అథిరాజేంద్ర చోళుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అథిరాజేంద్ర చోళుడు
Parakesari
Reign1070 CE
PredecessorVirarajendra Chola
SuccessorKulothunga Chola I
జననంUnknown
మరణం1070 CE
QueenUnknown
IssueUnknown
తండ్రిVirarajendra Chola

అథిరాజేంద్ర చోళుడు (సా.శ. 1070) చాలా తక్కువ కాలం పాలించాడు. చోళరాజు తన తండ్రి విరారాజేంద్ర చోళుడి తరువాత పాలనకు వచ్చాడు. ఆయన పాలనలో పౌర అశాంతి నెలకొన్నట్లు గుర్తించబడింది. బహుశా మతపరమైన కారణంగా సంభవించి ఉండవచ్చు.

చోళుడు, తూర్పి చాళుక్య సమాఖ్య[మార్చు]

రాజరాజు చోళుడి తన కుమార్తె కుందవైను తూర్పు చాళుక్యుడు విమలాదిత్యకు ఇచ్చి వివాహం చేయడం, అనేక వివాహాల ఫలితంగా చోళ వంశం, చాళుక్య రాజవంశం వెంగీశాఖ చాలా దగ్గరగా మారాయి. వెంగీరాజులు హృదయపూర్వకంగా చోళులుగా మారారు.

వేంగీ రాజవంశం సంఘర్షణలు[మార్చు]

వేంగీరాజ్య రాజవంశ పోరాటాలలో చోళులు కూడా పాల్గొన్నారు. తమ అభిమాన యువరాజుకు మద్దతుగా ప్రత్యర్థిమీద అడపాదడపా పోరాడారు. ఈ ప్రత్యర్థులకు పశ్చిమ చాళుక్యులు మద్దతు ఇవ్వలేదు. అందువలన తూర్పు చాళుక్యరాజ్యం తరతరాలుగా చోళులు, పశ్చిమ చాళుక్యుల మధ్య యుద్ధానికి వేదికగా ఉంది.

1061 లో తన తల్లి కుందవై ద్వారా చోళ వంశానికి దగ్గరి సంబంధం ఉన్న వెంగీరాజు రాజరాజ నరేంద్ర సా.శ. 1061 లో మరణించిన తరువాత వేంగీరాజ్య వారసత్వ వివాదాలలో వీరరాజేంద్ర చోళుడు జోక్యం చేసుకున్నాడు. వెంగీ సింహాసనం రాజభవనంలో జరిగిన తిరుగుబాటు కారణంగా సింహాసనం రెండవ శక్తివర్మను వశం అయింది. చోళులు చోళ ప్రభావాన్ని వెంగీలో తిరిగి స్థాపించాలని కోరుకున్నారు. రెండవ శక్తివర్మను చంపబడ్డాడు. కాని శక్తివర్మను తండ్రి విజయాదిత్య సింహాసనాన్ని స్వీకరించి ఆయనను తొలగించడానికి చోళులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టాడు. అయినప్పటికీ విజయాదిత్య చోళ సామంతుడిగా పనిచేయడానికి అంగీకరించాడు.

వెంగీ మీద పూర్తి నియంత్రణ సాధించే ఈ ప్రయత్నం విఫలమైనప్పటికీ వీరరాజేంద్రచోళుడు తన కుమార్తెను విక్రమాదిత్యుడికి ఇచ్చి వివాహం చేయడం ద్వారా మరో చాళుక్యమిత్రుడిని కనుగొన్నాడు.

ఈ కుట్రలు జరుగుతుండగా రాజరాజ నరేంద్ర కుమారుడు యువరాజు రాజేంద్ర చాళుక్య (భవిష్యత్తు మొదటి కులోత్తుంగ చోళుడు) విజయాదిత్య తన సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భావించి వెంగీ రాజు కావాలని కోరుకున్నాడు. ఆయన ప్రయత్నాలలో చోళులు బహుశా ఆయనకు సహాయం చేసి ఉండవచ్చు. తన మామ విజయాదిత్య సింహాసం స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలలో విఫలమైన రాజేంద్ర చాళుక్య ఛత్తీసుగఢు రాష్ట్రంలోని బస్తరు జిల్లా సమీపంలో ఒక చిన్న ఆధిపత్యాన్ని సాధించడానికి ఆయన సమయాన్ని వెచ్చించాడు. వీరరాజేంద్ర మరణాన్ని అవకాశంగా చేసుకుని చోళ సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి రాజేంద్ర చాళుక్య వేగంగా పనిచేశారు.

అథిరాజేద్ర చోళుడిమరణం[మార్చు]

చాళుక్య రచయిత బిల్హణుడు తన " విక్రమాంకదేవ చరిత "లో అథిరాజేంద్ర కష్టాలకు నేపథ్యం సంస్కరణను ఇచ్చారు. తన కుమార్తెను రెండవ విక్రమాదిత్య చాళుక్యుడికి ఇచ్చి వివాహం చేసుకున్న వెంటనే వీరరాజేంద్ర చోళుడు మరణించాడు. చక్రవర్తి మరణం తరువాత చోళ దేశంలో ఇబ్బంది, తిరుగుబాటు వార్తలను విన్న విక్రమాదిత్య వెంటనే అక్కడి ఇబ్బందులను అరికట్టడానికి కాంచీపురానికి వెళ్లారు. అప్పుడు ఆయన గంగైకొండ చోళపురం వెళ్లి ‘శత్రువుల శక్తులను నాశనం చేసి యువరాజు (అథిరాజేంద్ర) ను సింహాసనంపై ఉంచాడు’. చోళ రాజధానిలో ఒక నెల గడిపిన తరువాత శాంతి పునరుద్ధరించబడిందని రెండవ విక్రమాదిత్య సంతృప్తి చెంది తిరిగి తన దేశానికి వచ్చాడు.

