Jump to content

అడవి బాపిరాజు బృందావన్ లాల్ వర్మ చారిత్రిక నవలల తులనాత్మక పరిశీలన

వికీపీడియా నుండి

తెలుగు సాహిత్యరంగంలో కృషిచేసిన అడవి బాపిరాజు, హిందీ సాహిత్యంలో ప్రసిద్ధులైన బృందావన్ లాల్ వర్మ చారిత్రిక నవలా రచనలో చేసిన కృషిని తులనాత్మకంగా చేసిన అధ్యయనానికి ఈ గ్రంథరూపం సంతరించారు. కె.వి.నాగరత్నమ్మ ఈ గ్రంథాన్ని రచించారు.[1]

రచన నేపథ్యం

[మార్చు]

కె.వి.నాగరత్నమ్మ తన పీ.హెచ్‌డీ పరిశోధన కోసం బాపిరాజు, బృందావన్ లాల్ వర్మల సాహిత్యాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ఆమె పీ.హెచ్‌డీని సాధించిన అనంతరం ఈ గ్రంథాన్ని పుస్తకరూపంలో వెలువరించారు. 1993లో ఈ గ్రంథాన్ని నాగరత్నమ్మ ప్రచురించారు.

పరిశోధనాంశం

[మార్చు]

పరిశోధనలో భాగంగా తెలుగు సాహిత్యానికి చెందిన అడవి బాపిరాజు, హిందీ సాహిత్యానికి చెందిన బృందావన్ లాల్ వర్మల చారిత్రిక నవలా సాహిత్యాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేశారు. వేర్వేరు భాషల్లో చారిత్రిక రచన చేసిన వీరిద్దరూ సమకాలికులు. 1889లో బృందావన్ లాల్ వర్మ జన్మించగా 1895లో అడవి బాపిరాజు పుట్టారు. వారు రచించిన చారిత్రిక నవలలు ఇవి:

అడవి బాపిరాజు

[మార్చు]
  • గోన గన్నారెడ్డి
  • కోనంగి
  • హిమబిందు
  • అడవి శాంతిశ్రీ
  • అంశుమతి వంటి చారిత్రిక నవలలు రచించారు.

బృందావన్ లాల్ వర్మ

[మార్చు]
  • గధ్ కుందర్
  • విరాటకీ పద్మిని
  • ముసహిబ్జు
  • ఝాన్సీకీ రాణి
  • కచ్నర్
  • మదవ్‌జీ సింధియా
  • టూటే కాంటే
  • మృగనయని
  • భువన్ విక్రం
  • అహల్యాబాయి వంటి చారిత్రిక నవలలు

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. కె.వి.నాగరత్నమ్మ (1993). అడివి బాపిరాజు, బృందానన్ లాల్ వర్మగార్ల చారిత్రక నవలలు - తులనాత్మక పరిశీలన.