అచ్చ తెలుగు కావ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు భాషలో పదాలను నాలుగు తెఱగులుగా(రకం) విడదీయబడినవి  :

  1. తత్సమము సంస్కృత పలుకులను ( పదాలను ) తెలుగులోకి విభక్తి ప్రత్యయమును చేర్చి ఏర్పరిచిన పలుకులను తత్సమ పదాలు అని అంటారు. మచ్చుక(ఉదాహరణ) : రాముడు, శివుడు, దేవుడు, దేశము, భాష, జయము, వర్ణము, ఆకాశము, దుఃఖం, భాష, శాంతి, ధర్మం మొ II
  2. తద్భవము సంస్కృత, ప్రాకృత పలుకులను నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పలుకులను తద్భవములు అంటారు. మచ్చుక(ఉదాహరణ) : కనీసం, రకం, వన్నె , విద్దె, బోనం, రాతిరి, పొత్తము, బాస మొ II
  3. ఆణీయం : ఇవి తెలుగులో మొదటినుండి వాడుకలో ఉన్న పలుకులు, ఇవి నిక్కమైన తెలుఁగు పలుకులు, ఇవి లేకుండా నుడి ని మాట్లాడరాదు. మచ్చుక(ఉదాహరణ) : తల్లి , తండ్రి, అన్న, అక్క , చెల్లెలు , తమ్ముడు, ఒళ్ళు, వేల్పు, నాడు, చేయి, కాలు, కన్ను, తలా , ముక్కు, వ్రేళ్ళు మొ II
  4. అన్యదేశ్యము : సంస్కృత, ప్రాకృతను మినహాయించి వేరే నుడులకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు.

మచ్చుక(ఉదాహరణ) : స్టేషను, రోడ్డు మొ II


అచ్చ తెలుగు అనగా వడారం (కేవలం) ఆణియ పదాలనే వాడుట.  

ఇది చాల అక్కరము(అవసరము), ఈ తెల్గును వాడని యడల మన నుడి (భాష) చనిపోవును.


అచ్చ తెలుగు  : అందరికి మేలువిచ్చేయిక! తామెల్లరు మేలుఁకి యున్నారని కోరుకుంటున్నాను! మీ యొక్క తల్లిదండ్రులకు నా కైమోడ్పులు! మీరందరు కూర్మి తోడై ససీగా బ్రదుకుతున్నారని కోరుకుంటున్నాను! మీ చదువులు చక్కగా కొనసాగాలని కోరుకుంటున్నాను!

సెలవు!


తత్సమ తెలుఁగు : అందరికి స్వాగతం, మీరందరు కుశలం అని ఆశిస్తున్నాను! మీ మాత-పితృలకు నా ప్రణామములు! మీరు ప్రేమతో, ఆరోగ్యంతో జీవిస్తున్నారని ఆశిస్తున్నాను! మీ విద్య చక్కగా  కొనసాగాలని ఆశిస్తున్నాను!

ధన్యవాదం!


బయటి లంకెలు[మార్చు]