Jump to content

అగార్ ఉడ్

వికీపీడియా నుండి
'అగర్ ఉడ్ సాగు వివరాల కోసం ఆగర్వుడ్ ప్రసాద్ నీ సంప్రదించండి '8790291431 call me

అగర్వుడ్, అలోస్వుడ్, ఈగిల్వుడ్ లేదా ఘారువుడ్ ధూపం, పెర్ఫ్యూమ్, చిన్న శిల్పాలలో ఉపయోగించే సువాసనగల ముదురు రెసిన్ కలప. అక్విలేరియా చెట్ల చేవలో ఒక రకమైన పరాన్నజీవులతో చర్యపొందినప్పుడు. త్రిపుర రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి బిప్లాబ్ దిఫ్ గారు రాజ్యసభలో 2022 లో అగర్వుడ్ సెక్టార్ నీ ప్రవేశపెట్టారు. త్రిపుర రాష్ట్ర కి ప్రధాన ఆదాయ వనరుగా అగార్ వుడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అస్సాం ప్రభుత్వం 2023లో 20 లక్షల అగార్ మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. 24 ఇంచులు చుట్టుకొలత వచ్చిన ప్రతి చెట్టుకు ఐనాట్లేషన్ చెయ్యాలి . ఐనాకులేషన్ అనగా గా చెట్టుపై సమర్థవంతంగా పోరాడే ఎంజైమ్స్ నీ చెట్టు లోపల ఇంజెక్ట్ చేయడం.తద్వారా రెజిన్ అనే నల్ల రంగు చెక్క ఉత్పత్తి అవుతుంది.. ( పరాసిటికా) ఇది ఏర్పడుతుంది. ఆర్ధికంగా లాభదాయకమైన ఈ మొక్కల పెంపకాన్ని ఆంధ్రప్రదేశ్ లోనీ పామాయిల్ కొబ్బరి మామిడి రైతులు ప్రారంభించారు.[1] [2] తెలంగాణాలోనూ పలుజిల్లాలు అవలంభిస్తున్నారు. దీనిని అంతర్ పంటగా సాగు చేస్తే బాగా అనుకూలం. దీనిపై సంపంగి జంపాల ప్రసాద్ అనే యువరైతు చాలా రోజుల గా దేశాలు తిరిగి ఇనాక్లేషన్ పై రీసెర్చ్ చేస్తున్నాడు.

వాణిజ్య ప్రయోజనాలు

[మార్చు]
Cultivated aloes/agar wood

చెట్లలో రారాజు’గా పేరుగాంచిన అగర్‌ ఉడ్‌ చెట్టు రైతులకు వరంలా మారింది. సంపంగి జంపాల ప్రసాద్ అనే యువరైతు అగర్వుడ్ దాని ఉపయోగాలు మరియు అగరు వుడ్ సాగులో అతి ముఖ్యమైన ఈక్యులేషన్ ప్రక్రియపై చాలా దేశాలు తిరిగి విజ్ఞానాన్ని సంపాదించాడు. రాష్ట్రాలలో ద్రవ్యాలు, ఔషధాల తయారీలో దీని నుంచి తీసే ప్రత్యేక పదార్థాన్ని విరివిగా ఉపయోగిస్తారు.

మార్కెట్లో లాభాలు తెచ్చిపెట్టే రెసిన్

[మార్చు]

అగర్‌ ఉడ్‌ చెట్టులో ముఖ్యమైంది రెసీన్‌. దీని అమ్మకం ద్వారానే రైతుకు ఆదాయం సమకూరేది. వ్యావహారిక భాషలో చెప్పాలంటే బంక, గుజ్జు లాంటిదే రెసీన్‌ కూడా. ఇది చెట్టు కాండం మధ్యలో ఉత్పత్తి అవుతుంది. చెట్టు పై భాగం తెల్లగా లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. మధ్య భాగం మాత్రం నల్లగా ఉంటుంది. ఇదే రెజీన్‌.[3] ఎంత దట్టమైన నలుపులోకి వస్తే, అంత నాణ్యత ఉన్నట్టు. 8 నుంచి 10 ఏండ్ల తర్వాత చెట్టును కొట్టి దాని మధ్యలో ఉండే రెసీన్‌ను ప్రత్యేక పద్ధతిలో బయటకు తీస్తారు. నాణ్యతను బట్టి, కేజీకి రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ధర పలుకుతుంది. రెసీన్‌ నుంచి ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తారు. దీని ధర కూడా భారీగానే ఉంది. ఒక లీటర్‌ రూ. 5 నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. 20 నుంచి 25 కిలోల రెసీన్‌ నుంచి ఒక లీటర్‌ అగర్‌ ఉడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి అవుతుంది.

