అజంతా ఎక్స్‌ప్రెస్
అజంత ఎక్స్ ప్రెస్ సికింద్రాబాదు-మన్మాడ్ పట్టణాల నడుమ నడిచే భారతీయ రైల్వేలకు చెందిన ఒక రైలు. షిరిడి వెళ్ళే శ్రీ సాయి బాబా భక్తులకు ఎంతో ప్రయోజనకరముగ ఉంటుంది.ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాదు మండలం వారిచే నడుపబడుచున్నది.
చరిత్ర
[మార్చు]తెలంగాణ, మరాఠ్వాడ ప్రాంతాల మధ్య నడిచే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైలు అజంత ఎక్స్ ప్రెస్ . 1967, ఏప్రియల్ 1-వ తేదీ, శనివారము నాడు ఈ రైలు కాచిగూడ-మన్మాడ్ మధ్య మీటర్ గేజ్ పై ప్రవేశపెట్టబడింది. మన్మాడ్-పర్భణి మధ్య రైల్వే లైను మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కు మార్చబడ్డప్పుడు, ముద్ఖేడ్-సికింద్రాబాద్ లైను ఇంకను మీటర్ గేజ్ పైనే ఉండెను. అప్పుడు ఈ రైలు వికారాబాద్-బీదర్-పరళి వైద్యనాథ్-పర్భణి మీదుగా మళ్లింపబడెను. 2007 లో ముద్ఖేడ్-సికింద్రాబాద్ పూర్తిగా బ్రాడ్ గేజ్ గా మార్చబడిన పిమ్మట ఈ రైలు మఱల నిజామాబాద్-బాసర-ముద్ఖేడ్-నాందేడ్-పర్భణి మీదుగా మళ్లింపబడింది. ప్రవేశపెట్టబడ్డప్పుడు ఈ రైలు దేశంలో అత్యంత వేగంగా నడిచే మీటరు గేజ్ రైలుగా ప్రఖ్యాతి గాంచింది.
కాలపట్టిక
[మార్చు]17063 మన్మాడ్-సికింద్రాబాద్ అజంతా ఎక్స్ ప్రెస్ | కాలపట్టిక | 17064 సికింద్రాబాద్-మన్మాడ్ అజంతా ఎక్స్ ప్రెస్ | ||||
వచ్చు సమయం | పోవు సమయం | స్టేషను పేరు | స్టేషను కోడ్ | దూరం (కి.మీ) | వచ్చు సమయం | పోవు సమయం |
---|---|---|---|---|---|---|
--:-- | 20:50 | మన్మాడ్ జంక్షన్ | MMR | 0 | 06:55 | --:-- |
21:15 | 21:20 | నాగర్ సోల్ | NSL | 22.7 | 05:40 | 05:45 |
21:39 | 21:40 | రోటేగావ్ | RGO | 50.8 | 04:44 | 04:45 |
21:59 | 22:00 | లాసూర్ | LSR | 78 | 04:14 | 04:15 |
22:40 | 22:45 | ఔరంగాబాద్ | AWB | 111.6 | 03:45 | 03:50 |
23:45 | 23:47 | జాల్నా | J | 174.5 | 02:35 | 02:37 |
00:24 | 00:25 | పార్టూర్ | PTU | 219.1 | 01:52 | 01:53 |
00:44 | 00:45 | సేలు | SELU | 246.4 | 01:26 | 01:27 |
00:59 | 01:00 | మన్వత్ రోడ్ | MVO | 261.3 | 01:11 | 01:12 |
01:48 | 01:50 | పర్భాణి జంక్షన్ | PBN | 288.9 | 00:38 | 00:40 |
02:25 | 02:30 | పూర్ణ జంక్షన్ | PAU | 317.3 | 00:10 | 00:12 |
03:05 | 03:10 | హజూర్ సాహిబ్ నాందేడ్ | NED | 347.7 | 23:35 | 23:40 |
03:53 | 03:55 | ముద్ఖేడ్ జంక్షన్ | MUE | 370.1 | 22:48 | 22:50 |
04:18 | 04:19 | ఉమ్రి | UMRI | 389.8 | 22:19 | 22:20 |
04:33 | 04:35 | ధర్మాబాద్ | DAB | 419.3 | 21:47 | 21:48 |
04:50 | 04:52 | బాసర | BSX | 429.1 | 21:35 | 21:37 |
05:25 | 05:30 | నిజామాబాద్ జంక్షన్ | NZB | 458.4 | 21:00 | 21:05 |
06:15 | 06:17 | కామారెడ్డి | KMC | 510.4 | 19:59 | 20:00 |
--:-- | --:-- | వడియారం | WDR | 553.4 | 19:16 | 19:17 |
07:30 | 07:31 | మేడ్చల్ | MED | 591.6 | 18:44 | 18:45 |
07:53 | 07:54 | బొల్లారం | BMO | 605.5 | 18:30 | 18:31 |
08:29 | 08:30 | మల్కజ్ గిరి జంక్షన్ | MJF | 615.6 | 18:18 | 18:19 |
08:50 | --:-- | సికింద్రాబాద్ జంక్షన్ | SC | 619.2 | --:-- | 18:10 |
బండి సంఖ్య
[మార్చు]17064 సికింద్రాబాద్ జంక్షన్ -> మన్మాడ్ జంక్షన్
17063 మన్మాడ్ జంక్షన్ -> సికింద్రాబాద్ జంక్షన్
పెట్టెల వివరములు
[మార్చు]శీతలీకరింపబడిన రెండవ తరగతి పెట్టె -1
శీతలీకరింపబడిన మూడవ తరగతి పెట్టె -2
పడక వసతి కలిగిన రెండవ తరగతి పెట్టెలు -15
కూర్చొను వసతి కలిగిన రెండవ తరగతి పెట్టెలు -3
కూర్చొను మఱియు సామాగ్రి పెట్ట్టుకొను పెట్టెలు- 2