అడాయీ యోనత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ada E. Yonath
Prof. Ada E. Yonath during her visit to Kerala in 2013 Feb.
జననంAda Lifshitz
(1939-06-22) 1939 జూన్ 22 (వయసు 84)
Jerusalem, British Mandate of Palestine (now in Israel)
నివాసంIsrael
జాతీయతIsraeli
రంగములుCrystallography
వృత్తిసంస్థలుWeizmann Institute of Science
చదువుకున్న సంస్థలుHebrew University of Jerusalem
Weizmann Institute of Science
ప్రసిద్ధిCryo bio-crystallography
ముఖ్యమైన పురస్కారాలుHarvey Prize (2002)
Wolf Prize in Chemistry (2006)
L'Oréal-UNESCO Award for Women in Science (2008)
Albert Einstein World Award of Science (2008)
Nobel Prize in Chemistry (2009)

అడాయి యోనత్ (Hebrew: עדה יונת‎, మూస:IPA-he) (జననం 1939 జూన్ 22) [1] ఇటాలియన్ క్రిస్టలోగ్రాఫర్ అయిన ఆమె రిబోసం నిర్మాణం గురించి చేసిన పరిశోధనలతో అంతర్జాతీయంగా గుర్తించబడుతుంది. ఆమె ప్రస్తుతం " హెలెన్ అండ్ మిల్టన్ ఏ కిమ్మెల్మాన్ బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ , అసెంబ్లీ ఆఫ్ ది వైజ్మెన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్ డైరెక్టర్‌గా బాధ్యత వహిస్తుంది. 2009 లో ఆమె రసాయనశాస్త్రంలో " నోబెల్ బహుమతి " అందుకున్నది. ఆమె ఈ బహుమతిని వెంకటరామన్ రామక్రిష్ణన్, థోమస్ ఏ స్టెయిజ్ లతో కలిసి అందుకున్నది. ఆమె 10 ఇజ్రాయిల్ నోబెల్ బహుమతి గ్రహీతలలో మొదటి మహిళా నోబెల్ పురస్కార గ్రహీతగా గుర్తించబడుతుంది.[2] అలాగే మిడిల్ ఈస్ట్‌లో సైంస్‌లో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళగా కూడా గుర్తించబడుతుంది.[3] 45 సంవత్సరాలలో రసాయశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళగా కూడా గుర్తించబడింది. అయినప్పటికీ ఆమె మహిళగా నోబెల్ బహుమతి అందుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదని అభిప్రాయపడింది.[4]

జీవిత చరిత్ర[మార్చు]

యోనత్ (née Lifshitz)