అగర్ వుడ్ నూనె

[మార్చు]

అగర్‌ ఉడ్‌ ఆయిల్‌ను సుగంధ ద్రవ్యాల తయారీలో, ఔషధాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఆకుల నుంచి అగర్ టీ

[మార్చు]

చెట్ల ఆకులను అగర్ టీ గా వినియోగిస్తారు. మేలు రకం ఆకులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చెట్టు వేర్లను కూడా పొడిచేసి టీ తయారీలో వాడతారు.

ఆరోగ్యం కోసం అగర్ వుడ్ నూనె

[మార్చు]

ఆస్తమా, కడుపునొప్పి, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, నరాల బలహీనతలు, ఒత్తిడి, డిప్రెషన్‌, లివర్‌ - కిడ్నీ సమస్యలు, ఉపిరితిత్తుల క్యాన్సర్‌.. చికిత్సలలో ఉపయోగించే ఔషధాల తయారీలో అగర్ వుడ్ నూనెను విరివిగా వాడతారు

అరబ్ దేశాల అత్తరు, దూఫం

[మార్చు]

అరబ్‌ దేశాల్లో అగర్‌ ఉడ్‌ ఆయిల్‌కు భారీ డిమాండ్‌ ఉంది. అక్కడ లభించే అత్తర్లు దీనితోనే తయారు చేస్తారు. అగర్‌ ఉడ్‌ చెక్కను అక్కడి ధనవంతులు ఇళ్లలో పొగలా వేసుకుంటారు.

సాగు పద్దతులు

[మార్చు]
Uninfected aquilaria wood lacking the dark resin

ప్రపంచ వ్యాప్తంగా ఈ చెట్లకు భారీగా డిమాండ్‌ పెరుగుతున్నది. ఇన్నాళ్లూ ఇవి మన వాతావరణంలో పెరుగుతాయో లేదో అనే సందేహంతో రైతులు సాగుకు ముందుకు రాలేదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఎక్కడైనా, ఎవరైనా సాగు చేయవచ్చని పలువురు రైతులు నిరూపించారు. ఔత్సాహికుల ప్రయోగాలు కూడా విజయవంతం కావడంతో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు సాగుపై దృష్టి సారించారు.

అగర్‌ ఉడ్‌ చెట్లకు చల్లని వాతావరణం ఉండాలి. అప్పుడే మంచి ఉత్పత్తి వస్తుంది. అయితే మన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ. ఇందుకు పరిష్కారంగా.. ఇతర మొక్కలతో కలిపి సాగు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా పళ్ల తోటలతో పాటు ముఖ్యంగా శ్రీగంధం, మలబార్‌ నీమ్‌ వంటి ఎక్కువ ఎత్తు పెరిగే చెట్ల మధ్య సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తద్వారా ఆ మొక్కలు అగర్‌ ఉడ్‌ చెట్లకు తీవ్రమైన ఎండ, వేడి తాకకుండా చూస్తాయి. సంప్రదాయ వ్యవసాయం చేసే భూముల్లో కాకుండా వృథా నేలల్లో సాగు చేస్తే, రైతుకు రెండు విధాలా లాభం.

