గబ్బిలం

వికీపీడియా నుండి
(గబ్బిలాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గబ్బిలాలు
Temporal range: Late Paleocene - Recent
"Chiroptera" from Ernst Haeckel's Kunstformen der Natur, 1904
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Infraclass:
Superorder:
Order:
Chiroptera

Suborders

Megachiroptera
Microchiroptera
See text for families.

గబ్బిలం (ఆంగ్లం Bat) ఒక క్షీరదం, నిశాచర జీవి.

గబ్బిలం

గబ్బిలాలు చీకటిలో దారి ఎలా తెలుసుకొంటాయి?

[మార్చు]
లిటిల్ బ్రౌన్ బ్యాట్ టేకాఫ్, ఫ్లైట్

సూర్యాస్తమయం కాగానే ఇళ్ళ లోంచి, చెట్ల గుబుర్ల లోంచి, బయటికి వచ్చి గబ్బిలాలు అతి వేగంతో ఎగురుతూ చటుక్కున ఏదో జ్జాపకం వచ్చినట్లు పక్కకి తిరిగిపోతూ ఉండడం మనకి నిత్యానుభావంలో ఉన్న విషయం.

అవి ఎగురుతున్న పురుగులను పెద్ద సంఖ్యలో ఫలహారం చేసేస్తూ ఉంటాయి. కటిక చీకట్లో కూడా అడ్డంకులను సునాయాసంగా తప్పించుకుని కంటికి కనిపించక పోయినా పురుగుల్ని పట్టుకొని తింటూ ఉంటాయి. గబ్బిలాలు చాలా విచిత్రమైన జీవులు. చీకట్లో ఎగరడం ఒక్కటే కాదు, వీటి ప్రత్యేకత! ఇవి పక్షులు కావు, క్షీరదా జంతువులు.ఇవి గ్రుడ్లను పెట్టవు.పిల్లలను కంటాయి. వీటికి పళ్ళు, చెవులు ఉంటాయి. క్షీరదాలలో ఎగరగలిగినది ఒక్క గబ్బిలం మాత్రమే ! గబ్బిలాల ఫాసిల్సుని"బట్టి ఇవి అధమం ఆరు కోట్ల సంవత్సరాల ఈ భూమి మీద నివసిస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం గబ్బిలాలలో 2000 రకాలు ఉన్నాయి. ఒక్క ధ్రువ ప్రాంతాలలో తప్పించి, ఇవి అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు రెక్కుఅల నిడివి గల గబ్బిలాలు ఉన్నాయి! వీటిలో చాలా భాగం పురుగుల్ని తింటాయి. పక్షుల్ని తినేవి, చేపల్ని పట్టేవి, రక్తం త్రాగేవి కూడా ఉన్నాయి.

కటిక చీకట్లో కూడా చెట్లకు, పుట్టలకు, స్తంభాలకు గుద్దుకోకుండా ఎలా ఎగరగలుగుతున్నాయో చాలా కాలం వరకు శాస్త్రజ్జులకు అర్థం కాలేదు !? అది తెలుసుకోవడానికి ఒక ఎక్స్'పెరిమెంటు చేసారు.పెద్ద గదిలో అడ్డంగా కొన్ని తీగలని కట్టి, కొన్ని గబ్బిలాలని పట్టుకొని, వాటి కళ్ళకు గంతలు కట్టి, ఆ గదిలో విడిచిపెట్టారు.అవి ఏ తీగలకైనా తగిలితే ఒక గంట మ్రోగేటట్లు అమర్చారు. ఊక్క తీగకైనా తగలకుండా మామూలు వేగంతో అవి సునాయాసంగా తీగల మధ్య సందుల్లోంచి ఎగురగలిగాయి !! అంటే కళ్ళతో చూడకుండానే గబ్బిలాలు దారి తెలుసు కొంటున్నాయి అని రుజువు అయింది.కాని ఇది ఎలా సాధ్యం?

రెండవ ఎక్స్'పేరిమెంటులో గబ్బిలాల కళ్ళకి గంటలు విప్పేసి, చెవులకు బిరడాలు పెట్టి, ఆ గదిలో వదలి పెట్టారు. ఈ సారి అవి సరిగ్గా ఎగరలేక పోయాయి. మాటిమాటికీ తీగలకే కాక, గోడలకి కూడా గుద్దుకోవడం మొదలు పెట్టాయి. మూడవ సారి వాటి నోరు కట్టేసి వదలిపెట్టేరు. ఈ సారి కూడా అవి సరిగ్గా ఎగరలేక పోయాయి.

దీనిని బట్టి గబ్బిలం దారి ఏ విధంగా తెలుసుకొంటు ఉందో అర్థం అయింది. అది ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రిక్వెన్సీ కలది కావడం చేత (సెకండుకి 45వేలు నుండి 50 వేలు సార్లు) అది మన చెవులకి వినిపించదు . ఈ హై ఫ్రిక్వెన్సీ శబ్ద తరంగాలు ఎడార ఉన్న అడ్డంకులకి తగిలి, ప్రతిఫలించి వెనక్కి తిరిగి వచ్చి, గబ్బిలం చెవులకి తగులుతాయి. వీటి చెవులు బహు సున్నితమైనవి.కావడం చేత పరావర్తనం చెంది తిరిగి వచ్చిన అల్పాల్పమైన శబ్దాలను విని, ఎదరనున్న అడ్డంకిని గుర్తించ గలుగుతాయి.ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతోందో, కదులుతే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతోందో, కచ్చితంగా తెలుసుకోగలుగుతాయి ! ఆ వస్తువు తానూ తినడానికి పనికి వచ్చే పురుగో, లేక తాను తప్పించుకోవలసిన, చెట్టుకొమ్మో గ్రహించి, తదనుగుణంగా దిశను మార్చుకుంటూ పురుగును సమీపించడం గాని, ఆ అడ్డంకిని తప్పించు కొనడం గాని చేయ గలుగుతాయి.