[5] జెరుసలేం లోని జ్యూలా క్వార్టర్స్‌లో జన్మించింది.[6] ఆమె తల్లితండ్రులు హిల్లెట్ , లిఫ్‌షిత్జ్ జియోనిస్ట్ యూదులు. వారు పాలస్తీనా నుండి ఇజ్రాయిల్ రూపొందించక ముందు (1933) వలస వెళ్ళారు. [7] ఆమె తండ్రి రబ్బీ (మతసంబంధిత విషయాలను బోధించేవాడు). ఆయన రబ్బినికల్ కుటుంబం నుండి వచ్చాడు. వారు జెరుసలేంకు వచ్చిన తరువాత గ్రోసరీవ్యాపారం ఆరంభించారు. అయినప్పటికీ అది నిర్వహించడం కష్టమని గ్రహించారు. వారు ఇరుకైన క్వార్టర్లలో ఇతర కుటుంబాలతో కలిసి నివసించేవారు. ఆమె తన ఙాపకాలను వివరించే సమయంలో పుస్తకాలు చదవడం మాత్రమే ఆమెను చురుకుగా ఉంచేదని అభిప్రాయం వెలిబుచ్చింది.[8] ఒక వైపు పేదరికం బాధిస్తున్నప్పటికీ ఆమె తల్లితండ్రులు ఆమెను బెయిట్ హకెరం (జరుసలేం) కు పంపారు. ఆమె తండ్రి తన 42వ సంవత్సరంలో మరణించిన తరువాత వారు తమ నివాసం టెల్ అవివ్‌కు మార్చుకున్నారు.[9] తరువాత యోనత్‌కు "టిచాన్ హదాష్ హై స్కూల్" అంగీకారం లభించింది. ఆమె తల్లి ఆమె కొరకు ట్యూషన్ ఫీజు కట్టడానికి బదులుగా ఆమె విద్యార్ధులకు గణితపాఠాలు బోధించింది. [10] యువతిగా ఆమె పోలిష్ , ఫ్రెంచ్ పరిశోధకురాలు "మేరీ క్యూరీ" తనకు ప్రేరణ కలిగించిందని చెప్పింది. [11] ఆమె చిన్నవయసులో మేరీక్యూరీ చేత ప్రేరితమైనప్పటికీ ఆమె మేరీక్యూరీ జీవితచరిత్ర చదివిన తరువాత తన అభిప్రాయం మార్చుకుంది.[12] తరువాత ఆమె కాలేజి చదువు కొరకు తిరిగి జెరుసలేం చేరుకుంది. 1962 "హెబ్ర్యూ యూనివర్శిటీ ఆఫ్ జెరుసలేం" లో రసాయనశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసింది. 1964లో బయోకెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. తరువాత ఆమె "వైజ్మన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైన్సు" ఎక్స్- రే ", క్రిస్టలోగ్రాఫిక్ లలో పి.హెచ్.డి సాధించింది. ఆమెకు పి.హెచ్.డి. సలహాదారుగా వొలిఫ్ ట్రౌబ్ ఉన్నాడు. [13][14][15] ఆమెకు కుమార్తె (హజిత్ యోనత్) షెబా సెంటర్‌లో డాక్టర్‌గా ఉంది. ఆమె మనుమరాలు నోయా.[16] యాంటీ- ఆకుపేషన్ యాక్టివిస్ట్ డాక్టర్ రుచమా మార్టన్ కజిన్ సిస్టర్.[17] ఆమె హమాస్ ఖైదీల నిబంధనరహిత విడుదల కొరకు పిలుపు ఇచ్చింది.[18]

పరిశోధకురాలిగా[మార్చు]

Ada Yonath at the Weizmann Institute of Science

యోనత్ కార్నెజీ మెలాన్ యూనివర్శిటీ, ఎం.ఐ.టి. (1970) లలో పోస్ట్ డాక్టొరల్ బాధ్యత వహించింది. ఎం.ఐ.టి. (1970) లలో పోస్ట్ డాక్టొరల్ చేసే సమయంలో నోబెల్ బహుమతి గ్రహీత "విలియం లిప్స్కొంబ్" (హార్వర్డ్ యూనివర్శిటీ) ప్రయోగశాలలో కొంతకాలం పనిచేసింది.[19] 1970లో ఆమె ప్రొటీన్ క్రిస్టలోగ్రఫీ ప్రయోగశాల స్థాపించి ఒక దశాబ్ధకాలం అందులో పనిచేసింది. 1979 నుండి 1984 వరకు ఆమె మాక్స్ ప్లాంక్ ఇంస్టిట్యూట్ ఫర్ మాలిక్యూల్ జెనెటిక్స్ (బెర్లిన్) వద్ద "హెయింజ్- గుంటర్ విట్మన్" బృందంతో పనిచేసింది. 1977-1978 వరకు " యూనివర్శిటీ ఆఫ్ చికాగో "విజిటింగ్ ప్రొఫెసర్‌"గా పనిచేసింది.[20] 1986-2004 వరకు జర్మనీ లోని హబర్గ్ వద్ద ఉన్న డెసీలో ఆమె "మాక్స్- ప్లాంక్ ఇంస్టిట్యూట్"ను నిర్వహించింది. అదే సమయంలో వైజ్మన్ ఇంస్టిట్యూట్‌లో పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించింది. తరువాత యోనత్ ప్రొటీన్ బయోసింథసీస్, రిబొసొమల్ క్రిస్టలోగ్రఫీలలో మెకానిజంస్ మీద దృష్టి కేంద్రీకరించింది. ఇందులో ఆమె దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ కృషిచేసింది. [21] రిబొసంస్ ఆర్.ఎన్.ఎ.ను ప్రొటీన్‌గా మారుస్తాయి. అవి మైక్రోబ్స్ కంటే కొంచం వ్యత్యాసంగా ఉండడమే అందుకు కారణం.