మిగతా పంటలతో పోల్చితే అగర్‌ ఉడ్‌ సాగుకు అయ్యే ఖర్చు చాలా తక్కువని చెప్పాలి. 8 నుంచి 10 ఏండ్లలో ఎకరా సాగుకు సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఖర్చవుతుంది. అది కూడా ఒకేసారి కాదు. దశల వారీగా పెట్టాల్సి ఉంటుంది. దీంతో రైతుపై పెట్టుబడి భారం ఉండదు. ఇక ఒక ఎకరంలో సుమారు వెయ్యి చెట్లు పెట్టారనుకుంటే, ఒక్కో చెట్టుకు రూ. 5 వేల నుంచి రూ.7వేలు ఖర్చు అవుతుంది. మొక్కల కొనుగోలు మొదలు దుక్కి దున్నడం, డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు, ఫెన్సింగ్‌, మధ్యలో చెట్టుకు ఎక్కించే బ్యాక్టీరియా ఖర్చు.. ఇలా చెట్టు కొట్టే వరకు ప్రతి సమయంలో అయ్యే మొత్తం ఖర్చు ఇందులోనే ఉంటుంది.

ఇనాక్యులేషన్ తో త్వరగా రెసిన్ ఉత్పత్తి

[మార్చు]

అగర్‌ ఉడ్‌ చెట్టులో సహజసిద్ధంగా రెసీన్‌ ఉత్పత్తికి 20 నుంచి 30 సంవత్సరాల సమయం పడుతుంది. దీంతో గతంలో ఈ చెట్ల సాగు అత్యంత కష్టంగా ఉండేది. కొంతమంది కొండ ప్రాంతాల్లో వీటిని సాగు చేసేవారు. అయితే కృత్రిమ పద్ధతిలో తక్కువ సమయంలోనే ఎక్కువ రెసీన్‌ను ఉత్పత్తి చేసేందుకు పలువురు శాస్త్రవేత్తలు కృషి చేశారు. ప్రయోగం ఫలించి రెసీన్‌ ఉత్పత్తి కాలాన్ని ఆరేడు సంవత్సరాలకు తగ్గించారు. ఇందుకు పారాసిటికా అనే బ్యాక్టీరియాను సృష్టించారు. ప్రత్యేక పద్ధతిలో ఈ బ్యాక్టీరియాను చెట్టుకు ఎక్కిస్తారు. ఈ విధానాన్నే ‘ఇనాక్యులేషన్‌' అంటారు.

ఎటువంటి వాతావరణం సాగుకు అనుకూలం

[మార్చు]

సాధారణంగా అగర్‌ ఉడ్‌ చెట్ల సాగు అనగానే, ఎవరికైనా వచ్చే సందేహం.. వాతావరణం. భారత్‌లాంటి అధిక ఉష్ణోగ్రత, ఓ మోస్తారు వర్షపాతం గల వాతావరణంలో పెరుగుతాయా లేదా అనేది మదిలో మెదిలే తొలి ప్రశ్న. వాస్తవానికి ఈ చెట్లు ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఆగ్నేయాసియాలో ఎక్కువగా పెరుగుతాయి. మన దేశం విషయానికొస్తే, ఈశాన్య రాష్ర్టాలైన అసోం, త్రిపురలలో సాగు భారీగా ఉంది. క్రమంగా కేరళ, కర్ణాటక, రాజస్థాన్‌, గుజరాత్‌లకూ పాకింది. సాధారణంగా ఈ చెట్లు పెరిగేందుకు 20 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. కానీ సాగులో ప్రత్యేక పద్ధతులను పాటిస్తే 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నా, అగర్‌ ఉడ్‌ చెట్ల సాగుకు ఇబ్బంది ఉండదని పలువురు రైతులు తెలిపారు. ఇందుకు ఉదాహరణ తెలంగాణే. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో పలువురు విజయవంతంగా సాగు చేస్తున్నారు.

నేల రకం ఎలా వుండాలి?

[మార్చు]

అగర్‌ ఉడ్‌ చెట్ల సాగుకు ఎర్ర నేలలు అనుకూలమైనవి. ఆ తర్వాత బంకమట్టి నేలలు, ఎరుపు-నలుపు కలిసిన నేలలు కూడా అనుకూలమే. ఒక విధంగా చెప్పాలంటే, నీరు నిల్వ ఉండే చౌడు నేలలు, చండ్రు నేలలు మినహా అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. నల్గొండ జిల్లాలో రైతులు నల్లరేగడి నేలల్లో సాగు చేయడం గమనార్హం.

