Jump to content

అతిధ్వనులు

వికీపీడియా నుండి
(అతి ధ్వని ఉత్పాదకాలు నుండి దారిమార్పు చెందింది)
గర్భం లోని 12 వారాల పిండం యొక్క అల్ట్రాసౌండ్ చిత్రం
ఒక ఆల్ట్రాసోనిక్ పరీక్ష
భ్రూణ అల్ట్రాసౌండ్

అల్ట్రాసౌండ్లు లేదా అతిధ్వనులు అనేవి మానవ వినికిడి పరిమితి కంటే ఎక్కువ పౌనఃపున్యాలతో ఉన్న ధ్వని తరంగాలు. అల్ట్రాసౌండ్ అనేది మానవులకు వినిపించక పోవడంలో తప్ప, దాని భౌతిక లక్షణాలలో 'సాధారణ' (వినిపించే) ధ్వని నుండి భిన్నంగా ఉండదు.20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారు. అతిధ్వనులను పాలను శుభ్రపరచడానికి, మానవుల్లో కీళ్ల నొప్పు లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. శరీర అంతర భాగంలో ఉండే కణాల స్థానాన్ని నిర్ణయించడానికి, కాంతి నిరోధక పదార్థాల్లో దాచిన వస్తువుల ఉనికిని గుర్తించడానికి కూడా వాడతారు.

జంతువులు

[మార్చు]
గబ్బిలాలు చీకటిలో నావిగేట్ చెయ్యడానికి అతిధ్వనులను ఉపయోగిస్తాయి.

గబ్బిలాలు తమ ఆహారాన్ని గుర్తించడానికి ఆల్ట్రాసోనిక్ రంగింగ్ యొక్క వివిధ పద్ధతులను ఉపయోగిస్తాయి. అవి 100 kHz కంటే ఎక్కువ పౌనః పున్యాలను గుర్తించగలవు. బహుశా 200 kHz వరకు గుర్తించగలవు.[1]

అతిధ్వనుల అనువర్తనాలు

[మార్చు]

భౌతిక శాస్ర్తము, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రములలో విభిన్న క్షేత్రాలలో అతిద్వనుల ఉపయోగలు అనేకం ఉన్నాయి.వాటిలోకొన్ని:

  1. పదార్థ నిర్మాణన్ని కనుగొనడం,
  2. లోహాలలో పగుళ్ళని గుర్తించడం
  3. శుభ్రం, శుద్ధి చేయడం,
  4. సముద్రపు లోతును కనుగొనడం,
  5. దిశా సంకేతాలు పంపడం
  6. స్పటికాల స్థితి స్తాపక సౌష్టవం,
  7. నీతిలోపల ఉండే జలాంతర్గాతములు, మంచు దిమ్మెలు, ఇతర వస్తువుల ఆచూకి కనుగొనడం,
  8. లోమ మిశ్రమాల తయారి,
  9. రసాయనిక ప్రభావం,
  10. స్ఫటికీకరణ,
  11. జైవిక ప్రభావము,
  12. సొల్డరింగ్, లోహాలను కత్తిరించడం,
  13. వైద్యరంగంలో ప్రయోజనాలు.[2]
  14. పాలు, నీటిలోని హానికర బ్యాక్టీరియాను నిర్మూలించడానికి
  15. విరిగిన దంతాలను సులభంగా తొలగించడం, కీళ్ల నొప్పులను నివారించడానికి
  16. దోమలను పారద్రోలడం

అతి ధ్వని ఉత్పాదకాలు

[మార్చు]

అతి ధ్వనులను అనేక విధాలుగా ఉత్పత్తి చేయవచ్చు.ఉత్పాదకాలను నాలుగు తరగతులుగా విభజింపవచ్చు.

  • (a) యాంత్రిక ఉత్పాదకాలు
  • (b) ఉష్ణీయ ఉత్పాదకాలు
  • (c) అయస్కాంత విరూపణ ఉత్పాదకాలు
  • (d) పీడన విద్యుత్ ఉత్పాదకాలు

మూలాలు

[మార్చు]
  1. Hearing by Bats (Springer Handbook of Auditory Research, vol. 5. Art Popper and Richard R. Fay (Editors). Springer, 1995
  2. http://books.google.co.in/books?id=uDorAAAAYAAJ&pg=PA92&hl=en#v=onepage&q&f=false