అడోబ్ ఫ్లాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడోబ్ ఫ్లాష్
Adobe Flash Player v11 icon.png
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుమాక్రోమీడియా
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుఅడోబ్ సిస్టమ్స్
రకంరిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్
జాలస్థలిwww.adobe.com/products/flashruntimes.html

అడోబ్ ఫ్లాష్ అనగా వెక్టర్ గ్రాఫిక్స్, యానిమేషన్, గేమ్స్ సృష్టించడానికి, రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ (RIAs) గా అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ లో చూచేందుకు, ఆడేందుకు, నిర్వర్తించేందుకు ఉపయోగించే ఒక మల్టీమీడియా, సాఫ్టువేర్ వేదిక. గతంలో అడోబ్ ఫ్లాష్ మాక్రోమీడియాగా, షాక్వేవ్ ఫ్లాష్ గా పిలవబడింది. ఫ్లాష్ తరచుగా ప్రసార వీడియో లేదా ఆడియో ప్లేయర్లకు, ప్రకటన, ఇంటరాక్టివ్ మల్టీమీడియా కంటెంట్ వెబ్ పేజీలకు జోడిగా ఉపయోగిస్తారు, అయితే ఫ్లాష్ యొక్క ఉపయోగం వెబ్‌సైట్లలో నానాటికి తగ్గుచున్నది.

చరిత్ర[మార్చు]

ఫ్లాష్ స్మార్ట్‌స్కెచ్ అప్లికేషన్ తో ఉద్భవించి, జోనాథన్ గే ద్వారా అభివృద్ధి చెందింది. ఇది చార్లీ జాక్సన్ ద్వారా స్థాపించబడిన ఫ్యూచర్వేవ్ సాఫ్టువేరు ద్వారా బహిర్గతమయింది. స్మార్ట్‌స్కెచ్ పెన్పాయింట్ OSగా నడుస్తున్న పెన్ కంప్యూటర్ల కోసం ఉన్న ఒక డ్రాయింగ్ అప్లికేషన్. పెన్‌పాయింట్ విఫణిలో విఫలమయినప్పుడు, స్మార్ట్‌స్కెచ్ మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ OSకు పోర్ట్ చేయబడింది.