ఆఫ్రికా రాక్షస నత్త
Appearance
(అచాటినా అచాటినా నుండి దారిమార్పు చెందింది)
ఆఫ్రికా రాక్షస నత్త | |
---|---|
A shell of Achatina achatina | |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | |
(unranked): | clade Heterobranchia
clade Euthyneura clade Panpulmonata clade Eupulmonata clade Stylommatophora informal group Sigmurethra |
Superfamily: | |
Family: | |
Subfamily: | |
Genus: | |
Species: | A. achatina
|
Binomial name | |
Achatina achatina (Linnaeus, 1758)
|
అచాటినా అచాటినా లేదా ఆఫ్రికా నత్త ఒక రకమైన భారీ నత్త. ఇవి పంటలపై దాడిచేసి తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి.
వివరాలు
[మార్చు]- దీన్ని 'జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్' అంటారు. నిజానికి ఇవి ఎక్కడో మధ్య ఆఫ్రికాకు చెందినవి. కానీ ఇప్పుడు దేశదేశాలకు ఇవి ఎలాగో చేరిపోయాయి. ఆయా దేశాలకే ఇవి తలనొప్పిగా మారిపోయాయి. ఇప్పటికే చైనా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో, ఇంకా భూటాన్ లాంటి ఎన్నో దేశాలకు వ్యాపించి, పెద్ద మొత్తంలో పంట నష్టం చేశాయి. ఐరాస కూడా ఈ నత్తను పంటలకు అత్యంత ప్రమాదకారిగా ప్రకటించింది. ఇప్పుడు కేరళకు వచ్చి తమ దాడి మొదలెట్టాయి.
- ఇవి 8 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. జీవితకాలం 5 నుంచి 7 ఏళ్లు. నెలల తరబడి హైబర్‌నేషన్ (దీర్ఘనిద్ర) లో ఉండి వర్షాకాలంలో ఇవి బయటకు వస్తాయి. పైగా రాత్రిళ్లు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుండేసరికి వీటిని తరిమికొట్టడం చాలా కష్టమౌతోంది. ఈ నత్త 'హెర్మాఫ్రోడైట్'. అంటే ఒకే జీవిలో ఆడ, మగ రెండు లక్షణాలు ఉంటాయి. అలా వీటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది.
- ఇవి దాదాపు 500 వృక్షజాతులపై దాడి చేస్తాయి. కొబ్బరి, కాఫీ, రబ్బరు చెట్లు ఇలా దేన్నీ వదలవు. అందుకే ఈ పంటలు ఎక్కువగా పండే కేరళపై నత్తలు విరుచుకుపడుతున్నాయి. గత అయిదారేళ్ల నుంచి వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
- మొక్కల్ని తినడమే కాదు, తమ గుల్లను బలంగా చేసుకోవడానికి ఇసుక, ఎముకలు, చివరికి సిమెంటు గోడలను కూడా తినేస్తాయి.
భారతదేశంలో వీటి ప్రవేశము
[మార్చు]- కేరళ లో ఎన్నో పంటలపై నత్తలు దాడి చేస్తూ పెద్ద మొత్తంలో నష్టం కలిగిస్తున్నాయి. వీటి ఆక్రమణను ఎలా అడ్డుకోవాలో తెలీక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వమైతే వీటి ఏరివేత కోసం కోటానుకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ నత్తపై యుద్ధమే ప్రకటించింది.[1]
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Achatina achatinaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.