అక్టోబర్ విప్లవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్టోబర్ విప్లవం
రష్యన్ విప్లవం, 1917-23 నాటి విప్లవాలు, రష్యన్ అంతర్యుద్ధం వంటి పరిణామాల్లో భాగంలో భాగము

1917న వుల్కన్ ఫాక్టరీ వ్ద రెడ్ గార్డ్స్
తేదీ7–8 నవంబర్ 1917
ప్రదేశంపెట్రోగ్రాడ్, రష్యా
ఫలితం*రష్యన్ ప్రొవిన్షియల్ ప్రభుత్వం, రష్యన్ రిపబ్లిక్, ద్వంద్వ అధికారాలకు అంతం
  • సోవియట్ రష్యా స్థాపన
  • ఆల్-రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ అత్యున్నత పరిపాలనా సంస్థ కావడం
  • రష్యన్ అంతర్యుద్ధం ప్రారంభం
ప్రత్యర్థులు
ఆల్-రష్యన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
రెడ్ గార్డ్స్
పెట్రోగ్రాడ్ సోవియట్
బోల్షెవిక్ పార్టీ
రష్యన్ సోవియట్ రిపబ్లిక్ (నవంబర్ 7 నుంచి)
రష్యన్ రిపబ్లిక్ (నవంబర్ 7 వరకు)
రష్యన్ ప్రొవిన్షియల్ ప్రభుత్వం (నవంబర్ 8 వరకూ)
సేనాపతులు, నాయకులు
వ్లాదిమిర్ లెనిన్
లియో ట్రాట్ స్కీ
పావెల్ డైబెన్కో
Russia అలెగ్జాండర్ కెరెన్స్కీ
బలం
10,000 రెడ్ సైలర్స్, 20,000–30,000 రెడ్ గార్డ్ సైనికులు500–1,000 స్వచ్ఛంద సైనికులు, 1,000 వుమెన్ బాటిలియాన్ సోల్జర్స్
ప్రాణ నష్టం, నష్టాలు
కొందరు రెడ్ గార్డ్ సైనికులు గాయపడ్డారుఅందరూ మృతిచెందారు

అక్టోబర్ విప్లవం[lower-alpha 1], సోవియట్ సాహిత్యంలో అధికారికంగా గొప్ప అక్టోబర్ సోషలిస్ట్ విప్లవంగానూ[lower-alpha 2], సామాన్యంగా రెడ్ అక్టోబర్ఎర్ర అక్టోబర్, అక్టోబర్ తిరుగుబాటుబోల్షెవిక్ విప్లవం, వంటి పేర్లతోనూ ప్రఖ్యాతి పొందినది 1917 రష్యన్ విప్లవంలో భాగంగా రాజ్యం యొక్క అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన. సంప్రదాయికంగా జూలియన్ లేదా ఓల్డ్ స్టైల్ క్యాలెండర్ ప్రకారం 1917 అక్టోబర్ 25 (గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం 7 నంబర్ 1917న) తేదీన పెట్రోగ్రాడ్లో జరిగిన సాయుధ తిరుగుబాటు ద్వారా జరిగింది.

అదే సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఫిబ్రవరి విప్లవాన్ని అక్టోబర్ విప్లవం అనుసరించి ప్రయోజనం పొందగలిగింది. జార్ నియంతృత్వ పరిపాలన అంతం చేసి, జార్ నికోలస్ 2 పదవీచ్యుతుడయ్యాకా అతని తమ్ముడు గ్రాండ్ డ్యూక్ మైకేల్ అధికార బదిలీ జరిగి పదవి స్వీకరించారు, ప్రొవిన్షియల్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సమయంలో పట్టణ కార్మికులు కౌన్సిళ్ళుగా (రష్యన్లో సోవియట్ అంటారు) సంఘటితమవుతూ వచ్చి, విప్లవకారులు ప్రొవిన్షియల్ ప్రభుత్వ కార్యకలాపాలను విమర్శించసాగారు. పెట్రోగ్రాడ్ లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రొవిన్షియల్ ప్రభుత్వాన్ని కూలదోసి, స్థానిక సోవియట్లకు అధికారాన్ని ఇచ్చింది. సోవియట్లు బోల్షెవిక్ పార్టీని విస్తృతంగా సమర్థించాయి. సోవియట్ల కాంగ్రెస్ తర్వాత, పరిపాలన సంస్థ రెండో సెషన్ జరుపుకుంది. బోల్షెవిక్కుల నుంచి, లెఫ్ట్ సోషలిస్ట్ రివల్యూషనరీస్ వంటి ఇతర వామపక్ష గ్రూపుల నుంచి సభ్యులను నూతన రాజ్య వ్యవహారాల్లో కీలక స్థానాలకు ఎన్నుకున్నారు. వెనువెంటనే ఇది ప్రపంచంలోకెల్లా తొలి స్వయం ప్రకటిత సోషలిస్టు దేశమైన రష్యన్ సోషలిస్ట్ ఫెడరేటివ్ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు దారితీసింది.

సాయుధ బలగాలను సమీకృతం చేసేలా పెట్రోగ్రాడ్ సోవియట్ పై ప్రభావం చూపి బోల్షెవిక్కులు ఈ విప్లవాన్ని నడిపించారు. మిలటరీ రివల్యూషన్ కమిటీ కింద బోల్షెవిక్ రెడ్ గార్డ్స్ బలగాలు ప్రభుత్వ భవంతులను 1917 అక్టోబర్ 24న స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాయి. తర్వాతి రోజు వింటర్ ప్యాలెస్ (అప్పటి రష్యా రాజధాని పెట్రోగ్రాడ్ లో ప్రొవిన్షియల్ ప్రభుత్వ స్థానం), స్వాధీనం అయిపోయింది.

ఎన్నాళ్ళ నుంచో వేచిచూస్తున్న రాజ్యాంగ అసెంబ్లీ ఎన్నికలు 1917 నవంబరు 12న జరిగాయి. 715 సీట్లున్న ఆ చట్టసభలో సోషలిస్ట్ రివల్యూషనరీ పార్టీ 370 సీట్లు గెలుచుకోగా బోల్షెవిక్కులు కేవలం 175 స్థానాలు గెలుచుకుని రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు. రాజ్యాంగ అసెంబ్లీ మొట్ట మొదటి సారి 1917 నవంబరు 28న సమావేశమైంది, ఐతే ప్రమాణ స్వీకారోత్సవం బోల్షెవిక్కుల కారణంగా 1918 జనవరి 5 వరకూ ఆలస్యమైంది. సెషన్లో మొట్టమొదటిది, చిట్టచివరిది అయిన ఆ రోజున శాంతి, భూమి వంటి అంశాల్లో సోవియట్ ఉత్తర్వును తిరస్కరించారు, తర్వాతి రోజున కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ఈ రాజ్యాంగ సభను రద్దు చేశారు.[1]

ఈ విప్లవానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించకపోవడంతో రష్యన్ అంతర్యుద్ధం (1917-22) జరిగింది, సోవియట్ యూనియన్ 1922లో ఏర్పడింది.

నోట్స్[మార్చు]

  1. రష్యన్: Октябрьская революция, tr. Oktyabrskaya revolyutsiya, IPA: [ɐkˈtʲabrʲskəjə rʲɪvɐˈlʲutsɨjə].
  2. రష్యన్: Великая Октябрьская социалистическая революция, tr. Velikaya Oktyabrskaya sotsialisticheskaya revolyutsiya.

మూలాలు[మార్చు]

  1. Jennifer Llewellyn, John Rae and Steve Thompson (2014). "The Constituent Assembly". Alpha History.