వీటికి కళ్ళ వలన బొత్తిగా ఉపయోగం లేకపోలేదు.ఆ వస్తువును సమీపించిన తరువాత, అది తన తిండికి పనికి వచ్చేదో కాదో, అవి కళ్ళతో చూసి తెలుసు కొంటాయి.

ఇందులో ఒక చమత్కారం కూడా ఉంది. కొన్ని పురుగులు హై ఫ్రిక్వెన్సీ శబ్ద తరంగాలను గ్రహించి, వెంటనే ఏ మూలనో నక్కడానికి ప్రయత్నిస్తాయి. ఆ తరంగాలకూ, ప్రమాదాలకూ సంభంధం ఉన్నదని అవి గ్రహించ గలిగాయి అన్నమాట ! సృష్టిలో పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెంద గలిగిన జీవులే జీవన పోరాటంలో నెగ్గుకొని రాగలవన్న సిద్దాంతానికి ఇదొక ఉదాహరణ.

గబ్బిలం వలన మనిషి నేర్చుకొన్న అద్భుత విషయం ఒకటి ఉంది ! గబ్బిలం శబ్ద తరంగాలని ఉపయోగించి, ఎదుటి వస్తువులని తెలుసుకొనే పద్ధతిలోనే శాస్త్రజ్జులు "రాడార్'" అనే పనిముట్టును కనిపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కనిపెట్టడం జరిగింది.శత్రు విమానాలను బహు దూరంలో ఉండగానే పసి గట్టడానికి ఇది ఉపయోగిస్తుంది.హైఫ్రిక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగిస్తారు.ఎదరునా విమానాలకు అవి తగిలి, పరావర్తనం చెంది, ఆ విమానం ఎంత దూరంలో ఉందో, ఏ దిశలో ఎంత వేగంతో ఎగురుతోందో తెలుసుకొంటారు .దానిని పడగొట్టడానికి అవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసు కొంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వ్రేలాడుతాయి?

[మార్చు]

పక్షులు, కీటకాలూ కూడా ఎగురుతాయి. కాని అవేవి తలక్రిందులుగా వేలాడవు. ఈ అవసరం ఒక్క గబ్బిలాలకే ఎందుకు కలిగింది? మిగిలిన పక్షులన్నీ ఎగర గలిగినప్పటికీ, అవి అవసరమైతే కాళ్లతో నడవగలవు, కాని గబ్బిలాలు బొత్తిగా నడవలేవు. వాటి కాళ్లకి నడిచే శక్తి లేదు. కనుక, ఒక చోటి నుండి మరో చోటికి కడలి వెళ్ళాలంటే ఎగరడం తప్ప గబ్బిలాలకి మరో గత్యంతరం లేదు. అవి కాస్త సేపు ఆగాలంటే, రెక్కలకి ఉన్న గోళ్ళతో ఏ చెట్టు కొమ్మనో, గోడ పగులునో పట్టుకొని తలక్రిందులుగా వ్రేలాడడమే అన్నిటికన్నా సులభమైన పని.

గబ్బిలం చాలా విచిత్రమైన జీవి. క్షీరదాలలో ఎగర గలిగినది ఒక్క గబ్బిలం మాత్రమే ! ఇది పిల్లలని కంటుంది. వాటికి పాలిస్తుంది. తల్లి గబ్బిలం వేటకి వెళ్తూ, పిల్లలను పొట్టకు కరచుకొని ఎగురుతూ పోతూ ఉంటుంది. ఎగిరే ఉడతలు, ఎగిరే లేమూర్'లు, ఉన్నాయి, కాని పైనుంచి క్రిందకి నెమ్మదిగా `గ్లయిడ్' అవడం తప్ప నిజంగా ఎగరడం వాటికి చేతకాదు.

గబ్బిలం రెక్కలకీ, పక్షి రెక్కలకి చాలా తేడా ఉంది. పక్షుల రెక్కలకి ఈకలు ఉంటాయి. వేళ్ళ మద్యని గొడుగు బట్టలాగ సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు గబ్బిలాలకి ఉన్నాయి. దాని వేళ్ళలో బొటన వ్రేలు తప్ప మిగిలిన గొడుగు ఉచల లాగ పని చేస్తాయి. బొటనవేలు మాత్రం పైకి పొడచుకొని వచ్చి, ఏ చెట్టు కొమ్మనో, పట్టుకోవడానికి పనికి వస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు. వీటిలో చాలా భాగం పురుగుల్ని, తింటాయి. కొన్ని పళ్ళు తింటాయి, కొన్ని పుప్పొడిని నాకుతాయి, మరికొన్ని నిద్ర పోతున్న జంతువుల రక్తం త్రాగుతాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=గబ్బిలం&oldid=3929610" నుండి వెలికితీశారు