అవార్డులు , గౌరవాలు[మార్చు]

Telephone interview with Ada Yonath during the announcement of the Nobel Prize

యోనత్ " యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ సైన్సు, ది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైంసెస్, ది ఇజ్రాయిల్ అకాడమీ ఆఫ్ సైంసెస్ అండ్ హ్యూమనిటీస్, ది యురేపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ లలో సభ్యత్వం కలిగి ఉంది. 2014 అక్టోబరు 14 శనివారం పోప్ ఫ్రాంసిస్ చేత యోనత్‌ పొనిటిఫికల్ అకాడమీ ఆఫ్ సైంసెస్ ఆర్డనరీ మెంబర్‌గా ప్రతిపాదించబడింది.[22]

 • అవార్డులు, గౌరవాల జాబితా:-
 • 2002, హార్వే ప్రైజ్.
 • 2004, పౌల్ కారర్ గోల్డ్ మెడల్.
 • 2006, వూల్ఫ్ ప్రైజ్ ఇన్ కెమెస్ట్రీ. (జార్జ్ పెహర్‌తో కలిసి).
 • 2006, రోత్‌చైల్డ్ ప్రైజ్ (లైఫ్ సైంసెస్).
 • 2006, ది ఇ.ఎం.ఇ.టి ప్రైజ్ ఫర్ ఆర్ట్, సైన్సు అండ్ కల్చర్ (లైఫ్ సైన్సు) (ప్రొఫెసర్ పెర్త్జ్ లావీతో; మెడిసిన్), (ప్రొఫెసర్ ఎలి కెషెట్; బయాలజీ).
 • 2007, పౌల్ ఎర్లిచ్ అండ్ ల్యూడ్వింగ్ డార్ంస్టీడ్ట్లర్ ప్రైజ్ (హర్రి నొల్లర్‌తో).
 • 2008, ది ఆల్వర్ట్ ఎయింస్టెన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైంసెస్ (ప్రొటీన్ బయోసింథసీస్ రంగంలో చేసిన కృషి కొరకు).[23]
 • 2009, ది నోబెల్ ప్రైజ్ ఇన్ కెమెస్ట్రీ (థోమస్ స్తెయిజ్‌, వెంకటరామన్ రామకృష్ణన్‌ లతో కలిసి) [24] యోనత్ నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ.[25]
 • యోనత్ " విల్హెల్ం ఎక్స్నర్ మెడల్ (2010).[26]
 • 2015 మే 27న యోనత్ " డాక్టర్ హానరీస్ కౌసా " టైటిల్ (మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ లాడ్జ్) అందుకున్నది.[27]

అదే సంవత్సరం ఆమె డీ లా సల్లే యూనివర్శిటీ ; మనీలా (ఫిలిప్పైన్), జోసెఫ్ ఫౌరొయర్ యూనివర్శిటీ; గ్రినోబుల్ (ఫ్రాన్) ది మెడికల్ యూనివర్శిటీ (పోలాండ్) , యూనివర్శిటీ ఆఫ్ వార్‌విక్ (యునైటెడ్ కింగ్డం) ల నుండి " గౌరవ డాక్టరేట్ " పొందింది.[28]

మూలాలు[మార్చు]

