Coordinates: 14°03′N 79°21′E / 14.05°N 79.35°E / 14.05; 79.35

అత్తిగారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తిగారిపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
అత్తిగారిపల్లె is located in Andhra Pradesh
అత్తిగారిపల్లె
అత్తిగారిపల్లె
అక్షాంశరేఖాంశాలు: 14°03′N 79°21′E / 14.05°N 79.35°E / 14.05; 79.35
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం పెనగలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అత్తిగారిపల్లె, కడప జిల్లా, పెనగలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామం ఓబిలి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దేవాలయాలు[మార్చు]

అత్తిగారిపల్లె గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం, ఒక కోటి రూపాయల వ్యయంతో శ్రీ రామాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయం ప్రక్కనే ఒక చిన్న కొండపై 65 అడుగుల ఎత్తయిన, శ్రీ భక్తాంజనేయస్వామివారి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. నూతనంగా నిర్మించిన ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2014, ఆగస్టు-3, ఆదివారం నుండి మూడురోజులపాటు వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మూడవ తేదీ ఆదివారం నాడు అంకురార్పణ, రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ నిర్వహించారు. నాల్గవ తేదీ సోమవారం నాడు లక్ష తమలపాకులతో ఆకుపూజ, విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించారు. 5వ తేదీ మంగళవారం నాడు, శ్రీ భక్తాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]