అఘోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక అఘోరీ

అఘోరా శైవ సాధువులలో ఒక రకమైన సన్యాసులు. అఘోరాల జీవనసరళి, ఆచార వ్యవహారాలు మిక్కిలి భయానకంగా ఉంటాయి.

సభ్యసమాజానికి దూరంగా ఉండటం వలన, సన్యాసం వలన, వీరు చేసే తపస్సుల వలన రోగాలను నయం చేసే మంత్రశక్తులు ఉన్నాయనే నమ్మకం గ్రామీణ ప్రజలలో ఉంది.

జీవన శైలి/ఆచార వ్యవహారాలు/సాంప్రదాయాలు[మార్చు]

  • శ్మశానాలలో జీవించటం
  • పాడుబడ్డ భవనాలలో జీవించటం, పూజలు, ప్రాణాయమాలు, తపస్సులు అందులోనే నిర్వహించటం
  • కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి, ఒళ్ళంతా రాసుకోవటం
  • పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించటం, అదే పుర్రెలో (కుక్క వంటి) జంతువులకు కూడా ఆహారదానం చేయటం
  • పొడవాటి ఎముకలను దండంగా వినియోగించటం
  • మానవ కళేబరాలను ఆహారంగా భుజించటం
  • శవాలతో సంభోగించటం

- వంటి విపరీత చర్యలు వీరి సంప్రదాయాలలో భాగాలు. శివుడు, పలు ఇతర దేవతలు పుర్రె, ఎముకలను ధరించినట్లు వీరు కూడా ధరిస్తారు. వీరి విపరీతమైన పోకడల వలన సామాన్య హిందువులు వీరిని వ్యతిరేకిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=అఘోరా&oldid=4010594" నుండి వెలికితీశారు