అదా ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2018 హోళీ పార్టీలో అదా.[1]

అదా ఖాన్, భారతీయ టెలివిజన్ నటి, మోడల్.[2][3][4] ఆమె నటించిన బెహెనైన్ అనే సీరియల్ లో ఆకాషీ పాత్ర, అమృత్ మంథన్ ధారావాహికలో రాజకుమారి అమృత్ పాత్రల ద్వారా ఆమె ప్రఖ్యాత సీరియల్ నటిగా ప్రసిద్ధి చెందింది.[5][6][7] అలాగే ఆమె పియా బసంతీ రేలోని పియా, నాగిన్ లో షేషా[8][9][10], పర్దేస్ మే హై మేరా  దిల్ లో అహనా పాత్రలు కూడా ఆమె కెరీర్ లో నిలిచిపోయాయి.[11] నాగిన్ 2 తరువాత ఆమె చంద్రకాంత (2017), యే రిష్తా క్యా కెహలాతా హై (2018) లలో అతిథి పాత్రల్లో నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అదా ఖాన్ 1989 మే 12న జన్మించింది. ఆమె మహారాష్ట్రలోని ముంబైలో పెరిగింది. సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన అదా, నటి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె తన స్నేహితులతో కలసి రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఆమెను చూసి ఒక నిర్మాత పంటాలూన్స్ యాడ్ లో నటించమని అడిగారు. అలా ఆమె కెరీర్ ప్రారంభమైంది.

ఆమె తల్లి పర్విన్ ఖాన్ మార్చి 2013న క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయింది.[12][13]

తొలినాళ్ళ జీవితం, కెరీర్

[మార్చు]

అదా మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది.[14] ఎన్నో యాడ్లలో నటించింది ఆమె.[15][16][17] 2010లో సోనీ ఇండియా టీవీలో ప్రసారమైన పాలంపూర్ ఎక్స్ ప్రెస్ ధారావాహిక ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టింది.[18] 2010లోనే స్టార్ ప్లస్ లో ప్రసారమైన బెహెనైన్ ధారావాహికలో ఆకాషీ పాత్రలో సహాయ నటిగా నటించింది.[19][20] 2012లో, లైఫ్ ఒకె చానెల్ లో ప్రసారమైన అమృత్ మంథన్ సీరియల్ లో రాజకుమారి అమృత్ కౌర్ గా నటించింది.[21][22]  

యే హై ఆషుకీ, [23][24] క్రైం పెట్రోల్, కోడ్ రెడ్, సావధాన్ ఇండియా @11 వంటి ధారావాహికల్లో కొన్ని ఎపిసోడ్ లలో నటించింది అదా.[25] వెల్ కమ్-2 బాజీ మెహ్మాన్ నవాజీకీ అనే రియాలిటీ షోలో కూడా అమె చేసింది.[26]

2014లో, సోని పా చానల్ లో ప్రసారమైన పియా బసంతి రే సీరియల్ లో ప్రధాన పాత్ర పియాగా నటించింది అదా ఖాన్. 2015లో సాబ్ టీవీలో ప్రసారమైన హాస్యరస ప్రధాన రియాలిటీ షో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ డ్రామా[27]కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది అదా. నవంబరు 2015లో, కలర్స్ టీవీలో బాలాజీ టెలీఫిలింస్ సంస్థ నిర్మించిన, నాగిన్ ధారావాహికలో ప్రధాన ప్రతినాయిక పాత్ర నాగిన్ షేషాగా కూడా నటించింది ఆమె. జూన్ 2016 వరకూ కొనసాగిన ఈ ధారావాహిక ప్రసారమైనంత కాలం, ప్రేక్షకాదరణ పొందడమే కాక, అధిక టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసింది. ఈ సీరియల్ రెండవ సీజన్ తిరిగి అక్టోబరు 2016లో మొదలైంది. ఆ ధారావాహికలో కూడా అదా ప్రధాన ప్రతినాయికగా నటించడం విశేషం. ఈ సీరియల్ జూన్ 2017లో పూర్తి అయింది. కలర్స్ టీవీలో ప్రసారమైన కామెడీ నైట్స్ బచావ్ అనే హాస్యరస ప్రధానమైన రియాలిటీషోలో కూడా ఆమె నటించింది. 2016లో బాక్స్ క్రికెట్ లీగ్ లో జైపూర్ రాజ్ జోషిలే టీంలో ఆడింది అదా ఖాన్.