 1. "Israel Prize Official Site (in Hebrew) – Recipient's C.V."
 2. Lappin, Yaakov (2009-10-07). "Nobel Prize Winner 'Happy, Shocked'". Jerusalem Post. Retrieved 2009-10-07.
 3. Karin Klenke, Women in Leadership: Contextual Dynamics and Boundaries, Emerald Group Publishing, 2011, p. 191.
 4. Interview Archived 2018-06-20 at the Wayback Machine, Ada E. Yonath, The Nobel Prize in Chemistry 2009
 5. "מנכ"ל המדינה (p. 4; 18.11.09 "ידיעות אחרונות") PDF" (PDF). Archived from the original (PDF) on 2012-04-25. Retrieved 2016-03-21.
 6. "Ada Yonath— L'Oréal-UNESCO Award". Jerusalem Post. 2008-03-08. Archived from the original on 2012-01-17. Retrieved 2021-12-28.
 7. István Hargittai, Magdolna Hargittai “Candid science 6”: Interview with Ada Yonath (p. 390): In this source the surname is spelled Livshitz.
 8. Talk given at Moriah College, Sydney, 18 February 2010 as noted by a student present from James Ruse Agricultural High School
 9. "Israeli professor receives Life's Work Prize for women in science". Ministry of Foreign Affairs. 2008-07-28.
 10. [1]Archived 2012-01-17 at the Wayback Machine Former 'village fool' takes the prize, Jerusalem Post
 11. "ISRAEL21c - Uncovering Israel". Israel21c.
 12. Talk given at Moriah College, 18 February 2010
 13. "(IUCr) European Crystallography Prize". iucr.org.
 14. Traub, Wolfie; Yonath, Ada (1966). "POLYMERS OF TRIPEPTIDES AS COLLAGEN MODELS .I. X-RAY STUDIES OF POLY (L-PROLYL-GLYCYL-L-PROLINE) AND RELATED POLYTRIPEPTIDES". Journal of Molecular Biology. 16 (2): 404. doi:10.1016/S0022-2836(66)80182-1.
 15. Yonath, Ada; Traub, Wolfie (1969). "POLYMERS OF TRIPEPTIDES AS COLLAGEN MODELS .4. STRUCTURE ANALYSIS OF POLY(L-PROLYL-GLYCYL-L-PROLINE)". Journal of Molecular Biology. 43 (3): 461. doi:10.1016/0022-2836(69)90352-0.
 16. Ofri Ilani. "Israel's Prof. Ada Yonath wins Nobel Prize for Chemistry". Haaretz.com. Archived from the original on 2009-12-03. Retrieved 2016-03-21.
 17. Former 'village fool' takes the prize Archived 2012-01-17 at the Wayback Machine, Judy Siegel-Itzkovich, Jerusalem Post 8 March 2008
 18. Israeli Nobel Laureate calls for release of all Hamas prisoners Archived 2010-02-08 at the Wayback Machine, Haaretz 10 October 2009
 19. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; CEN_Nov_2009 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 20. anonymous. "New chemistry Nobelist was UChicago visiting prof, conducted research at Argonne". uchicago.edu. Archived from the original on 2010-06-10. Retrieved 2016-03-22.
 21. "The Nobel Prize in Chemistry 2009 - Speed Read". nobelprize.org.
 22. "Rinunce e nomine". vatican.va.
 23. "Albert Einstein World Award of Science 2008". Archived from the original on 2014-03-04. Retrieved 2016-03-22.
 24. "Nobel Prize in Chemistry 2009". Nobel Foundation. Archived from the original on 10 అక్టోబరు 2009. Retrieved 2009-10-07.
 25. Wills, Adam (2009-10-07). "Ada Yonath—First Israeli Woman to win Nobel Prize". Jewish Journal. Archived from the original on 2016-04-22. Retrieved 2009-10-07.
 26. Editor, ÖGV. (2015). Wilhelm Exner Medal. Austrian Trade Association. ÖGV. Austria.
 27. zk, Biuro. "Uniwersytet Medyczny w Łodzi". www.umed.pl. Archived from the original on 2016-03-04. Retrieved 2015-05-01.
 28. "Honorary Graduand Orations - Summer 2015". warwick.ac.uk. Retrieved 2023-02-20.