Jump to content

అగ్ని శ్వాస

వికీపీడియా నుండి
Dragon's breath (sustained vertical breath without a torch in front of the flame)

శ్వాసతో అగ్ని గోళాన్ని సృష్టించడాన్ని అగ్ని శ్వాస అంటారు.

ఎలా చేస్తారు ?

[మార్చు]

నోటిలో కొంత ఇంధనాన్ని ఉంచుకొని ఆ నోటిలోని ఇంధనాన్ని శ్వాస ద్వారా వెలుపలికి వెదజిమ్మడం ద్వారా వెలువడిన ఇంధనపు తుంపర వెలుపల ఉన్న మంటను తగిలినప్పుడు, ఆ ఇంధనం మండుట ద్వారా అగ్నికీలలు ఏర్పడతాయి. సరైన సాంకేతిక, సరైన ఇంధనాన్ని ఉపయోగించి సాహాసోపేతమైన నిపుణులు అగ్ని శ్వాస ద్వారా సృష్టించే అగ్ని కీలలు ప్రేక్షకులకు అపాయం జరుగబోతున్నదేమోనని భ్రమ కలిగిస్తాయి. సాహాసోపేతమైన ఈ విన్యాసాలు ప్రేక్షకులలో ఆత్రుత ను, అశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంధనం దహనమయ్యేందుకు కావలసిన ప్రాణవాయువు, ఉష్ణం సంతులితంగా ఉన్నప్పుడే అగ్నిశ్వాసతో అగ్నిగోళాలు సృష్టించడానికి అనువుగా ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు

[మార్చు]
  • సరైన ఇంధనాన్ని వాడనప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
  • ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే మరణం
  • తీవ్రమైన కాలిన గాయాలు
  • దంత సమస్యలు
  • ఇంధన విషం
  • తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు
  • పొడి దగ్గు
  • తలనొప్పి, చికాకు, మత్తు
  • వికారం, విరేచనాలు, వాంతులు, కడుపులో నొప్పి
  • నోరు పొడిబారడం
  • పెట్రోకెమికల్ ప్రభావం వలన నోరు లేదా గొంతు క్యాన్సర్

చిత్రమాలిక

[మార్చు]

సూచికలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]