పెంపకం

[మార్చు]

ఎకరా విస్తీర్ణంలో ఎనిమిది వందల వరకూ అగర్ ఉడ్ మొక్కలను పెంచవచ్చు. అగర్ ఉడ్ పెంపకానికి రసాయనిక ఎరువుల వాడకం కంటే సేంద్రీయ ఎరువుల వాడకం అనుకూలం. మూడేళ్ళ వరకూ తుంపరసేద్యం పద్దతిలో నీరు అందించాలి. ఐదేళ్ళ వరకూ అంతరపంటలు పండించుకోవచ్చు. మొక్కకు పదేళ్ల వయసు వచ్చాక బెరడుకు రంధ్రాలు పెడతారు ఈ పద్దతిని ఇనాక్యులేషన్ అంటారు దీనివల్ల కాండం మందంగా పెరగటం తో పాటు రెసిన్ ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మొక్క చివుర్లు కత్తిరించాలి దానివల్ల మరింత ఎత్తుగా ఎదగకుండా కాండం ముదురుతుంది. ఒక్కొక్క చెట్టునుంచి ఐదు నుంచి పది కిలోల బెరడు ఉత్పత్తి అవుతుంది.

మొక్కలు ఎక్కడ తెచ్చుకోవాలి

[మార్చు]

అగర్‌ ఉడ్‌ చెట్ల సాగులో మొక్కల కొనుగోలు దశలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మొక్కలు ప్రధానంగా అసోం, కేరళ, కర్ణాటకలలో లభిస్తాయి. అక్కడి నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే, కొందరు అక్కడి నుంచి తీసుకొచ్చి, స్థానికంగా విక్రయిస్తున్నారు. ఒక్కో మొక్క ఖరీదు రూ. 25 నుంచి రూ. 80 వరకు ఉంటుంది. నాటే సమయానికి మొక్క కనీసం మూడు అడుగుల పొడవు ఉండాలి. అప్పటికే ఆ మొక్క వయసు ఏడాది నుంచి రెండు సంవత్సరాల మధ్య ఉంటుంది. పెద్ద మొక్కల్ని నాటడం వల్ల నేలల్లో అవి బలంగా ఊనుకునే అవకాశం ఉంటుంది. ఇక విత్తనాల గురించి కూడా తెలుసుకోవాలి. తక్కువ వయసు చెట్ల నుంచి విత్తనాలను సేకరించడం మంచిది కాదు. వీటి ద్వారా వచ్చిన మొక్కల నాణ్యత నాసిరకంగా ఉం టుంది. అలాంటి చెట్లు మధ్యలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనీసం 20 ఏండ్లకు పైబడిన చెట్ల నుంచి తీసిన విత్తనాల మొక్కల్ని మాత్రమే ఎంచుకోవాలి.

మార్కెటింగ్ అవకాశాలు

[మార్చు]

అగర్‌ వుడ్‌ మార్కెటింగ్‌ కూడా సులువే. చెట్టు చేతికొచ్చినట్టు తెలిస్తే, స్వంత రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులూ కొనుగోలుకు ముందుకొస్తారు. కొంత మంది నేరుగా చెట్లనే కొనుగోలు చేస్తారు. మరికొంత మంది వ్యాపారులు చెట్టు నుంచి వేరు చేసిన రెసీన్‌ను మాత్రమే కొనుగోలు చేస్తారు. రైతే రెసీన్‌ను వేరు చేసి విక్రయిస్తే ఎక్కువ ధర పలుకుతుంది. నేరుగా చెట్టును విక్రయిస్తే ధర కొంత తక్కువే పలుకుతుంది.

