అక్షౌహిణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Army of Pandavas.jpg
పాండవుల సైన్యం

భారతీయ కొలమానంలో అక్షౌహిణి ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము : 1 ఏనుగు : 3 గుర్రాలు : 5 కాలిబంట్లు.

అక్షౌహిణి రథములు ఏనుగులు గుఱ్ఱములు కాలిబంట్లు
1 21,870 21,870 65,610 1,09,350

వివిధ ప్రమాణాలు[మార్చు]

పత్తి

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, ఐదు కాలిబంట్లు కలిస్తే ఒక "పత్తి" అంటారు.

1 రథములు + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు
సేనాముఖము

మూడు పత్తులు ఒక సేనాముఖము అనగా సేనాముఖము = 3 X పత్తి

3 రథములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు
గుల్మము

మూడు సేనాముఖములు ఒక గుల్మము. అనగా గుల్మము = 3 X సేనాముఖము

9 రథములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు
గణము

గణము అనగా మూడు గుల్మములు అనగా గణము = 3 X గుల్మము

27 రథములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు
వాహిని

వాహిని అనగా మూడు గణములు. అనగా గణము =3 X గణము

81 రథములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు
పృతన

పృతన అనగా మూడు వాహినులు అనగా పృతన=3 X వాహినులు

243 రథములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు
చమువు

చమువు అనగా మూడు పృతనల సైన్యము. అనగా 3 Xపృతన

729 రథములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు
అనీకిని

అనీకిని అనగా మూడు చమువుల సైన్యము. అనగా 3 Xచమువు.

2187 రథములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు
అక్షౌహిణి

అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని

21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు

ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రథములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు

ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,329 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.

రకం ఎన్నింతలు రథములు ఏనుగులు గుర్రాలు కాలిబంట్లు సారథి
పత్తి 1 1 1 3 5 పత్తిపాలుడు
సేనాముఖము 3 3 3 9 15 సేనాముఖి
గుల్మము 3*3 9 9 27 45 నాయకుడు
గణము 33 27 27 81 135 గణనాయకుడు
వాహిని 34 81 81 243 405 వాహినిపతి
పృతన 35 243 243 729 1,215 పృతనాధిపతి
చమువు (సేనా) 36 729 729 2,187 3,645 సేనాపతి
అనీకిని 37 2,187 2,187 6,561 10,935 అనీకాధిపతి
అక్షౌహిణి 10*37 21,870 21,870 65,610 1,09,350 మహా సేనాపతి

మరిన్ని ప్రమాణాలు[మార్చు]

అక్షౌహిణి X '18' = ఏకము

ఏకము X '8' = కోటి (ఈ కోటి మన కోటి కాదు)

కోటి X '8' = శంఖము

శంఖము X '8' = కుముదము

కుముదము X '8' = పద్మము

పద్మము X '8' = నాడి

నాడి X '8' = సముద్రము

సముద్రము X '8' = వెల్లువ

అంటే 36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.

ఇటు వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 = 256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి.

256842399744000 మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో (1,700,000 సంవత్సరాల పూర్వం) లంకకు వారధి కట్టారన్నమాట.

మూలాలు[మార్చు]