అతుల్ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశానికి చెందిన ఆర్చరీ క్రీడాకారుడు అతుల్ వర్మ. 2014 ఆగస్టు నెలలో చైనాలో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్‌లో అతుల్ వర్మ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. భారత ఒలింపిక్ చరిత్రలో ఆర్చరీలో అతుల్ వర్మ సాధించినదే తొలి పతకం.

కుటుంబం[మార్చు]

ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఒక పేద కుటుంబానికి చెందినవాడు అతుల్ వర్మ. ఇతని వయసు 17 సంవత్సరాలు. తండ్రి రైతు.

కెరీర్[మార్చు]

అతుల్ కు చిన్నప్పటి నుంచే విలు విద్యపై ఆసక్తి ఉండేది. 2012లో యూపీ తరపున వారణాసిలో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్ లో అతుల్ పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా ప్రతిభా అన్వేషణ చేస్తున్న ఆర్మీ అధికారులు ఆ పోటీలకు వెళ్లారు. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ మిషన్ భారతదేశానికి ఒలింపిక్స్ పతకాలు ఎక్కువ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతిభా అన్వేషణ చేసింది. ఆ సమయంలో అతుల్ ఆర్మీ అధికారుల దృష్టిలో పడ్డాడు. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ లో స్పోర్ట్స్ అభ్యర్థిగా చేరిన అతుల్ కు అక్కడ స్కాలర్ షిప్ లభించింది. ఆర్చరీ కోచ్ సుబేదార్ రవిశంకర్ శిక్షణతో వర్మ మరింత మెరుగయ్యాడు. 2014 జూలై నెలలో చైనీస్ తైపీలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రి ఈవెంట్‌లో రజతం సాధించాడు.

చైనా యూత్ ఒలింపిక్స్[మార్చు]

చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన అతుల్ వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 26-08-2014న జరిగిన ఈ పోటీలో వర్మ 6-4 తేడాతో టర్కీకి చెందిన మెటే గజోజ్‌ను ఓడించాడు.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 27-08-2014 - (అతుల్ వర్మకు కాంస్యం)