అగర్‌ ఉడ్‌ రైతుకు కాసులు పంట పండిస్తుంది. 8 నుంచి 10 ఏండ్లు ఓపిక పడితే, ఎకరాకు రూ. 5-7 కోట్ల ఆదాయం కళ్లజూడవచ్చు. ఒక్క చెట్టు నుంచి మంచి రెసీన్‌ ఉత్పత్తికి 8 నుంచి 10 ఏండ్ల సమయం పడుతుంది. ఒక్కో చెట్టుకు దాని వయసును బట్టి కనీసం 3-5 కేజీల రెసీన్‌ ఉత్పత్తి అవుతుంది. మన దేశంలో ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం, ఒక కేజీ ధర కనీసం రూ. 20 వేలు. నాణ్యతను బట్టి ధర పెరుగుతుంది. ఒక ఎకరంలో వెయ్యి చెట్లు సాగు చేశారనుకుంటే ఒక్కో చెట్టు నుంచి కనీసం మూడు కేజీల రెసీన్‌ ఉత్పత్తి అయినా.. చెట్టుకు రూ. 60 వేల ఆదాయం వస్తుంది. అంటే వెయ్యి చెట్లకు రూ.6 కోట్లు! తక్కువలో తక్కువ రూ. 4 కోట్ల ఆదాయం ఎక్కడికీ పోదని ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు తెలిపారు. పదేండ్లలో రూ. కోటి ఆదాయం వచ్చినా ఏడాదికి రూ. 10 లక్షలు సమకూరినట్టే. ఏ సాధారణ పంటతోనూ రైతులు ఇంత ఆదాయం పొందలేరని నిపుణులు చెబుతున్నారు.

డెసిషన్‌ మార్కెట్‌ రిపోర్ట్స్‌' అనే సంస్థ అగర్‌ వుడ్‌ అమ్మకాలు, ఆదాయానికి సంబంధించి భవిష్యత్తును అంచనా వేసింది. దీని ప్రకారం 2025 వరకు వీటి డిమాండ్ పెరుగుతూనే వుంటుంది అని అంచనా వేస్తున్నారు.

తయారీ

[మార్చు]
అగర్ వుడ్ నుంచి నూనెలు తీసే పద్దతి

అక్విలేరియా జాతిలో పదిహేడు జాతులు ఉన్నాయి, ఆగ్నేయాసియాకు చెందిన పెద్ద సతతహరితాలు,, తొమ్మిది అగర్ కలపను ఉత్పత్తి చేస్తాయి. సిద్ధాంతంలో అగర్వుడ్ అన్ని సభ్యుల నుండి ఉత్పత్తి చేయవచ్చు; ఏదేమైనా, ఇటీవల వరకు ఇది ప్రధానంగా A. మలాసెన్సిస్ నుండి ఉత్పత్తి చేయబడింది. ఎ. అగాలోచా, ఎ. సెకండరియా ఎ. మలాసెన్సిస్‌కు పర్యాయపదాలు. ఎ. క్రాస్నా, ఎ. సినెన్సిస్ సాధారణంగా పండించిన ఇతర రెండు సభ్యులు. గైరినోప్స్ చెట్టు కూడా అగర్వుడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.


అగర్వుడ్ ముఖ్యమైన నూనెలను తీయడానికి ఉపయోగించే ఆవిరి స్వేదనం ప్రక్రియ చెట్లు, జిడ్డుగల రెసిన్, అంబ్రోసియా బీటిల్ (డైనోప్లాటిపస్ చేవ్రొలాటి) ను తినే పురుగుల ద్వారా చొచ్చుకుపోయిన చెట్ల ట్రంక్, మూలాలలో అగర్ కలప నిర్మాణం జరుగుతుంది. అప్పుడు ఒక అచ్చు సంక్రమణ సంభవించవచ్చు,, ప్రతిస్పందనగా, చెట్టు నష్టాలను లేదా అంటువ్యాధులను దాచడానికి ఒక ఆత్మరక్షణ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. చెట్టు యొక్క ప్రభావితం కాని కలప సాపేక్షంగా తేలికపాటి రంగులో ఉన్నప్పటికీ, రెసిన్ నాటకీయంగా ప్రభావిత కలప యొక్క ద్రవ్యరాశి, సాంద్రతను పెంచుతుంది, దాని రంగును లేత లేత గోధుమరంగు నుండి పసుపు, నారింజ, ఎరుపు, ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారుస్తుంది. సహజ అడవులలో, ఒకే జాతికి చెందిన 100 అక్విలేరియా చెట్లలో 7 మాత్రమే సోకినవి, కలబంద / అగర్ కలపను ఉత్పత్తి చేస్తాయి. కృత్రిమ అటవీప్రాంతంలో ఒక సాధారణ పద్ధతి ఫంగస్‌తో చెట్లను టీకాలు వేయడం. ఇది "డ్యామేజ్ సాప్" ను ఉత్పత్తి చేస్తుంది, దీనిని "నకిలీ" కలబంద / అగర్ కలపగా సూచిస్తారు.

