అడుగుజాడలు (నాటకం)
(అడుగుజాడలు నుండి దారిమార్పు చెందింది)
అడుగుజాడలు | |
కృతికర్త: | కె.ఎల్.నరసింహారావు[1] |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | |
విడుదల: |
అడుగుజాడలు నాటకాన్ని కె.ఎల్.నరసింహారావు[2][3] రచించగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదర్శనలు పొంది, పోటీల్లో బహుమతులు సాధించింది.[4]
పాత్రలు
[మార్చు]నాటకంలోని పాత్రల పేర్లూ, ప్రధాన లక్షణాలు ఇవి:
- గోపయ్య - మోతుబరి రైతు
- నరసయ్యన్న - పెద్దమనిషి
- వెంకటపతి - సహకారసంఘ కార్యదర్శి
- చంద్రం - గోపయ్య మేనల్లుడు
- దాసు - డాక్టర్, చంద్రం స్నేహితుడు
- కొమరన్న - పోస్టుమేన్
- పాపన్న - వెంకటపతి పనివాడు
- సీత - గోపయ్య కూతురు
ప్రదర్శనలు
[మార్చు]నాటకాన్ని రచయిత ప్రదర్శించేందుకు ఒక బృందానికి అనుమతి ఇచ్చాకా రాష్ట్రస్థాయి నాటకాల పోటీ గురించి ఆయనకు తెలిసింది. ఆ పోటీలో అప్పటికి ఇంకా ప్రదర్శించని నాటకాలు మాత్రమే అనుమతింపబడతాయి అన్న నియమాన్ని అనుసరించి ఆ ప్రదర్శనను వాయిదా వేయించారు. అనంతరం నవంబరు 9, 1956న అఖిల భారత సహకార సప్తాహంలో ఇండియన్ నేషనల్ థియేటర్ ఆధ్వర్యంలో నాటకాన్ని తొలిసారి ప్రదర్శించారు.[5]
ప్రాచుర్యం
[మార్చు]ఈ నాటకాన్ని రాసిన తర్వాత దేశాభివృద్ధికి ఉపకరించే నాటకాల పోటీని ఏర్పాటుచేసినప్పుడు రచయిత దానికి పంపారు. ఆ పోటీలో అడుగుజాడలు నాటకం రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతిని పొందింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, సూర్యాపేట వార్తలు (23 October 2016). "తెలంగాణ మాండలిక తొలి నాటక రచయిత కేఎల్". www.ntnews.com. డా. భీంపల్లి శ్రీకాంత్. Archived from the original on 18 December 2019. Retrieved 18 December 2019.
- ↑ మన తెలంగాణ, ఎడిటోరియల్ (28 November 2016). "సమకాలీనత గుబాళించిన తెలంగాణ సాంఘిక నాటకం". Archived from the original on 18 December 2019. Retrieved 18 December 2019.
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (9 September 2016). "జనచేతన నాటకాలు". www.ntnews.com. సిలివేరు లింగమూర్తి. Archived from the original on 18 December 2019. Retrieved 18 December 2019.
- ↑ నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాటకం బతికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 3 November 2018. Retrieved 18 December 2019.
- ↑ 5.0 5.1 నరసింహారావు, కె.ఎల్. (9 November 1956). అడుగుజాడలు (నమస్కారం వ్యాసం). Retrieved 5 March 2015.