రితం, అక్కడకు వెళ్ళిన గొర్రెలకాపరులు గుర్తించినారు. అనంతరం ఆ ప్రాంతవాసులు, బ్యాటరీ లైట్ల సాయంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి, పలు అంశాలను వెలుగులోనికి తీసుకొనివచ్చినారు. ఆ ప్రాంతములో నాగేంద్రస్వామి పుట్ట, స్వయంభువు లింగరూపం వెలసి ఉండటంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. గుహలో సుమారు 50 మీటర్ల దూరం వెళ్లిన తరువాత, 15 అడుగుల ఎత్తయిన ఒక చెరియపై, నిత్యం కొండ చెరియ నుండి వచ్చిన నీటితో అభిషేకం చేస్తున్నట్లు ఉన్న లింగరూపం కనిపిస్తున్నది. అదే కొండ చెరియ క్రింది భాగంలో పాలపొదుగు ఆకారం నుండి నీటి బిందువులు, క్రింద ఉన్న పుట్టలాంటి ఆకారంపైన పడుతూ, అక్కడి విశిష్టతను తెలుపుతుంది. ప్రస్తుతం శుక్రవారం, ఆదివారం రోజులలో భక్తులు అధికసంఖ్యలో, చింతల సెలకొండకు, కాలినడకనే వెళ్తున్నారు. కొండచెరియ వద్దకు, తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయుటకు భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు ముందుకు వచ్చుచున్నారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]