టెలివిజన్ కెరీర్

[మార్చు]

ధారావాహికలు

[మార్చు]
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర పేరు చానెల్ నోట్స్
పాలంపూర్ ఎక్స్ ప్రెస్[28] | అనితా కులకర్ణి | సోనీ టీవీ | మొదటి సీరియల్
బెహెనైన్[29] | ఆకాషీ ష్యామద్ దాస్ | స్టార్ ప్లస్ | రెండవ ప్రధాన పాత్ర
అమృత్ మంథన్[30] | రాజకుమారి అమృత్ తేజ్ మాలిక్ | లైఫ్ ఒకె | ప్రధాన ప్రతినాయిక
యే హై ఆషుకీ[23] | సుబ్బలక్ష్మి | బిందాస్ | అతిథి పాత్ర (ఒక ఎపిసోడ్ లో నటించింది)
సావధాన్ ఇండియా @ 11[25] | పూజా సక్సేనా | లైఫ్ ఓకె | అతిధి పాత్ర
క్రైం పెట్రోల్ | నస్రత్ కజ్మీ | సోనీ టీవీ | అతిధి పాత్ర
పియా బసంతీ రే[31] | పియా కబీర్ షా | సోనీ పాల్ | ప్రధాన పాత్ర
కోడ్ రెడ్ | జరీనా/ఆఫ్రీన్ ముర్తాజా | కలర్స్ టీవీ | అతిధి పాత్ర
నాగిన్ (సీజన్లు: 1-2)[32] | షేషా (నాగిన్) /రుచిక (మనిషి) | కలర్స్ టీవీ | ప్రధాన ప్రతినాయిక పాత్ర
పరదేశ్ హై మేరా దిల్[33] | ఆహానా | స్టార్ ప్లస్ | అతిథి పాత్ర
చంద్రకాంత | రాణి పషానీ | కలర్స్ టీవీ | అతిథి ప్రతినాయిక పాత్ర

రియాలిటీ షోలు

[మార్చు]
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర పేరు చానెల్ నోట్స్
వెల్ కమ్2-బాజీ మెహ్మాన్ నవాజీ కీ[26] | స్వంతం | లైఫ్ ఒకె | నందిష్ సంధు, ఇతర సెలబ్రిటీలతో పాటు పాల్గొంది
బాక్స్ క్రికెట్ లీగ్ - సీజన్ 1[34] | స్వంతం | సోనీ టీవీ | బాక్స్ క్రికెట్ లీగ్
ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ డ్రామా[27] | వ్యాఖ్యాత | సాబ్ టీవీ | హాస్య రస ప్రధానమైన రియాలిటీ షో
కామెడీ నైట్స్ బచావ్[35] | స్వంతం | rowspan=4|కలర్స్ టీవీ | హాస్యరస ప్రధానమైన రియాలిటీ షో (నటుడు కరన్ వాహీతో కలసి)
ఝలక్ దిఖలాజా రీలోడెడ్ (సీజన్ 8) | స్వంతం | హాస్య ప్రదర్శన
బిగ్ బాస్ 9 [36]| అతిధి | నృత్య ప్రదర్శన
బాక్స్ క్రికెట్ లీగ్ – సీజన్ 2[37] | స్వంతం | జైపూర్ రాజ్ జోషిలే టీంలో ఆడింది
కామెడీ క్లాసెస్ | స్వంతం | లైఫ్ ఒకె | నృత్య ప్రదర్శన
కామెడీ నైట్స్ లైవ్[38] | అతిధి, వివిధ పాత్రలు | rowspan=2|కలర్స్ టీవీ| ఒక ఎపిసోడ్ లో మాత్రమే
బిగ్ బాస్ 10[39] | అతిథి |
కరన్ వీర్ బోహ్రా, మౌనీ రాయ్, రుబినా దిలైక్, మీరా దియొస్త్లే

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం పురస్కారం క్యాటగిరీ పాత్ర షో ఫలితం
2011 స్టార్ పరివార్ అవార్డ్స్ ఫేవరెట్ బెహెన్ ఆకాషీ బెహెనైన్ నామినేటెడ్
2013 ఇండియన్ టెలీ అవార్డ్స్ ఉత్తమ ప్రతినాయిక (జ్యూరీ) అమృత్ అమృత్ మంథన్ గెలిచింది
ఉత్తమ ప్రతినాయిక (ప్రముఖం) నామినేటెడ్[40]
2016 లయన్స్ గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ ప్రతినాయిక షేషా నాగిన్ గెలిచింది
బోరోప్లస్ గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ ప్రతినాయిక (విమర్శకుల పురస్కారం) గెలిచింది
ఉత్తమ ప్రతినాయిక (ప్రముఖం) నామినేటెడ్
ఇండియా న్యూస్ అవార్డ్స్ ఫిటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గెలిచింది
2017 ఇండియన్ కళాకార్ అవార్డ్స్ ఉత్తమ ప్రతినాయిక గెలిచింది
బోరోప్లస్ గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ ప్రతినాయిక (విమర్శకుల పురస్కారం) గెలిచింది