ఔద్ నూనెను ఆవిరి ఉపయోగించి అగర్ కలప నుండి స్వేదనం చేయవచ్చు; 70 కిలోల కలపకు నూనె మొత్తం దిగుబడి 20 మి.లీ మించదు

ఇతర భాషల్లో అగర్ ఉడ్

[మార్చు]
Aquilaria tree showing darker agarwood. Poachers had scraped off the bark to allow the tree to become infected by the ascomycetous mould.

ఈ అగర్ ఉడ్ మొక్క ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాలలో లాభదాయకంగా సాగుచేయబడుతూ వుండటంతో దీన్ని ఆయాప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు. ఈ వివరాలు చూడండి

  • Another name is Lignum aloes or Aloeswood, unrelated to the familiar genus, Aloe. Also from aghil, via Hebrew and Greek.[4]
  • In Assamese it is called as "xasi" (সাঁচি).[5]
  • In Bengali, agarwood is known as "agor/agoro gach (আগর গাছ)" and the agarwood oil as "agor/agoro attor (আগর আতর)". In Sylheti, it is called "agôr gaas (ꠀꠉꠑ ꠊꠣꠍ)" and agarwood incense is known as "agôrbattí (ꠀꠉꠑ꠆ꠛꠣꠕ꠆ꠕꠤ)."
  • In Cambodia, it is called "chann crassna". The fragrance from this wood is called "khloem chann" (ខ្លឹមចាន់) or "khloem chann crassna". "khloem" is hard wood, "chann crassna" is the tree species Aquilaria crassna in the Khmer language.
  • In Hindi, it is known as agar, which is derived originally from the Sanskrit aguru.[6][7]
  • In Sinhala Agarwood producing Gyrinops walla tree is known as "Walla Patta" (වල්ල පට්ට).
  • In Tamil it is called "akil" (அகில்) though what was referred in ancient Tamil literature could well be Excoecaria agallocha.
  • In Telugu and Kannada, it is known by the same Sanskrit name as Aguru.
  • It is known as Chénxiāng (沉香) in Chinese, Chimhyang (침향) in Korean and Jinkō (沈香) in Japanese; all meaning "deep scent" and alluding to its intense scent. In Japan, there are several grades of Jinkō, the highest of which is known as Kyara (伽羅).[8]
  • In Tibetan it is known as ཨ་ག་རུ་ (a-ga-ru). There are several varieties used in Tibetan Medicine: unique eaglewood: ཨར་བ་ཞིག་ (ar-ba-zhig); yellow eaglewood: ཨ་ག་རུ་སེར་པོ་ (a-ga-ru ser-po), white eaglewood: ཨར་སྐྱ་ (ar-skya), and black eaglewood: ཨར་ནག་(ar-nag).[9][10]
  • Both agarwood and its resin distillate/extracts are known as oud (عود) in Arabic (literally "rod/stick") and used to describe agarwood in Arab countries.[11] Western perfumers also often use agarwood essential oil under the name "oud" or "oudh".[12]
  • In Europe it was referred to as Lignum aquila (eagle-wood) or Agilawood, from similarity to Tamil-Malayalam aghil, deriving from Sanskrit agaru.[4]
  • In Indonesian and Malay, it is called "gaharu".
  • In Papua New Guinea it is called "ghara" or eagle wood.[ఆధారం చూపాలి]
  • In Thai it is known as mai kritsana (ไม้กฤษณา).[13]
  • In Laos it is known as mai ketsana (ໄມ້ເກດສະໜາ).[14]
  • In Myanmar (Burmese) it is known as "Thit Mhwae".
  • In Vietnamese, it is known as trầm hương.[15] In Vietnam, ancient texts also refer to the use of agarwood in relation to travelling Buddhist monks.[16]