ఆయన తిరిగి వచ్చిన కొద్ది రోజులలోనే తాజా తిరుగుబాటులో అథిరాజేంద్ర మరణం గురించి వార్తలు అతనికి చేరాయి. రాజేంద్ర చాళుక్యుడు చోళ సింహాసనాన్ని స్వాధీనం చేసుకుని కులోతుంగ చోళుడు అనే బిరుదును స్వీకరించాడని కూడా వార్త అతనికి తెలిపింది. విక్రమాదిత్య వెంటనే కులోతుంగచోళుడికి వ్యతిరేకంగా సైన్యాలను నడిపించాడు. పశ్చిమ చాళుక్య రాజు రెండవ సోమేశ్వర కూడా అతనితో చేరాడు.

అథిరాజేంద్ర చోళుడు (వీరరాజేంద్ర చోళుడి కుమారుడు) మరణంతో విజయాలయ చోళుడు పాలన చాళుక్య లేదా కులోతుంగ చోళుడి పాలన ద్వారా అణచివేయబడింది. కాని వారి వారసులు ప్రాణాలతో బయటపడ్డారు (మొదటి రాజధీరాజ చోళుడి అనేక మంది కొడుకుల నుండి వచ్చిన రెండు వేర్వేరు శాఖలకు చెందిన రెండవ రాజేంద్ర చోళుడి ఆరుగురు కుమారులు) రాబోయే అనేక శతాబ్దాలు కొనసాగారు.

కులోత్తుంగ జోక్యం[మార్చు]

అథిరాజేంద్ర మరణంలో కులోత్తుంగ పాత్ర గురించి సమాధానం లేని ప్రశ్నలు తలెత్తాయి. అథిరాజేంద్ర ఆరోహణ జరిగిన వెంటనే ఇది విక్రమాదిత్య జోక్యం చేసుకొనవలసిన అవసరం కలిగించిన కాంచీపురంలో తలెత్తిన ఇబ్బందులకు ఎవరు బాధ్యత వహించారు. అథిరాజేంద్ర తన సింహాసనంలో ఉండగానే సింహాసనానికి అబధ్రత కలిగించిన వారెవరు. విక్రమాదిత్య అణచివేసిన కాంచీపురం, గంగైకొండ చోళపురం కలవరానికి కారణమైంస్ ‘దుష్ట ప్రజలు’ ఎవరు? అథిరాజేంద్ర చోళదేశం నుండి తిరిగి వచ్చిన కొద్ది రోజుల తరువాత తిరుగుబాటు స్వభావం ఏమిటి?

ఈ ప్రశ్నలకు శాసనాలు లేదా సాహిత్య మూలాల నుండి ప్రత్యక్ష సమాధానాలు లేవు. వాస్తవానికి అథిరాజేంద్ర చేసిన చాలా శాసనాలు మన వద్ద లేవు. ఏది ఏమయినప్పటికీ 4 వ విక్రమాదిత్య కులోతుంగచోళుడికి వ్యతిరేకంగా సైన్యాలను నడిపించి చోళ సింహాసనాన్ని స్వీకరించి కులోత్తుంగను విజయవంతంగా తొలగించాడు. దీనితో కలిపి కులోత్తుంగ చోళుడిని ప్రశంసిస్తూ ఒక కవితా రచన ఆయన కళింగతుప్పరణిలో అథిరాజేంద్ర పాలన గురించి ప్రస్తావించకపోవడం, కులోతుంగచోళుడి ఆశయం, కుట్రలు ఈ సంఘటనలకు కారణమని అనుమానానికి దారి తీసింది.

మతసంఘర్షణలు[మార్చు]

చోళ రాజ్యంలో ఈ అంతర్గత అవాంతరాలను చోళుల చేతిలో రామానుజుడు అనుభవించిన హింస కథతో అనుసంధానించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. రామానుజుడు ఆయన అనుచరులను హింసకు గురిచేసిన చోళ చక్రవర్తి అథిరాజేంద్ర లేదా ఆయన తండ్రి వీరరాజేంద్ర అని రామానుజుడి ప్రారంభ జీవితచరిత్ర రచనల ఆధారంగా ఒక ఊహ ప్రచారంలో ఉంది. నీలకాంత శాస్త్రి, క్రిమికాంత చోళుడి రచనల ఆధారంగా రామానుజుడిని హింసించినవాడు అధిరాజేంద్ర స్థానిక వైష్ణవుల తిరుగుబాటులో మరణించాడు.[1] ఈ గుర్తింపు దివ్యసూరిచరితం లోని అంశాలకు విశ్వసనీయతను ఇస్తుంది. దీని ప్రకారం రాజు అసహనం ఫలితంగా శపించడడంతో చోళ రాజవంశపాలన ముగిసింది.[2]

మూలాలు[మార్చు]

  1. Raju Kalidos. History and Culture of the Tamils: From Prehistoric Times to the President's Rule. Vijay Publications, 1976 - Tamil (Indic people) - 382 pages. p. 139.
  2. N. Jagadeesan. History of Sri Vaishnavism in the Tamil Country: Post-Ramanuja. Koodal Publishers, 1977 - Tamil (Indic people) - 460 pages. p. 285.

వనరులు[మార్చు]

  • Nilakanta Sastri, K. A. (1935). The CōĻas, University of Madras, Madras (Reprinted 1984).
  • Nilakanta Sastri, K. A. (1955). A History of South India, OUP, New Delhi (Reprinted 2002).
అంతకు ముందువారు
వీరరాజేంద్ర చోళుడు
చోళ
సా.శ.1067–1070
తరువాత వారు
కులోత్తుంగ చోళుడు