మూలాలు

[మార్చు]
  1. "Cricket reality show players rock their Holi bash". Archived from the original on 2018-03-08. Retrieved 2018-03-06.
  2. Uniyal, Parmita (12 May 2016). "Birthday special: Five reasons we love Adaa Khan aka Sesha of Naagin". India Today. Retrieved 6 August 2016.
  3. Chatterjee, Swasti (20 August 2012). "Shopping before Eid is an addiction for Adaa Khan". The Times of India. Retrieved 5 August 2016.
  4. Chatterjee, Swasti (3 September 2013). "Books are Adaa Khan's latest obsession". The Times of India. Retrieved 5 August 2016.
  5. Tiwari, Vijaya (9 July 2012). "Adaa Khan misses Dimple!". The Times of India. Retrieved 5 August 2016.
  6. Bhopatkar, Tejashree (25 June 2013). "Ankita Sharma and Adaa Khan at logger heads!". The Times of India. Retrieved 5 August 2016.
  7. "Adaa Khan". The Times of India. Retrieved 5 July 2016.
  8. "Adaa Khan in Naagin 2". timesofindia.com. Retrieved 8 August 2016.
  9. "Playing Naagin is challenging for Adaa Khan". The Indian Express. 25 December 2015. Retrieved 5 August 2016.
  10. "Naagin actress Adaa Khan cuts a pretty figure in her latest photo shoot". 25 ఏప్రి, 2017 – via The Economic Times - The Times of India. {{cite web}}: Check date values in: |date= (help)
  11. "Adaa Khan, Ravi Dubey to perform together this Holi".
  12. Maheshwri, Neha (14 December 2014). "Why Adaa Khan is very emotional about this tattoo". The Times of India. Retrieved 5 August 2016.
  13. Agarwal, Stuti (10 May 2013). "Adaa Khan misses mom at success bash". The Times of India. Retrieved 5 August 2016.
  14. Jambhekar, Shruti (17 April 2013). "After every three months I get a new 'reel' look: Adaa Khan". The Times of India. Retrieved 5 August 2016.
  15. "Adaa Khan shoots for jewellery designer Nidhi Jain". The Times of India. 11 February 2014. Retrieved 5 August 2016.
  16. Mulchandani, Amrita (3 June 2012). "TV shows are getting bolder: Adaa Khan". The Times of India. Retrieved 5 August 2016.
  17. "Adaa Khan shoots for jewellery designer Nidhi Jain". Zee News. 10 February 2014. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 5 August 2016.
  18. "Not full of ego in real life, says TV actress Adaa Khan". NDTV Movies. 30 July 2012. Archived from the original on 7 అక్టోబరు 2013. Retrieved 5 August 2016.
  19. "Behenein brings more spice with IPL!". One India. 25 March 2010. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 5 August 2016.
  20. Mulchandani, Amrita (21 April 2012). "No Bollywood for me, can't handle stardom: Adaa Khan". The Times of India. Retrieved 5 August 2016.
  21. Chatterjee, Swasti (13 August 2012). "Adaa Khan wants to do Bollywood item numbers". The Times of India. Retrieved 5 August 2016.
  22. Agarwal, Stuti (25 February 2013). "Adaa Khan inspired by Rekha". The Times of India. Retrieved 5 August 2016.
  23. 23.0 23.1 Maheshwri, Neha (28 August 2013). "Adaa Khan to play a rape victim". The Times of India. Retrieved 5 August 2016.
  24. "Yeh Hai Aashiqui: Adaa Khan plays a rape survivor". IBN Live. 14 September 2013. Archived from the original on 21 జనవరి 2014. Retrieved 5 August 2016.
  25. 25.0 25.1 Kulkarni, Onkar (13 September 2013). "Adaa Khan opts for episodics". The Indian Express. Retrieved 5 August 2016.
  26. 26.0 26.1 "Aashka, Adaa, JD, Nandish to spice up Welcome!". The Times of India. 3 April 2014. Retrieved 5 August 2016.
  27. 27.0 27.1 "Adaa Khan to host The Great Indian Family Drama". Retrieved 6 February 2015.
  28. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Adaa 1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  29. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Adaa 2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  30. ""The wait for Amrit Manthan has been worth it," says Adaa Khan". Retrieved 18 March 2012.
  31. "Adaa Khan to play a maid in Piya Basanti Re". Retrieved 17 September 2014.
  32. "Adaa Khan in Naagin 2". timesofindia.com. Retrieved 8 August 2016.
  33. "Adaa Khan Joins Pardes Mein Hai Mera Dil". timesofindia.com. Retrieved 2 February 2017.
  34. "Box Cricket League Teams: BCL 2014 Team Details With TV Actors & Names of Celebrities". india.com. Archived from the original on 10 సెప్టెంబరు 2015. Retrieved 14 December 2014.
  35. "Sara Khan out of Comedy Nights Bachao; Adaa Khan to take her place". tellychakkar.com. Retrieved 30 August 2015.
  36. "Bigg Boss 9: Gutthi, Siddharth Shukla and Adaa Khan to ring in New Year with the housemates!". DNA.com. Retrieved 31 December 2015.
  37. "200 Actors, 10 Teams, and 1 Winner... Let The Game Begin". The Times of India. Retrieved 4 March 2016.
  38. Goswami, Parismita (22 February 2016). "Comedy Nights Live: Lead actors from 'Naagin,' 'Chakravartin Ashok Samrat' and others to make an appearance". International Business Times, India Edition. Retrieved 2016-03-01.
  39. "Here's why Adaa Khan doesn't want to be a part of Bigg Boss". Retrieved 18 December 2016.
  40. "The Twelfth Indian Telly Awards - Nominate your Favourites". Indiantelevision.com. Archived from the original on 16 అక్టోబరు 2013. Retrieved 29 మార్చి 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=అదా_ఖాన్&oldid=4300672" నుండి వెలికితీశారు