మూలాలు

[మార్చు]
  1. "రాష్ట్రంలో తొలిసారి 'అగార్‌ ఉడ్‌' మొక్కల పెంపకం". www.eenadu.net. Archived from the original on 25 జూలై 2020. Retrieved 25 July 2020.
  2. "డబ్బు అగర్‌ ఉడ్‌ చెట్లకు కాస్తుంది!". ntnews. 11 June 2020. Archived from the original on 25 జూలై 2020. Retrieved 25 July 2020.
  3. "వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో రాబడి.. పని తక్కువ.. ఆదాయం ఎక్కువ." ntnews. 13 July 2020. Archived from the original on 25 జూలై 2020. Retrieved 25 July 2020.
  4. 4.0 4.1 Palmer, A. Smythe (1882) Folk Etymology
  5. Panda, H. (1 January 2009). Aromatic Plants Cultivation, Processing And Uses. National Institute of Industrial Re. p. 182. ISBN 978-81-7833-057-0.
  6. Pusey, Edward Bouverie (1885) Daniel the Prophet: Nine Lectures, Delivered in the Divinity School of the University of Oxford Funk & Wagnalls, New York, p. 515, OCLC 5577227
  7. "Aguru" Archived 7 జూన్ 2010 at the Wayback Machine in Sanskrit Dictionary from Bhaktivedanta VedaBase Network
  8. Morita, Kiyoko (1999). The Book of Incense: Enjoying the Traditional Art of Japanese Scents. Kodansha USA. ISBN 978-4770023896.
  9. Parfionovitch, Yuri; Dorje, Gyurme and Meyer, Fernand (1992) Tibetan medical paintings: illustrations to the Blue beryl treatise of Sangye Gyamtso (1653–1705) (English edition of Tibetan text & paintings) (2 volumes) Serindia, London, ISBN 0-906026-26-1
  10. Aromatics, an encyclopedia. 2010. Please note: due to the method of assigning names to medicinal botanicals used in Tibet, it must be considered that woods with similar medicinal properties are named as varieties of the same medicine, and not according to anything akin to the nomenclature of Western botany. Tibetan botanical taxonomy is still in the earliest stage: "white aloeswood" actually refers to the non-aromatic portions of the Indian sandalwood tree; "yellow aloeswood" refers to the scented heartwood of Santalum album. Unique aloeswood is the highest grade of Aquilaria agallocha resin, known in English as Agallochum, while "black aloeswood" is the resin infused wood of the same tree; "brown aloeswood" is the scented wood of several Dalbergia species from India and Bhutan.{{cite book}}: CS1 maint: postscript (link)
  11. Burfield, Tony (2005) "Agarwood Trading" Archived 1 ఏప్రిల్ 2010 at the Wayback Machine The Cropwatch Files, Cropwatch
  12. Branch, Nathan (30 May 2009) "Dawn Spencer Hurwitz Oude Arabique (extrait)" Archived 6 సెప్టెంబరు 2012 at Archive.today (fashion and fragrance reviews)
  13. "สำนักคุ้มครองภูมิปัญญาฯ" Archived 25 ఆగస్టు 2011 at the Wayback Machine, page 1 (๑), in Thai
  14. Hkum, Seng Hkum N and Maodee, M. (July 2005) "Marketing and Domestication of NTFPs in North Phonsali Three Districts" Archived 2016-10-21 at the Wayback Machine NPADP Presentation, NTFP MIS Workshop Luangprabang, North Phongsali Alternative Development Project, United Nations Office on Drugs and Crime
  15. Thứ Hai (9 April 2006) "kỳ nam và trầm hương" Tuổi Trẻ Online Archived 2009-02-15 at the Wayback Machine. Tuoitre.com.vn. Retrieved on 22 July 2013.
  16. Persoon, G.A. "Agarwood: the life of a wounded tree". IIAS Newsletter. 45 (2007). IIAS, Leiden: 24-25.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అగార్_ఉడ్&oldid=4231390" నుండి వెలికితీశారు